ప్రకాశం

బ్యాంకులు కిటకిట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 13: మూడురోజుల బ్యాంకుల సెలవులు ముగిసి మంగళవారం బ్యాంకు లావాదేవీలు ప్రారంభం కావటంతో ఖాతాదారులు నగదు కోసం బ్యాంకులు, ఎటిఎంల ముందు బారులు తీరారు. జిల్లాలోని ఏ బ్యాంకు చూసినా ఖాతాదారులతో కిటకిటలాడాయి. ఉదయం నుండే బ్యాంకుల వద్ద ఖాతాదారులు బారులు తీరడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం బందోబస్తు చర్యలు చేపట్టింది. కాగా, జిల్లాలోని అన్ని ఎటిఎంల వద్ద ఉదయం నుండి ఖాతాదారులు బారులుతీరడంతో కొద్దిసేపటికే నగదు అయిపోయి ‘నో క్యాష్’ అంటూ బ్యాంకు అధికారులు బోర్డులు పెట్టడటంతో ఖాతాదారులు బ్యాంకర్ల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులోని ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బిఐ ఎటిఎంల వద్ద పెద్దసంఖ్యలో ఖాతాదారులు బారులు తీరారు. తమ నగదును తాము తీసుకునేందుకు కూడా ఇన్ని ఆంక్షాల అంటూ కేంద్రప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కొంతమంది ఖాతాదారులు అయితే ఎన్నికల సమయంలో తమ ప్రతాపాన్ని చూపుతామంటూ బహాటంగానే విమర్శలకు దిగుతున్నారు.
ఇదిలాఉండగా జిల్లాకు 86కోట్ల రూపాయల కొత్తకరెన్సీ వచ్చింది. ఈనగదు జిల్లాలోని అన్ని బ్యాంకులకు పంపిణీచేశారు. బ్యాంకుల స్థాయిని బట్టి నగదు పంపిణీ చేసినప్పటికి ఖాతాదారులకు సరిపడా నగదు రాకపోతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎటిఎంలో రెండువేల రూపాయల నగదు, బ్యాంకుల్లో అయితే నాలుగువేల రూపాయల నుండి పదివేల రూపాయల వరకు ఇస్తున్నారు. కానీ ఆ నగదు కూడా కొంతమందికే తక్కువగా అందుతుండటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నల్లకుబేరుల వద్ద మాత్రం కోట్లాది రూపాయల రెండువేల రూపాయల కొత్తకరెన్సీ బయట పడుతుండగా, బ్యాంకులు, ఎటిఎంల వద్ద క్యూకట్టిన సాధారణ, మధ్యతరగతి ప్రజలకు మాత్రం రెండువేల రూపాయలు దొరకని పరిస్ధితి నెలకొంది. మొత్తంమీద ఈ నోట్ల కష్టాలు ఇంకెన్నాళ్ళు అంటూ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు బ్యాంకర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.