ప్రకాశం

ఆగిన సాగర్ జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, ఏప్రిల్ 3 : జిల్లాలో నీటి ఎద్దడిని తీర్చాలనే ఉద్దేశ్యంతో విడుదల చేసిన సాగర్ జలాలు ఆదివారంతో ఆగిపోయాయి. అయితే జిల్లాకు ఏ ఉద్దేశ్యంతో విడుదల చేశారో ఆ ఉద్దేశ్యం కనీసం 30శాతం కూడా నెరవేరక పోవడం జిల్లా ప్రజల ఆశలు అడుగంటిపోయాయి. నాగార్జునసాగర్‌లోని ఆర్‌పిఆర్ నుండి నీటి విడుదల పూర్తిగా ఆపివేశారు. ప్రకాశం జిల్లాకు 2.33 టిఎంసిల నీరు విడుదల కావాల్సి ఉండగా 1.9 టిఎంసిల నీరు మాత్రమే ఇప్పటి వరకు జిల్లాకు విడుదలైంది. జిల్లాకు రావాల్సిన నీటివాటాను తీసుకురావడంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైనట్లు జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు విడుదలైన నీరు చెరువులను నింపడంలో కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో త్రాగునీటికి ఇవే పరిస్థితులు ఏర్పడితే దర్శి నెదర్లాండ్ ఎయిడెడ్ ప్రాజెక్టు చెరువును నింపడానికి ఉన్న అవకాశాలతో పాటు మరికొన్ని ప్రత్యేక మోటార్లు ఏర్పాటు చేసి వీలైన మేరకు చెరువును నింపేందుకు ప్రయత్నాలు జరిగాయి. కాని ప్రస్తుతం ఉన్న మోటార్లతో మాత్రమే నీటిని నింపేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు చెరువుల్లోకి 28.60 లెవల్‌కు మాత్రమే నీరు చేరింది. నీరు విడుదల కాకముందే 28 బెడ్ లెవల్ ఉండగా కేవలం 60 మీటర్ల ఎత్తుకు మాత్రమే నీరు పెరగడం ఆవేదనకు గురి చేస్తుంది. మరో రెండు, మూడు రోజులు సాగర్ కాలువలో నీరు పంపింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు , మూడు రోజుల్లో ఏ మేరకు చెరువులోని నీటిని పంపింగ్ చేస్తే పట్టణ ప్రజల దాహార్తి కొంత మేరకైనా తీరే అవకాశాలు ఉన్నాయి. సాగర్ డ్యామ్‌లో నీరు తక్కువగా ఉన్నా జిల్లాకు నీటి ఎద్దడిని తీర్చాలని ప్రభుత్వం నీటిని విడుదల చేసినా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలం కావడం బాధాకరం. ఇప్పటి వరకు పంపింగ్ చేసిన నీరు మూడు రోజుల ఒకసారి విడుదల చేసినా పూర్తిగా వేసవిలో నీటి ఎద్దడి తీరదని అధికారులే స్వయంగా చెబుతున్నారు. జిల్లాకు నీటి ఎద్దడికి ప్రత్యేక చర్యలు తీసుకోక పోవడం పట్ల జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.