ప్రకాశం

మినీ వ్యాను ఢీకొని ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతమాగులూరు,్ఫబ్రవరి 18: మారుతీ మినీవ్యాను ఢీకొని ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడిన సంఘటన స్థానిక సంతమాగులూరు వద్ద శనివారం జరిగింది. ఈ ఘటనలో సంతమాగులూరు గ్రామానికి చెందిన పోలమ్మ (70), కొమ్మాలపాడు గ్రామానికి చెందిన ఆరోగ్యకార్యకర్త రజియాబేగం (47) అక్కడికక్కడే మృతిచెందారు. కాగా ఈ ప్రమాదంలో సంతమాగులూరు జూనియర్ కాలేజిలో జూనియర్ ఇంటర్ చదువుతున్న ప్రభుదాసు, తొమ్మిదవ తరగతి విద్యార్థిని పుణ్యవతికి స్వల్పగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే తెనాలికి చెందిన కొంతమంది మారుతి మినీ వాహనంలో త్రిపురాంతానికి వెళ్లారు. త్రిపురాంతకంనుండి తెనాలి బయలుదేరి వస్తుండగా సంతమాగులూరు మండల కార్యాలయాల వద్దకు వచ్చేసరికి ఎదురుగా అతివేగంగా మోటారు సైకిల్ వస్తుండటంతో దాన్ని తప్పించేందుకు వాహనాన్ని రోడ్డుమార్జిన్‌కు మలిపారు. రోడ్డు పక్కనే నిల్చుని ఉన్న వ్యక్తులపైకి వాహనం దూసుకువెళ్ళటంతో రజియాబేగం, పోలమ్మ, పుణ్యవతి, ప్రభుదాసులకు గాయాలు కాగా వారిలో ఇద్దరు మృతిచెందారు. క్షతగాత్రులు ఇద్దరిని నరసారావుపేట వైద్యశాలకు తరలించారు. మృతుల్లో రజియాబేగానికి ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు, భర్త ఉండగా పోలమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ సందర్భంగా అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను అన్నివిధాల ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విఆర్‌ఒ సుబ్బారెడ్డి ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవరావు తెలిపారు.

త్రిపురాంతకేశ్వర ఆలయ అభివృద్ధికి నిధులు
* టిటిడి ఇఓ సాంబశివరావు స్పష్టం
త్రిపురాంతకం, ఫిబ్రవరి 18: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ త్రిపురాంతకేశ్వర శ్రీబాలాత్రిపురసుందరీదేవి అమ్మవార్ల ఆలయాలకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులు మంజూరు చేయించేందుకు తాను కృషి చేస్తానని టిటిడి ఇఓ సాంబశివరావు అన్నారు. శనివారం శ్రీశైలం వెళ్ళివస్తూ మార్గమధ్యంలో త్రిపురాంతకేశ్వర ఆలయాలను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈకార్యక్రమంలో త్రిపురాంతకం ఇఓ రామకృష్ణశర్మ త్రిపురాంతకేశ్వర ఆలయానికి టిటిడి నుంచి గతంలో నాలుగున్నర కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని, అయితే అప్పుడు స్థలం లేక నేటికీ ఆ నిధులు అందచేయలేదని, అదేవిధంగా శ్రీత్రిపురాంతకేశ్వరస్వామి ఆలయం వద్ద వేద పాఠశాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కోరారు. స్పందించిన సాంబశివరావు మాట్లాడుతూ భూసేకరణ చేసి తనకు నివేదిక పంపితే నాలుగున్నర కోట్ల రూపాయలు టిటిడి నుంచి మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. వేద పాఠశాల గుంటూరు జిల్లా కోటప్పకొండ ఆలయం వద్ద ఉన్నదని, అక్కడ 30 విద్యార్థులతో నిర్వహిస్తున్నారని, విద్యార్థులు ఉంటే అక్కడ చేర్పించాలని అన్నారు. అనంతరం శ్రీత్రిపురాంకేశ్వర శ్రీ బాలాత్రిపురసుందరీదేవి ఆలయాల చరిత్రను అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ సిబ్బంది శ్రీనివాసులరెడ్డి, ఆర్‌ఐ నరసింహారావు, టిడిపి నాయకులు ఎం శ్రీనివాసరెడ్డి, డి చలమయ్య తదితరులు పాల్గొన్నారు.
త్రిపురాంతకేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకు తూర్పు ముఖద్వారమైన శ్రీ త్రిపురాంతకేశ్వర శ్రీబాలాత్రిపురసుందరీదేవి అమ్మవారి ఆలయాలను శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఇఓ డి సాంబశివరావు దంపతులు దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఆలయ ఇఓ రామకృష్ణశర్మ సాంబశివరావు దంపతులకు తీర్థప్రసాదాలు అందచేశారు. శ్రీత్రిపురాంతకేశ్వర ఆలయంలో అభిషేకాలు, శ్రీబాలాత్రిపురసుందరీదేవి ఆలయంలో సహస్రనామ పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో గురురాజారావు, అర్చకులు విశ్వం, ప్రసాదశర్మ, ఆర్‌ఐ నరసింహారావు, ఆలయ సిబ్బంది జి శ్రీనివాసులరెడ్డి, మండల టిడిపి నాయకులు ఎం శ్రీనివాసరెడ్డి, డి చలమయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి కృషి యోజన పథకంపై కలెక్టర్ సమీక్ష