ప్రకాశం

జిల్లా అభివృద్ధిలో నిరంతర కృషివలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఏప్రిల్ 20: జిల్లాకలెక్టర్ వినయ్‌చంద్ పదవీబాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలో తనదైన శైలిలో జిల్లా అభివృద్ధికి అంకితభావంతో కృషిచేస్తున్నారు. వివిధ ప్రభుత్వ పథకాల అమలులోప్రత్యేకచొరవ చూపి నిర్ణీత లక్ష్యాలను అధిగమించి జిల్లాను అగ్రస్ధానంలో నిలపటం అందుకు నిలువెత్తు నిదర్శనం. జిల్లాలో విస్తృతంగా పర్యటనలు చేసి ప్రజలతో మమేకమవుతూ, జిల్లా యంత్రాంగానికి ఎప్పటికపుడు సలహాలు, సూచనలు అందించి అప్రమత్తం చేస్తూ ప్రభుత్వ పథకాలు పేదప్రజలకు చేరువయ్యేలా శ్రమిస్తున్నారు. జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కూలీలకు పెద్దఎత్తున జీవనోపాధి కల్పించి ఆదుకున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 4.05లక్షల కుటుంబాలకు ఉపాధి పనులు కల్పించి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపారు. అలాగే 6.74లక్షల కూలీలకు ఉపాధితోపాటు లేబర్ బడ్జెట్‌ను 106.1శాతం సాధించి రాష్ట్రంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపారు. జిల్లాలో 2.39కోట్ల పనిదినాలు కూలీలకు కల్పించి 601కోట్లరూపాయలు ఖర్చుచేయటం ద్వారా జిల్లా రెండవ స్థానం ఆక్రమించింది. జిల్లాలో 83898కుటుంబాలకు వందరోజుల పనిదినాలు కల్పించి రాష్ట్రంలో రెండవ స్థానం దక్కించుకుంది. కూలీలకు మూడురోజుల్లో చెల్లింపులు చేయటం ద్వారా జిల్లా మూడవస్థానంలో నిలచింది. జిల్లాలో ఉద్యాన శాఖ ద్వారా 1.26లక్షల చదరపు మీటర్ల షెడ్ నెట్ల నిర్మాణాలు, 151 పంటకుంటలు, 15 సామూహిక కుంటల తవ్వకం, 650 శీతల గిడ్డంగులు, రెండు పరిపక్వత గదులు, రెండు విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పటంలో జిల్లా అగ్రస్థానంలో నిలచింది. రాష్ట్భ్రావృద్ది ప్రణాళిక కింద పలు పథకాల అమలుకు 11.79 కోట్ల రూపాయల రాయితీలను లబ్ధిదారులకు అందచేయటం ద్వారా జిల్లా మొదటిస్థానం దక్కించుకుంది. సమగ్ర ఉద్యానాభివృద్ది మిషన్ కింద వివిధ పథకాల అమలుకోసం 10.79 కోట్లరూపాయల రాయితీలను లబ్ధిదారులకు అందచేసి జిల్లా రెండవస్థానంలో నిలచింది. జిల్లాలో సూక్ష్మసాగునీటి ప్రాజెక్టు కింద బిందు, తుంపర్ల సేద్యం ద్వారా గతంలో 42వేల హెక్టార్లల్లో సాగుకాగా ఈ ఒక్క సంవత్సరంలోనే 15140 హెక్టార్లల్లో సాగు జరిగి 12575 మంది రైతులకు లబ్ధిచేకూర్చటం చెప్పుకోదగిన విశేషం. వ్యవసాయాన్ని లాభసాటి చేయాలనే తలంపుతో జిల్లాలోని రైతులకు రైతురథం పథకం కింద 735ట్రాక్టర్లు, 361095 భూసార పరీక్షల కార్డులు పంపిణి చేసారు. జన్మభూమి-మాఊరు కార్యక్రమం సందర్భంగా జిల్లాలో 98892 అర్జీలు అందగా 99.97శాతంతో 98864 అర్జీలు పరిష్కరించారు. పశువుల మేతకు కొరత లేకుండా ఊరూర పశుక్షేత్రాల పథకం కింద 3702 ఎకరాల్లో పశుగ్రాసం పెంచటం ద్వారా రాష్ట్రంలో జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. చేపల వేట విరామ పరిహారం కింద 9973 మంది మత్స్యకారులకు 3.99 కోట్లరూపాయలు అందచేసారు. అద్దంకి మండలం చక్రాయపాలెం గ్రామంలో కోటిరూపాయల వ్యయంతో నూతనంగా చేపపిల్లల ఉత్పత్తికేంద్రాన్ని నిర్మించారు. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద 19580గృహాలను నిర్మించి 194.42కోట్లరూపాయలు ఖర్చుచేసారు. బ్యాంకు లింకేజి కింద గతంకంటే అధికంగా రికార్డు స్థాయిలో 39939 స్వయం సహాయక సంఘాలకు 952కోట్లరూపాయల రుణాలను అందించటం విశేషం. జిల్లాలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు 82.35 లక్షల రూపాయల గనుల శాఖ నిధులతో ఒంగోలు నగరంలోని రిమ్స్‌లో ప్లేట్‌లెట్ యంత్రం ఏర్పాటు చేసారు. 33 కస్తూరిబా బాలికల విద్యాలయాల్లో శుద్ధజలం కోసం 1.40కోట్లరూపాయల వ్యయంతో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసారు. 2.94కోట్లరూపాయల వ్యయంతో 42 అంగన్‌వాడీ కేంద్రం భవనాలను నిర్మించగా మరో 101 భవనాల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. పంచాయితీరాజ్ శాఖ ద్వారా వాడవాడలా చంద్రన్న బాట కింద ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 576 కిలోమీటర్ల మేర సీసీ రహదారులు నిర్మించారు. 40 గ్రామపంచాయితీ భవనాలు, ఐదు మండల సమైఖ్య భవనాలు, 206 అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు పూర్తిచేసారు. గత ఏడాది డిసెంబర్ చివరిన జిల్లాను బహిరంగ మలవిసర్జనరహిత జిల్లాగా ప్రకటించారు. మొత్తంమీద జిల్లా సమగ్రాభివృద్దికి కలెక్టర్ వినయ్‌చంద్ పూర్తిస్థాయిలో కృషిచేస్తున్నారు.