ప్రకాశం

మరికొన్ని రోజుల్లో చిల్లర నోట్ల సమస్య తీరుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, నవంబర్ 13 : జిల్లాలో మరికొన్ని రోజుల్లో లావాదేవీలు, చిల్లర నోట్ల సమస్య తీరుతుందని కలెక్టర్ సుజాతశర్మ తెలిపారు. ఆదివారం సాయంత్రం కలెక్టర్, ఒంగోలు ఆర్‌డివో, తహశీల్దారులతో నగరంలో పెట్రోల్ బంకులు, బ్యాంకులు, రైతు బజార్లు, మీ సేవా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ గల పరిస్థితులను అధికారులను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నగరంలో గల గద్దలగుంట బ్రాంచి సిండికేట్ బ్యాంకు అధికారులతో మాట్లాడి కరెన్నీ అంశాన్ని డిపాజిట్లు, విత్ డ్రాయల్స్‌పై అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా కర్నూల్ రోడ్డులో గల ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఛీప్ మేనేజర్ సుబ్బారావుతో మాట్లాడుతూ లావాదేవీలు ఏలా జరుగుతున్నాయి, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. మూడు రోజుల్లో సుమారు మూడు కోట్ల రూపాయలు డిపాజిట్లు వచ్చాయని, ఆదివారం విత్ డ్రాయల్స్ పెరిగాయని, ఒక విత్ డ్రాయల్‌కు రెండు వేలకు వంద నోట్లు వినియోగదారులకు అందించడం జరిగిందని కలెక్టర్‌కు ఎపిజిబి మేనేజర్ తెలిపారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల సాయిరత్న ఫిల్లింగ్ స్టేషన్, చుండూరి వెంకటాద్రి ఆయిల్ బంకు, కొణిజేటి బ్రదర్స్ ఆయిల్ బంకులను కలెక్టర్ తనిఖీ చేశారు. పెట్రోల్ బంకు నిర్వాహకులు తమ వద్ద వంద నోట్లు ఉన్నప్పటికీ వినియోగదారులకు పెట్రోల్ పోయాక పోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఒంగోలు నగరంలో ఇండియా కిడ్స్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న కుసుమ జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ బ్యాంకుల్లో కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే వంద నోట్లు ఇస్తున్నారని తెలుపుతూ బజారులో వస్తువులు కొనుగోలు కు ఇబ్బందులకు గురవుతున్నాని ఇంకా ఎక్కువ వంద నోట్లు ఇప్పించేందుకు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో అన్నీ సమస్యలు తీరుతాయని కలెక్టర్ తెలిపారు. అద్దంకి బస్టాండ్ లో గల మీ సేవ కేంద్రాన్ని కలెక్టర్ సమీక్షించారు. మీ సేవ ప్రతినిది శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆరు లక్షల 60 వేల వరకు డిపాజిట్ కేంద్రంలో జరిగిందని కలెక్టర్ కు వివరించారు. కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ వద్ద గల రైతు బజార్ ను కలెక్టర్ సందర్శించి వ్యాపారం ఏలా జరుగుతుందని అక్కడి మహిళా వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. 500 రూపాయల నోట్లు తీసుకుంటున్నారా అని అడిగారు,సమస్యలు ఏమైనా ఉంటే తెలుపాలని , వ్యాపారం బాగా జరుగుతుందా అనిమహిళలను అడుగ్గా వారు బాగా జరుగుతుందని సమాధానం చెప్పారు. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ను కలెక్టర్ పర్యవేక్షించారు. బాపూజీ మార్కెట్ అసోసియేషన్ కార్యదర్శి ఇస్కాల వేణుతో మాట్లాడారు. వ్యాపారం ఏలా నడుస్తుందని అడిగారు, గతంలో రోజుకు ఐదు కోట్ల వరకు జరిగేదని, ప్రస్తుతం ఒక కోటి కూడా జరగడం లేదని కలెక్టర్ కు వివరించారు. రైతు బజార్లవద్ద 500 నోట్ల తీసుకోబడునని ఫ్లెక్సీ బ్యానర్‌ర్పాటు చేయాలని కలెక్టర్ ఆర్‌డివో ను సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఒంగోలు ఆర్‌డివో కె శ్రీనివాసరావు, తహశీల్దార్ సిహెచ్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన
