ఆర్గానిక్ ఫుడ్‌స్టాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా మనం తినే ఆహారంలో చాలా రసాయన పదార్థాలు కలుస్తున్న విషయం తెలిసిందే. ప్రజలు ఎక్కువగా కెమికల్ ఫుడ్‌ను కాకుండా ఎలాంటి రసాయనాలు ఉపయోగించని ఆర్గానిక్ ఫుడ్‌ను తీసుకోవాలని, ఇలాంటి ఆహారాన్ని ప్రజలకు అందించడానికి ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ ముందుకొచ్చాడు. ప్రకాష్‌రాజ్ ఫౌండేషన్ పేరుతో ఇటీవలే ఆయన తెలంగాణాలోని కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ గ్రామంలోని తన పొలంలో పండించిన ఆర్గానిక్ కూరగాయల్ని నేరుగా ప్రజలకు అందించేందుకు స్టాల్‌ను ఏర్పాటు చేశాడు. మొదటి ప్రయత్నంగా హైదరాబాద్‌లోని చిత్రపురి కాలనీలో ఈ కూరగాయల మొబైల్ స్టోర్‌ను ఆవిష్కరించారు. పరిశ్రమలోని కింది స్థాయిలో పనిచేసే కార్మికులకు అందజేయాలనే సంకల్పంతో ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపాడు ప్రకాష్‌రాజ్. ఈ కార్యక్రమంలో పలువురు సినీరంగ ప్రముఖులు పాల్గొన్నారు.