ప్రకాశం

అయోమయంగా ఫిజిక్స్ ప్రశ్నాపత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం టౌన్, మార్చి 28: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల్లో ఫిజిక్స్ ప్రశ్నాపత్రం విద్యార్థులను అయోమయానికి గురి చేసిందని, నష్టపోయిన విద్యార్థులకు అదనపు మార్కులు కలిపి ఆదుకోవాలని ఎస్వీకెపి కళాశాల భౌతికశాస్త్రం సీనియర్ అధ్యాపకులు పబ్బిశెట్టి సతీష్‌బాబు, ఏనుగుల రవికుమార్‌లు మంగళవారం ఒక ప్రకటనలో యూనివర్సిటీ అధికారులను కోరారు. ఒక్కొక్క సెమిస్టర్‌లో ఒక్కొక్క విధంగా ప్రశ్నల సరళి, మోడల్ పేపర్ ఉండటంతో విద్యార్థులు ఏ విధంగా సన్నద్ధం అవ్వాలో అర్థం కాక తికమకపడ్డారని అన్నారు. గతంలో జరిగిన సెమిస్టర్ ప్రశ్నాపత్రం మాదిరిగా ఉంటుందని ఊహించిన విద్యార్థులకు మంగళవారం జరిగిన ఫిజిక్స్ ద్వితీయ సంవత్సరం ప్రశ్నాపత్రం అవాక్కయ్యేలా చేసిందని తెలిపారు. నాల్గవ సెమిస్టర్‌లో సెక్షన్ ఎఎం మొదటి ప్రశ్నలో 20మార్కుల ప్రశ్నను 10మార్కుల ప్రశ్నగా ఇవ్వడం జరిగిందని, సెక్షన్ బి, సిలో చాయిస్ లేకుండా ఇవ్వడంతో విద్యార్థులు మార్కులను నష్టపోయారన్నారు. గతంలో సెక్షన్ బిలో ఐదు ప్రశ్నలు ఇచ్చి మూడు ప్రశ్నలు రాయాలని, సెక్షన్ సిలో ఐదు లెక్కల ప్రశ్నలు ఇచ్చి రెండు ప్రశ్నలు రాయాలని ఇచ్చేవారని, ఈ సారి సెక్షన్ బిలో ఐదు ప్రశ్నలు ఇచ్చి ఐదు రాయమని, సెక్షన్ సిలో ఐదు లెక్కలు ఇచ్చి ఐదు లెక్కలు రాయమని ఇచ్చారని అన్నారు. సెక్షన్ బిలోని ప్రశ్నలకు మూడు మార్కులుగా, సెక్షన్ సిలో ప్రశ్నలకు రెండుమార్కులుగా కేటాయించడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారని, జరిగిన తప్పును గ్రహించి విద్యార్థులకు అదనపు మార్కులు కలిపి న్యాయం చేయాలని వారు కోరారు.