యువకుడు మృతి
ముండ్లమూరు, నవంబర్ 13 : మండలంలోని పోలవరం క్రాస్ రోడ్డు వద్ద మోటార్ సైకిల్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో తూమాటి వెంకటేశ్వర్లు (45) శనివారం తీవ్రంగా గాయపడ్డాడు. పోలవరం గ్రామానికి చెందిన జమ్మలమూడి శ్రీను, తూమాటి వెంకటేశ్వర్లు ఇద్దరూ అద్దంకికి వెళ్లేందుకు తమ స్వగ్రామం పోలవరం నుండి బయలుదేరారు. ఆర్‌అండ్‌బి రోడ్డు పైకి రాగానే అద్దంకి నుండి దర్శి వైపుగా వెళుతున్న లారీ ద్విచక్ర వాహానాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడిన టి వెంకటేశ్వర్లును మెరుగైన వైద్య నిమిత్తం ఒంగోలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటేశ్వర్లు ఆదివారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతునికి భార్య అంజమ్మతో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముండ్లమూరు ఎస్‌ఐ పి బాలరంగయ్య తెలిపారు.
అప్పు వసూలుకు ప్రయత్నించినందుకు
గొడ్డలితో దాడి
- ఒకరికి తీవ్ర గాయాలు
సంతమాగులూరు, నవంబర్ 13 : ఆపద సమయంలో డబ్బుచ్చి ఆదుకుని వాటిని తిరిగా రాబట్టుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై బాకీదారుడు గొడ్డలితో దాడి చేసి గాయపరిచిన సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. బాధితులు బి ఆంజనేయలు కథనం ప్రకారం ఆంజనేయులు గతమూడు సంవత్సరాల క్రితం కుందుర్రు గ్రామానికి చెందిన అడవి పెద శ్రీరాములు ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లిపోతుండటాన్ని చూసి తన సమీప బంధువుగా భావించి లక్షా 80 వేల వరకు అప్పు ఇచ్చాడు. అప్పటి నుండి అనేక సార్లు డబ్బు కోసం ప్రయత్నించినా శ్రీరాములు తిరిగి చెల్లించలేదు. ఈ నేపధ్యంలో నోటు గడువు మూడు సంవత్సరాలు దాటి పోవడంతో ఆంజనేయులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కొంత కాలం వాదనలు జరిగిన తరువాత ఇటీవల శ్రీరాములు ఆస్థుల లావాదేవీలు నిలిపివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అమలు మేరకు శనివారం కోర్టు గుమస్తా గ్రామానికి వచ్చి శ్రీరాములుకు చెందిన ఆస్తులను గుర్తించి వాటిపై గ్రామస్థులెవ్వరూ లావాదేవీలు జరుపరాదని దండోరా వేయించారు. గ్రామంలో తన పరువు పోయిందని ఆగ్రహించిన శ్రీరాములు తన సోదరులు చిన శ్రీరాములు, తిరుపతయ్య, పెద్ద శ్రీరాములు ముగ్గురు ఆంజనేయులుపై దాడి చేసేందుకు పథకం రచించారు. పాల క్యాన్ ఎత్తుకుని వచ్చేందుకు వీధిలోకి వచ్చిన ఆంజనేయులు పై కారం చల్లి గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. ఈదాడిలో ఆంజనేయులు తలకు, చేతికి బలమైన గాయాలు కాగా నర్సరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తనపై దాడి చేసిన వారిలో పేరమ్మ, విజయ, మల్లేశ్వరి అనేమహిళలు కూడా ఉన్నారని బాధితుడు తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవరావు తెలిపారు.