క్రైమ్/లీగల్

లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన ఇద్దరు ఎస్‌సి కార్పొరేషన్ సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఏప్రిల్ 23 : జిల్లా కేంద్రమైన ఒంగోలు ప్రగతి భవన్‌లోని ఎస్‌సి కార్పొరేషన్‌లో రుణం మంజూరు చేసేందుకు నాలుగువేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎఇవో జాన్సన్, సీనియర్ అసిస్టెంట్ బెనర్జీని ఎసిబి అధికారులు సోమవారం పట్టుకున్నారు. మేదరమెట్లకు చెందిన పార్థసారధి అనే లబ్థిదారుడికి గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నాలుగు లక్షల రూపాయలు మంజూరయ్యాయి. మొదటి విడతగా లక్ష రూపాయల రుణాన్ని ఆరునెలల క్రితమే అధికారులు మంజూరు చేశారు.
మిగిలిన మూడు లక్షల రూపాయలు రుణం మంజూరు చేసేందుకు ఎస్సీ కార్పొరేషన్ లో ఎఇవోగా పనిచేస్తున్న జాన్సన్ ఐదువేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అయితే లబ్థిదారులు పార్థసారధి అంత ఇచ్చుకోలేని జాన్సన్‌కు చెప్పడంతో ఆయన నాలుగు వేల రూపాయలకు ఒప్పుకున్నాడు. ఈ నగదు ను సీనియర్ అసిస్టెంట్ బెనర్జీ ద్వారా జాన్సన్ తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఎఇవో జాన్సన్, సీనియర్ అసిస్టెంట్ బెనర్జీని అదుపులోకి తీసుకుని ఎసిబి అధికారులు ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఒంగోలు ఎసిబి డిఎస్‌పి తోట ప్రభాకర్ విలేఖర్లకు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ఒంగోలు, ఏప్రిల్ 23 : జాతీయ రహదారిపై సోమవారం రాత్రి మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు యూటర్న్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంతమాగులూరు మండలం మామిళ్ళపల్లి గ్రామానికి చెందిన వావికోల రామయ్య (60) బొలోరో కారులో ఒంగోలు నుండి స్వగ్రామానికి వెళుతున్న నేపధ్యంలో దొడ్డవరప్పాడు యూటర్న్ వద్ద కారు డివైడర్‌ను బోల్తా కొట్టడంతో డ్రైవర్ టి ఏసయ్య (45) రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయాలు కావడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని రూరల్ సీఐ మురళీకృష్ణ, స్థానిక ఎస్‌ఐ పి సురేష్ పరిశీలించి మృతదేహాలను పంచానామ నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.