ప్రకాశం

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యద్దనపూడి, ఏప్రిల్ 9: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషిచేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎస్సీ కాలనీలోని అంబ్కేదర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం మండలంలోని వింజనంపాడు గ్రామంలో శనివారం రూ.కోటి 65లక్షల నిధులతో అభివృద్ధి చేసిన కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజులకే చంద్రబాబు నాయుడు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సిమెంటు రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం భూగర్భ జలాలను పెంపొందించేందుకు నీరు చెట్టు కార్యక్రమాల ద్వారా గ్రామాల్లోని తాగునీటి చెరువులు, పొలాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసిందన్నారు. రైతులకు తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంటలను కాపాడుకునేందుకు స్ప్రింకర్లను సబ్సిడీపై అందజేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో కోతలు లేకుండా నిరంతర విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద వారికి త్వరలో 6 లక్షల ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తుందని అన్నారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించేందుకు రూ.15వేలు ప్రభుత్వం అందజేస్తున్నట్లు తెలిపారు. ఎన్టీ ఆర్ వైద్యసేవ పధకం కింద ప్రతి కుటుంబానికి రూ.2లక్షల 50వేలు వైద్య ఖర్చుల కింద అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ యద్దనపూడి మండలంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. వింజనంపాడు నుంచి పసుమర్రు వరకు రూ.కోటి 87లక్షలతో 4 కిలోమీటర్లు బిటి రోడ్డు ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామంలో రూ.17లక్షల 32 వేలతో సిమెంటు రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. రూ.15లక్షలతో వింజనంపాడు రోడ్డు నుంచి అన్నంబొట్లవారిపాలెం రోడ్డుకు కల్వర్టులు, గ్రావెల్ రోడ్డు నిర్మించినట్లు చెప్పారు. రూ.5లక్షల 50వేలతో ఎన్టీఆర్ సుజల పథకం గ్రామంలో తాగునీటి సమస్య తీర్చేందుకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎంపి శ్రీరాం మాల్యాద్రి మాట్లాడుతూ వింజనంపాడు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టిందని ఆయన అన్నారు.
రూ.80లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన :
మండలంలోని పోలూరు గ్రామం నుంచి శ్యామలవారిపాలెం రహదారికి, పోలూరు గ్రామంలోని సిమెంటు రోడ్ల అభివృద్ధికి రూ.80లక్షల నిధులతో శంకుస్థాపన కార్యక్రమాన్ని వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు డైరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, జడ్పిటిసి ఇంటూరి సౌజన్య, ఎంపిపి వేల్పుల దేవమ్మ, పర్చూరు మార్కెట్ యార్డు చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య చౌదరి, టిడిపి నాయకులు అంచా నాగేశ్వరరావు, గ్రామ సర్పంచి సుబ్బరామయ్య, జన్మభూమి కమిటీ సభ్యులు ఎన్ రంగయ్యచౌదరి, ఆర్ సీతయ్య, ఇ మురళి, వి మహేంద్ర, తొండెపు ఆదినారాయణ, కామేపల్లి హరిబాబు, రజాక్, బండి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రాచీన దేవాలయాలను టూరిజం హబ్‌లుగా
మార్చడమే సిఎం ధ్యేయం
* మంత్రి శిద్దా రాఘవరావు స్పష్టం
మార్కాపురం టౌన్, ఏప్రిల్ 9: రాష్ట్రంలోని ప్రాచీన దేవాలయాలను టూరిజం హబ్‌లుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు, రవాణశాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. శనివారం రాత్రి శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవలకాలంలో సింహాచలం, అన్నవరం, శ్రీకాళహస్తి, తిరుపతి, శ్రీశైలం దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అన్నారు. అలాగే అతి ప్రాచీనమైన మార్కాపురం శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఎంఎల్‌సి మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో దేవాలయాలను ఒక వలయంగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేసి హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ ధర్మకర్తగా యక్కలి కాశీవిశ్వనాథం, సభ్యులుగా లఘుమారపు శ్రీనివాస్, మేడ వెంకటనాగప్రసాద్, గ్రంధిశిల రామలక్ష్మయ్య, మాలపాటి వెంకటరెడ్డి, చకిలం వెంకటనారాయణరావు, తోట నరసింహులు, పిన్నిక నాగేశ్వరరావు, చిలకపాటి చెన్నమ్మ, నంద్యాల తిరుమలచార్యులుచే ఆలయ కార్యనిర్వాహణాధికారి రమేష్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈసందర్భంగా మార్కాపురం మాజీఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని, వెండి రథాన్ని చేయించేందుకు నూతన పాలకవర్గం కృషి చేయాలని సూచించారు. యక్కలి కాశీవిశ్వనాథంకు సౌమ్యుడిగా, వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు ఉందని, గతంలో మున్సిపల్ చైర్మన్‌గా పోటీ చేయమని ఒత్తిడి తెస్తే కొన్ని అవాంతరాల కారణంగా చేయలేకపోయారని, అందుకోసం ఈ అవకాశాన్ని ఇచ్చి రాజకీయంగా ప్రోత్సాహం కల్పించేందుకు చైర్మన్‌గా నియమించినట్లు తెలిపారు. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ ఆలయాల పవిత్రతపై పాలకవర్గం దృష్టి సారించాలని, అందుకు అధికారులు కూడా సహకరించాలని, పూజారులు కూడా తమ విధులపట్ల అత్యంత విశ్వసనీయంగా పనిచేసి దేవుడి కోసం వచ్చే భక్తులను నిరాశపరచకుండా పూజలు నిర్వహించి తృప్తిపరచాలని సూచించారు. ఆలయ ఆర్థికాభివృద్ధితోపాటు విధివిధానాలలో కూడా మార్పులు తీసుకురావాలని సూచించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ రాధిక మల్లికార్జున్, ఆర్డీఓ కె చంద్రశేఖరరావు, ఒంగోలు ఎఎంసి చైర్మన్ ఘనశ్యాం, మాజీ మున్సిపల్ చైర్మన్ జక్కా లక్ష్మీప్రకాశరావు, యక్కలి శ్రీనివాసులు, మంత్రి సతీమణి లక్ష్మీపద్మావతి, ఎఎంసి చైర్మన్ డివి కృష్ణారెడ్డి, టిడిపి మైనార్టీ నాయకులు షేక్ బాదుల్లా, పలువురు కౌన్సిలర్లు, టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

