ప్రకాశం

ఆ బాలిక శవమైంది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ బాలికకు అమ్మలేదు.. తండ్రికి మతిస్థిమితం లేదు. దీంతో మేనత్త వద్దే వుంటుంది. ఏమైందో ఏమో తెలియదు గానీ ఇటీవల మేనత్త కుమారుడు బాలిక అనురాధ (14)పై చేయిచేసుకున్నాడు. అనారోగ్యానికి గురైన బాలికకు వైద్యం చేయించాల్సిన మేనత్త పట్టించుకోలేదు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అమ్మమ్మ వద్దకు పంపించి చేతులు దులుపుకుంది. కొన్నిరోజులుగా వారు వైద్యం చేయించినా ఫలితం లేదు. చివరకు గురువారం రాత్రి శవమైంది. దీంతో మృతురాలి బంధువులు బాలిక మృతిపై పలు అనుమానాలున్నాయని, దోషులను శిక్షించాలని పేర్నమిట్ట సమీపంలోని ర్నూలురోడ్డుపై ధర్నా చేపట్టగా వీరికి గ్రామస్థులు మద్దతుగా భారీగా తరలివచ్చారు.
సంతనూతలపాడు, మార్చి 10 : మండలంలోని పేర్నమిట్ట కర్నూల్ రోడ్డుపై బాలిక మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని బంధువులు మృతదేహంలో కర్నూల్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. గత 15 రోజుల క్రితం అనురాధను మేనత్త కుమారుడు చింతల శ్రీకాంత్ కొట్టాడని, దీంతో ఆమె అనారోగ్యం పాలు కావడంతో ఎలాంటి వైద్యం చేయించకుండా కొన్నిరోజులుగా అనురాధ మేనత్త రమణమ్మ ఇంటి వద్దనే ఉంచుకుంది. బాలిక అనురాధకు తల్లి లేదు. తండ్రికి మతిస్థిమితం లేదు. అనురాధ ఆరోగ్యం క్షీణించడంతో అద్దంకి మండలం నూజిళ్ళపల్లికి చెందిన అమ్మమ్మ సుందరమ్మ వద్దకు మేనత్త పంపింది. అనురాధను తొలుత రిమ్స్‌లోనూ, తదుపరి ఒంగోలులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స చేసిన అనంతరం అక్కడి నుండి మంగళగిరిలోని ఓఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ అనురాధ మృతి చెందింది. దీంతో శుక్రవారం మృతదేహాన్ని బంధువులు రోడ్డుపై పెట్టుకొని రాస్తారోకో చేసి అనురాధ మృతికి కారకులైన దోషులను అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. దీంతో దాదాపు గంటకు పైగా రోడ్డుపై ఇరువైపులా వాహనాలు ఆగి పోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. తాలూకా పోలీసులు వచ్చి నచ్చజెప్పినప్పటికీనీ ఆందోళనకారులు రోడ్డుపై నుండి మృతదేహాన్ని తొలగించలేదు. దీంతో పై అధికారులు వచ్చి న్యాయం చేస్తారని తాలూకా రూరల్ సిఐ మురళీకృష్ణ, 1వ సిఐ ఏల్చూరి రామారావులు బంధువులకు నచ్చచెప్పడంతో మృతదేహాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. దీంతో డిఎస్‌పి శ్రీనివాసరావు వచ్చి అనురాధ మృతికి ఆమె అనారోగ్యం కూడా ఒక కారణమని, అయితే ఎన్‌ఆర్‌ఐలో వైద్యం చేసిన వైద్యులు అనురాధకు దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నట్లు తెలిపారని తెలిపారు. అయితే ఆందోళనకారులు పోస్టుమార్టం చేయకుండా తీసుకురావడం ఏమిటని ప్రశ్నించడంతో పోస్టుమార్టం నివేదిక కూడా మంగళగిరి ప్రభుత్వ వైద్యులు అందజేస్తారని తెలిపారు. బాధితులకు న్యాయం చేసి దోషులను శిక్షించాలని స్థానిక నాయకులు కె శ్రీనివాసరెడ్డి, కె శ్రీనివాసరావు, కె బాబులు డిఎస్‌పికి విన్నవించారు. దోషులను శిక్షించడంలో ఎలాంటి అపోహలకు పాల్పడవద్దని, చట్ట ప్రకారం దోషులను శిక్షించనున్నట్లు డిఎస్‌పి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. దీనికి బాధితులు అంగీకరించలేదు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో మృతురాలి బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
స్కూల్ వ్యాన్ బోల్తా
ఇద్దరు చిన్నారులకు గాయాలు
సియస్‌పురం, మార్చి 10: స్థానిక ఉషోదయ హైస్కూల్‌కు చెందిన టాటా మ్యాజిక్ వాహనం సియస్‌పురం చెరువుకట్టపై అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్కూల్ వ్యాన్ కె అగ్రహారం నుంచి ఐదుగురు విద్యార్థులతో సియస్‌పురం వస్తుండగా సియస్‌పురం చెరువుకట్టపై బోల్తాపడింది. ఈ ఘటనలో గాంధీనగర్‌కు చెందిన సంపత్‌వర్మ, రామాంజనేయవర్మకు గాయాలయ్యాయి. రామాంజనేయవర్మకు కంటిమీద, నుదుటిపై తీవ్రగాయాలు కావడంతో స్థానిక వైద్యశాలకు తరలించగా కుట్లువేసి చికిత్స అందించారు. సంపత్‌వర్మను మెరుగైన చికిత్స నిమిత్తం కనిగిరి ఏరియా వైద్యశాలకు తరలించారు. రామాంజనేయవర్మ పాఠశాలలో 2వ తరగతి చదువుతుండగా, సంపత్‌వర్మ 1వ తరగతి చదువుతున్నాడు. ఇద్దరు విద్యార్థులు పుట్టుకతో మానసిక వికలాంగులు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కదిరి బాబూరావు సంఘటనా స్థలాన్ని పరిశీలిచారు. విద్యార్థులకు మెరుగైన వైద్యచికిత్సలు నిర్వహించాలని వైద్యులకు సూచించారు. లైసెన్సు లేకుండా డ్రైవర్లు వాహనాలను నడిపితే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఉషోదయ స్కూల్‌కు చెందిన టాటా మ్యాజిక్ వాహనం డ్రైవర్, యాజమాన్యంపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ కెవిఎన్ ప్రసాద్ తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.