ప్రకాశం

‘జామాయిల్, సుబాబుల్ రైతుల సమస్యలు పరిష్కరించాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,ఏప్రిల్ 30:జిల్లాలోని జామాయిల్,సుబాబుల్ రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆదివారం స్థానిక సిపిఐ జిల్లాకార్యాలయంలో జరిగిన రైతు సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. సుబాబుల్ రైతుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌సమావేశం జరగ్గా ఈసమావేశానికి రైతు సంఘం జిల్లాకార్యదర్శి పివి శేషు అధ్యక్షత వహించారు. రౌండ్‌టేబుల్ సమావేశాన్ని జామాయిల్,సుబాబుల్ రైతుల సంఘం రాష్ట్రప్రధానకార్యదర్శి వడ్డే హనుమారెడ్డి ప్రారంభించారు.
ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ గత రెండుసంవత్సరాలనుండి కర్రధర తగ్గి రైతాంగం తీవ్రమైన నష్టాలకు గురౌతున్నారని తెలిపారు. అయితే రాష్టస్ధ్రాయి మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులను మార్కెట్‌శాఖ మంత్రిని కలిసినప్పటికీ వారిలో ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. కంపెనీ యజమాన్యాల కోరికమేరకు ఏజిల్లాకు ఆ జిల్లా ధరలను నిర్ణయిస్తూ జివో 143ను విడుదల చేయటం కంపెనీలకు వ్యాట్ ట్యాక్స్ రాయితీని కల్పించటం,రైతాంగ వ్యతిరేక చర్య అని విమర్శించారు. వ్యాపారులకు అనుకూలమైన వైఖరిని ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. రెండుసంవత్సరాలనుండి సుబాబుల్,జామాయిల్ కర్ర కొనుగోలుకు సంబంధించి ఎస్‌పిఎం కంపెనీ రైతులకు బకాయిలు చెల్లించకపోయినప్పటికి రాష్ట్రప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధకరమన్నారు.
జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరి రంగారావు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వ వైఖరి కారణంగా జామాయిల్, సుబాబుల్ రైతులేకాకుండా ఆ రంగంపై ఆధారపడి ఉపాధిపొందే వ్యవసాయకార్మికులను రైతు మహిళలను సమీకరించి ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రిని కలిసి సమస్యను వివరించినప్పటికి ఫలితం లేదన్నారు. ఆచార్య కిసాన్ రంగా సంస్ధ కార్యదర్శి చుంచు శేషయ్య మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో సహజ ఆర్ధిక సూత్రాలు కూడా పనిచేయటం లేదని ఉత్పత్తి తగ్గినప్పటికి గిట్టుబాటుధరలు రైతులకు రావటం లేదన్నారు. ఎపిరైతు సంఘం జిల్లాకార్యదర్శి పమిడి వెంకట్రావు మాట్లాడుతూ పాలకవర్గాలు పూర్తిగా వ్యాపారులకు అనుకుల వైఖరిని అవలంభించటంవలనే సుబాబుల్, జామాయిల్ రైతులకు ఇలాంటి పరిస్ధితులు ఏర్పడి సమస్య పరిష్కారం కావటం లేదని విమర్శించారు. వైఎస్‌ఆర్ కిసాన్ విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులకు అనుకూల వాగ్ధానాలు చేసినటువంటి ప్రభుత్వం ఆతరువాత రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంభించటం విచారకరమన్నారు. సుబాబుల్, జామాయిల్ రైతుల సమస్యల పరిష్కారంకోసం ఏ ఉద్యమాన్ని చేపట్టినా అందుకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. జామాయిల్, సుబాబుల్ రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె వీరారెడ్డి మాట్లాడుతూ సుబాబుల్,జామాయిల్ రైతుల సమస్యల కోసం గిట్టుబాటు ధరల కోసం తీవ్రమైన ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈసమావేశంలో నాయకులు సిహెచ్ వాసు,బెల్లం ప్రసాదు, నాగార్జున, గాదె సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.