27న వెలుగొండ ప్రాజెక్టును
పరిశీలించనున్న ముఖ్యమంత్రి
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, ఏప్రిల్ 9:ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 27న జిల్లాకు రానున్నట్లు సమాచారం. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి పశ్చిమప్రాంత వరప్రసాదిని అయిన వెలుగొండ ప్రాజెక్టును పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. అదేరోజు ప్రాజెక్టులపై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. రాష్టవ్య్రాప్తంగా ముఖ్యమంత్రి ప్రాజెక్టుల బాట పట్టనున్న నేపధ్యంలో జిల్లాలోని వెలుగొండప్రాజెక్టును పరిశీలించటంతో గుండ్లకమ్మ రిజర్వాయరు నిర్మాణం,తదితర అంశాలపై అదికారులతో సమీక్షించనున్నారు. వెలుగొండప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఈనేపధ్యంలో పనులపై రాష్ట్రప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నట్లు సమాచారం. మొత్తంమీద ఈనెల 27వతేదీన వెలుగొండప్రాజెక్టును ముఖ్యమంత్రి పరిశీలించే అవకాశం ఉండటంతో ఆ సమాచారం అధికారికంగా ఒకటి రెండురోజుల్లో జిల్లాకేంద్రానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది.

రహదారి విస్తరణ పనులకు వాహనాల దారి మళ్లింపు
* వాహనాలను అడ్డుకున్న గ్రామస్థులు
కురిచేడు, ఏప్రిల్ 9: మండల కేంద్రమైన కురిచేడులో 3కోట్ల 80లక్షల రూపాయలతో నిర్మిస్తున్న రహదారి విస్తరణ పనులకు గాను వాహనాల దారి మళ్లింపు కారణంగా దుమ్ము ధూళి తమ గృహాలను కప్పివేస్తూ శ్వాస పీల్చుకునేందుకు ఇబ్బందికరంగా ఉందని గ్రామస్తులు వాహనాల రాకపోకలను శనివారం మధ్యాహ్నం అడ్డుకున్నారు. కురిచేడు మెయిన్‌రోడ్డులో సిమెంటురోడ్లు నిర్మిస్తున్నందున వాహనాల రాకపోకలను దారిమళ్ళించారు. కురిచేడులోని వాల్మీకిబజారు, కొండతట్టుప్రాంతం, ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్యకేంద్రం వెనుక నుంచి ఎన్‌ఎస్‌పి కాలనీ సమీపంలో వాహనాలు రోడ్డు ఎక్కేవిధంగా దారిమళ్లించారు. అయితే కొండతట్టుప్రాంతం, ప్రాధమిక ఆరోగ్యకేంద్రం వెనుకవైపు మట్టిరోడ్డు కావడంతో వాహనాల రాకపోకలతో దుమ్ముధూళి ఎగిసి ఇళ్ళను కప్పివేయడంతోపాటు అక్కడ నివసించే ప్రజలకు శ్వాస పీల్చుకోవడం కూడా కష్టతరం కావడంతో ఆ ప్రాంతప్రజలు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో విషయం తెలుసుకున్న ఎస్సై కిశోర్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రజల గోడు విన్నారు. దీంతో ఎస్సై సదరు రోడ్డు కాంట్రాక్టర్‌ను పిలిపించి ఆప్రాంత ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. అక్కడి ప్రజల విజ్ఞప్తి మేరకు కాంట్రాక్టర్ దుమ్ముధూళి లేవకుండా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రోడ్డుపై నీళ్ళు చిమ్మించి జాగ్రత్తలు తీసుకుంటామని ప్రజలకు తెలపడంతో వారు ఆందోళన విరమించి వాహనాల రాకపోకలకు దారిచ్చారు.