ప్రకాశం

పాత టైర్ల దుకాణంలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగరాయకొండ, ఫిబ్రవరి 20: పట్టణంలోని ఓ పాత టైర్ల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించి సుమారు 10లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగిన సంఘటన సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు మేరకు సింగరాయకొండకు చెందిన రామలింగయ్య అనే వ్యక్తి స్థానిక ఆంధ్రాబ్యాంక్ సమీపంలో టైర్ల వ్యాపారం చేస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున షాపులో విద్యుత్ షార్ట్‌సర్య్కూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగి షాపు పూర్తిగా దగ్ధమై పక్కనే ఉన్న భాస్కర్‌రెడ్డి షాపుకు మంటలు అంటుకున్నాయి. ఈ రెండు షాపులు పూర్తిగా దగ్ధం కావడంతోపాటు పక్కనే ఉన్న ఆంధ్రాబ్యాంక్ మొదటి అంతస్తులోకి మంటలు వ్యాపించి బ్యాంక్‌లోని వైర్లు దగ్ధమయ్యాయి. పరిస్థితిని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో కందుకూరు, టంగుటూరు అగ్నిమాపక సిబ్బంది స్థానిక పోలీసుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆంధ్రాబ్యాంక్‌లోకి మంటలు వ్యాపించి వైర్లు కాలిపోవడంతో సోమవారం బ్యాంక్‌కు సెలవు ప్రకటించారు. ఆంధ్రాబ్యాంక్ జోనల్ మేనేజర్ రమణమూర్తి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.