ప్రకాశం

జిల్లాను వెనుకబడిన ప్రాంతంగా ప్రకటించేందుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జనవరి 20 : జిల్లాను వెనుకబడిన ప్రాంతంగా ప్రకటించేందుకు కమిటీ తన వంతు కృషి చేస్తుందని రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ గాలి ముద్దుకృష్ణమనాయుడు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరం హాలులో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో ఏడు జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ప్రకాశం జిల్లా కూడా ఆ జిల్లాల మాదిరిగానే వెనుకబడిన ప్రాంతమని, ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థనను పంపి జిల్లాను వెనుకబడిన ప్రాంతంగా ప్రకటించేందుకు కమిటీ అన్నీవిధాలుగా కృషి చేస్తుందన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి గత పది సంవత్సరాలుగా మూడువేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే నేడు రెండు సంవత్సరాల్లో వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం 90 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ శుక్రవారం జీవో జారీ చేయనున్నదన్నారు. దీంతో ఫ్లోరైడ్ బాధిత ప్రజలకు ఊరట లభించనుందన్నారు. ఫ్లోరోసిస్ గ్రామాల ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. కలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ శాసన మండలి కమిటీ సూచనలు, సలహాలు పాటించి రానున్న రోజుల్లో అన్నీ పనులు పూర్తి చేస్తామన్నారు. జిల్లాకు మూడు డయాలసిస్ యూనిట్లు మంజూరు చేశామన్నారు. కనిగిరి ప్రాంతంలో 113 ఆవాస ప్రాంతాలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు 90 కోట్లతో ప్రతిపాదనలు పంపామని, ఒకటి రెండు రోజుల్లో నిధులు విడుదల అవుతాయన్నారు. అందులో 54 గ్రామాలు ఫ్లోరిన్ బాధిత గ్రామాలు ఉన్నాయన్నారు. అంతే కాకుండా క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహించి ఫ్లోరిన్ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నామని, కలెక్టర్ సుజాత శర్మ తెలిపారు.