ప్రకాశం

జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుల్లలచెరువు, మార్చి 25: జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలు రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు, రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షులు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం మండలంలోని ముటుకుల దగ్గర 85/3 మైలురాయి వద్ద సాగర్ కాలువను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగర్ కాలువకు రెండు టిఎంసిల నీటిని విడుదల చేశామని, చాలని పక్షంలో మూడు టిఎంసిలకు కృషి చేస్తామని వారు అన్నారు. ఈయన వెంట ఎన్‌ఎస్‌పి కెనాల్ సిఇ వీర్రాజు, పర్చూరు ఎమ్మెల్యే ఎ సాంబశివరావు, మార్కాపురం టిడిపి ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ సంజీవి పాల్గొన్నారు.
వడదెబ్బకు ఒకరు మృతి
దొనకొండ, మార్చి 25: దొనకొండలోని వీరవెంకటాపురంలో వడదెబ్బకు గురై ఒకరు మృతిచెందిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. పూల నాసర్ (38) గత రెండురోజులుగా పనులపై తిరుగుతుండటంతో వడదెబ్బ తగిలి శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నాసర్‌కు భార్య, నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. నాసర్ మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరారు.