ప్రకాశం

ఇన్‌చార్జులు,శాసనసభ్యుల పనితీరుపై వైకాపా సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మార్చి 26: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయటమేకాకుండా,ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు, ఇన్‌చార్జుల పనితీరు, రానున్న ఎన్నికల్లో పార్టీ వ్యవహరించాల్సిన వ్యూహంపై సమగ్ర సర్వే చేపడుతున్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. ఈపాటికే రాష్టప్రార్టీ ఎన్నికల మేనేజ్‌మెంట్ ఆర్గనైజర్ ప్రశాంత్‌కిశోర్ ఆధ్వర్యంలో ఒక సర్వే, వైకాపా నాయకుల అంతర్గతసర్వే మరొకటి జరుగుతున్నట్లు పార్టీవర్గాల ద్వారా తెలిసింది. 2014 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి తరపున ప్రచారకర్తగా ప్రశాంత్‌కిశోర్ వ్యవహరించి సఫలీకృతులైనట్లు సమాచారం. ఆయన ఎన్నికల సమయంలో వ్యవహరించాల్సిన వ్యూహాలు, ప్రచారాలు వంటివాటిలో దిట్టగా పేరున్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగానే కేంద్రంలోని బిజెపికి ఆయన ప్రచారకర్తగా పనిచేయటంతో ప్రస్తుతం తెలంగాణాలో కాంగ్రెస్‌పార్టీకి, రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి ప్రచారకర్తగా ఉన్నారు. గత సంవత్సరం నుండి వైకాపాకు ఆయన సేవలు అందిస్తున్నట్లు తెలుస్తొంది. ప్రధానంగా రాష్ట్రం, జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఇన్‌చార్జులు, శాసనసభ్యుల పనితీరుతోపాటు, ప్రచారపరంగా ఏవిధంగా వ్యవహరించాలనే విషయంపై ఆయన సమగ్రమైన సర్వేలో మునిగితేలుతున్నట్లు సమాచారం.
ఈసంవత్సరం జూన్‌నాటికి ప్రస్తుతం ఉన్న ఇన్‌చార్జులు, శాసనసభ్యుల పనితీరుపై రాష్టప్రార్టీకి ప్రశాంత్‌కిశోర్‌తోపాటు, రాష్టప్రార్టీ నిర్వహిస్తున్న అంతర్గత సర్వే నివేదిక జగన్‌కు సమర్పించే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికలు వైకాపాకి చావో రేవోలాగా మారటంతో ప్రతి నియోజకవర్గం కీలకంగానే మారింది. ఈ నేపధ్యంలో గెలుపుగుర్రాలకే టిక్కెట్లను జగన్ ఇవ్వనున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి అన్ని కోణాలను పరిశీలించిన మీదటనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వైకాపా ముఖ్యనేతలు పేర్కొంటున్నారు. రానున్న ఎన్నికల్లో వామపక్షాలతో కూడా పొత్తుఉండే అవకాశం ఉంటుందని వైకాపా ముఖ్యనేత ఒకరు వెల్లడించటం జరిగింది. దీన్ని బట్టిచూస్తే రానున్న ఎన్నికలు వైకాపాకి ఎంత కీలకంగా మారాయో అర్ధవౌతుంది.
ప్రధానంగా ఆర్థికంగా, సామాజిక పరంగా ప్రస్తుతం ఉన్న వైసిపి ఇన్‌చార్జులు, శాసనసభ్యులు వచ్చేఎన్నికలకు సరిపోతారా లేక చాలరా అన్న కోణంపై కూడా సమగ్ర సర్వే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆర్థిక, అంగబలం ఉన్న నేతలకే ఈసారి టిక్కెట్లు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందువలన ఈసారి డమీ అభ్యర్థులకు టిక్కెట్లు వచ్చే అవకాశాలు కనుచూపుమేరలో కనిపించటం లేదు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఇన్‌చార్జులకు టిక్కెట్లు వస్తాయో లేక వారి స్థానాల్లో బిగ్‌షాట్స్ వస్తారో వేచిచూడాల్సి ఉంది. మొత్తంమీద జూన్ నాటికి ప్రస్తుతం ఉన్న ఇన్‌చార్జులు, శాసనసభ్యుల పనితీరుపై క్లారిటీ వచ్చే అవకాశాలుండటంతో ఆ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.