ప్రకాశం

పొదిలిలో స్వైన్‌ఫ్లూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదిలి, జనవరి 20 : పొదిలి పట్టణంలో ఒకరికి సైన్వ్ ఫ్లూ సోకడం కలకలం రేపింది. పొదిలి పట్టణంలో నివసిస్తున్న మహిళా కండెక్టర్ భర్త షేక్ మస్తాన్‌వలి వృత్తిరీత్యా లారీ డ్రైవర్. కాగా గత నాలుగురోజుల క్రితం అతను ఆకస్మికంగా అస్వస్థతకు గురి కావడంతో బంధువులు అతన్ని చికిత్స నిమిత్తం ఒంగోలుకు తరలించగా వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు సిఫార్సు చేశారు. వైద్యుల సలహా మేరకు విజయవాడలోని హాస్పిటల్‌కు తరలించగా అక్కడి వైద్యులు స్వైన్‌ఫ్లూగా అనుమానించి హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. మస్తాన్‌వలి బంధువులు హైదరబాద్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందినప్పటికీ మస్తాన్‌వలి ఆరోగ్యం క్షీణించి ప్రమాదస్థితికి చేరడంతో అక్కడి వైద్యులు లాభం లేదని ఇంటికి తీసుకెళ్లాలని మస్తాన్‌వలి బంధువులకు సూచించారు. ఇక చేసేదేమి లేక మస్తాన్‌వలిని శుక్రవారం రాత్రి అతని స్వగ్రామమైన చీమకుర్తికి తరలించినట్లు సమాచారం. కాగా పొదిలిలో స్వైన్‌ఫ్లూ సోకడం పట్ల పొదిలి పట్టణ ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.