క్రైమ్/లీగల్

పథకం ప్రకారమే భార్య హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, మార్చి 12: ఓ పథకం ప్రకారమే భార్యను హత్య చేశాడని, అందుకు ఆమెపై ఉన్న అనుమానే పెనుభూతమని మార్కాపురం డిఎస్పీ ఎన్‌వి రామాంజనేయులు తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దారవీడు మండలంలోని ప్రగళ్ళపాడు గ్రామానికి చెందిన గుండ్లా వెంగళయ్యకు అదేమండలంలోని బద్వీడు గ్రామానికి చెందిన నాగమణిని ఇచ్చి 2011లో వివాహం జరిపారు. వీరికి ఇరువురు కుమార్తెలు. వివాహం అనంతరం మార్కాపురం, జి ఉమ్మడివరం, మేళ్ళవాగు, యర్రగొండపాలెం గ్రామాల్లో నివాసం ఉంటూ మద్యానికి బానిసై భార్య నాగమణిని శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. కాగా ఈఏడాది ఫిబ్రవరి 12వతేదిన వెంగళయ్య కుటుంబాన్ని బద్వీడుకు తీసుకువచ్చి పనులకు వెళ్ళి సక్రమంగా కుటుంబాన్ని పోషించుకోవాలని హితవుపలికారు. అయితే తాను అత్తవారి ఇంట్లో ఉండనని వేరే ఇంట్లో కాపురం పెడితే ఉంటానంటూ నాగమణిని నమ్మపలికాడు. దీనితో అదేగ్రామంలో మరోక ఇల్లు తీసుకొని ఈనెల 8వతేదిన సంసారం పెట్టారు. ముందస్తుగా వేసుకున్న పథకంప్రకారం అదేరోజురాత్రి ఫుల్‌గా మద్యం సేవించి వచ్చి ఇంటిలో నిద్రిస్తున్న భార్య నాగమణి గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. అత్తలక్ష్మీదేవి ఇంట్లో ఉండి భార్యను హత్య చేయాలంటే బావమరిది, అత్త అడ్డువస్తారని భావించి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వేరే కాపురం పెట్టించి హత్య చేసినట్లు డిఎస్పీ రామాంజనేయులు తెలిపారు. ఆదివారం మార్కాపురం సీఐ భీమానాయక్ ఆధ్వర్యంలో నిందితుని కోసం వేట ప్రారంభించగా బద్వీడులోని జడ్పిహెచ్‌ఎస్ స్కూల్ వద్ద ఉన్నట్లు సమాచారం రావడంతో అదుపులోనికి తీసుకొని సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచినట్లు డిఎస్పీ తెలిపారు. పాత్రికేయుల సమావేశంలో సీఐ భీమానాయక్, పెద్దారవీడు ఎస్‌హెచ్‌ఓ రాజ్‌కుమార్, సిబ్బంది పి శివకుమార్, యేసయ్యనాయక్, డి రమణలు పాల్గొన్నారు.