ప్రకాశం

రోడ్డెక్కిన మానవత్వం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అవును అందరూ ఒక్కటయ్యారు. ఒకే మాటగా నిలబడ్డారు. పోలీసులనూ ఖాతరు చేయలేదు. వీరికి పలువురు మద్దతుగా నిలిచారు. అందరి నినాదం ఒక్కటే బాలిక అనురాధ మృతికి కారకులైన వారిని శిక్షించాలి. న్యాయం కావాలని రోడ్డెక్కారు. బాధితులకు బాసటగా నిలిచారు. మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. నిందితులు పోలీసులకు లొంగిపోయే వరకు ధర్నా చేపట్టారు. చివరకు నిందితులు పోలీసులకు లొంగిపోయారు.ఈ ఘటన పేర్నమిట్ట సమీపంలోని కర్నూలు రోడ్డుపై శనివారం సంచలనం రేకెత్తించింది.’’
సంతనూతలపాడు, మార్చి 11 :
1సంతనూతలపాడు మండలంలోని పేర్నమిట్ట గ్రామానికి చెందిన మాదాసు అనురాధ (14) అనే మైనర్ బాలిక మృతికి కారణమైన చింతల శ్రీకాంత్ తదితరులను వెంటనే అరెస్టు చేయాలని శనివారం గ్రామస్థులు ముక్తకంఠంతో కర్నూల్‌రోడ్డుపై బైఠాయించారు. దీంతో రహదారికి ఇరువైపులా అధికసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఒంగోలుకు చెందిన తాలూకా, 1వ టౌన్, 2వ టౌన్ సిఐతో పాటు ఆందోళనకారులను రోడ్డుపై బైఠాయించడం తగదని, ప్రయాణికులను ఇబ్బంది కలిగించే పద్దతి సరికాదని మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించుకోవాలని ఎంతసేపు నచ్చజెప్పినప్పటికీ బాధితులు ఆలకించకుండా తమకు న్యాయం జరగాలంటూ కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలంటూ రోడ్డుపై మృతదేహంతో బైఠాయించారు. దోషులు అందుబాటులో ఉన్నప్పటికీ దోషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, బాధితురాలికి న్యాయం జరగకుండా దోషులకు ప్రజా ప్రతినిధులు, పోలీసులు కొమ్ము కాస్తున్నారని రోడ్డుపై నినాదాలు చేశారు. చిన్నపాటి దొంగతనం కేసులో నిందితులను అరెస్టు చేసే పోలీసులు మైనర్ బాలికను అమానుషంగా మానభంగం చేసి హత్య చేసిన చింతల శ్రీకాంత్‌ను కాపాడేందుకు పోలీసులు, ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నారని, పోలీసులు తలచుకుంటే నిందితులను పట్టుకోవడం వారికేమి కష్టం కాదన్నారు. అయినప్పటికీ శుక్రవారం నిందితులు అందుబాటులో ఉన్నప్పటికీ పోలీసుల నిర్లక్ష్యం వలన వారు పక్కకు వెళ్లారని రోడ్డుపై నినాదాలు చేశారు. మహిళలు రోడ్డుపైకి రావాలంటేనే ఏం జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై నిర్భయ కేసు పెట్టి ఉరితీయాలని మహిళలు నినాదాలు చేశారు. ఊరంతా ముక్తకంఠంతో నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఘోషిస్తున్నా అది పోలీసులకు వినిపించడం లేదని వాపోయారు. చివరికి డిఎస్‌పి శ్రీనివాసరావు వచ్చి ప్రయాణికులకు ఆందోళనకారులు అంతరాయం కలిగించవద్దని పక్కకు తోసివేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అయినా బాధితులు మృతదేహం ఉన్న వాహనం ముందు బైఠాయించారు. రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ తమ్మిశెట్టి రమాదేవి కూడా బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులకు, బాధితులకు చెప్పినప్పటికీ సత్వర న్యాయం జరగాలని పట్టుబడుతూ మృతదేహాన్ని ముందుకు కదలనివ్వలేని పరిస్థితి. అంతకు ముందు ఉదయం రిమ్స్ వద్ద మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించే సమయంలో అధికార పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా సిపిఎం నాయకులు ఉబ్బా ఆదిలక్ష్మీ, నెర్సుల మాలతి, ఎస్‌కె మాబు, నెర్సుల వెంకటేశ్వర్లు, బంకా సుబ్బారావు, దాసరి చినబాబుతో పాటు వందలాదిగా గ్రామస్థులు పాల్గొని అనురాధ మృతికి కారకులైన వారిపై చర్యలపై తీసుకొని సత్వరమే న్యాయం చేయాలని రాత్రి పొద్దుపోయేంత వరకు రోడ్డుపై బైఠాయించారు. అనురాధ మృతికి కులాలు, మతాలతో సంబంధం లేకుండా మహిళలు అధికసంఖ్యలో హాజరై దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తూనే ఉన్నారు.
లొంగిపోయన నిందితులు
మాదాసు అనురాధ మృతికి సంబంధించి మేనత్త చింతల రమణమ్మ, ఆమె కుమారుడు చింతల శ్రీకాంత్ ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్‌లోలొంగిపోయినట్లు డిఎస్పీ కె శ్రీనివాసరావు తెలిపారు. కేసును దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలపడంతో బాధితులు, గ్రామస్థులు ఆందోళన విరమించారు. వీరికి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి బాధితుల పక్షాల నిలబడి నిందితులకు శిక్షపడే విధంగా సహకరిస్తామని అనూరాధ తరపు బంధువులకు హామీ ఇచ్చి, పోలీసులతో కూడా మాట్లాడి ఇరువర్గాలను శాంతింపచేశారు.