ప్రకాశం

యావత్తు భారతదేశం గుర్తించుకునే నేత ఆజాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, నవంబర్ 11 : యావత్తు భారతదేశం గుర్తించుకోదగిన నేత వౌలానా అబుల్ కలాం ఆజాద్ అని, తరాలు మారిన దేశానికి వారు చేసిన సేవలను మనం గుర్తించుకుంటున్నామని ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్థన్ పేర్కొన్నారు. ఆదివారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఇస్లాంపేటలోని కమ్యూనిటీ హాలులో భారత రత్న ఆజాద్ 13వ జయంతి వేడుకలు, మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ సమాజం, ప్రజల కోసం ఆయన చేసిన సేవలు చిర స్మరణీయమన్నారు. ప్రతి సంవత్సర ఆజాద్ జయంతి రోజున జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు పధకాలు ప్రవేశ పెట్టి వారి అభివృద్దికి తోడ్పాటునందిస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మైనార్టీ వర్గాలకు ఆర్థికంగా, విద్యా పరంగా వారి ఎదుగుదల కోసం స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఒంగోలు నియోజక వర్గంలో ఈద్గా, కమ్యూనిటీ హాలును అభివృద్ది చేశామని, ముస్లీంలు ఎక్కువ శాతం నివసిస్తున్న చోట కమ్యూనిటీ హాలు ఏర్పాటుకు తన వంతు సహకారం అందిస్తామన్నారు. షాదీఖానా నిర్మాణానికి అవసరమైన రెండు కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించడం జరిగిందన్నారు. ఈ షాదీఖానా డిసెంబర్ నాటికి పూర్తి చేసి జనవరి నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మైనార్టీలకు అన్నీ విధాలుగా అండగా ఉంటామన్నారు. పట్టణంలోని నిరుపేదలు, నివేశన స్థలాలు లేని వారికి 16 వేల ఇండ్లకు అర్బన్ హౌసింగ్ నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. అందరూ సొంత ఇంట్లో ఉండాలన్న కలను రాష్ట్ర ప్రభుత్వం నిజం చేస్తుందన్నారు. దేశం కోసం పాటు పడిన ఆజాద్ స్పూర్తితో అందరూ ముందుకు వెళ్ళాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో కిలాఫత్, శాసన ఉల్లంఘన , క్విట్ ఇండియా ఉద్యమాల్లో ఆజాద్ కీలక పాత్ర వహించారన్నారు. భారత దేశపు తొలి విద్యా శాఖా మంత్రిగా ఆయన పని చేశారని, ఆ పదవికే వనె్న తెచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. యూనివర్సిటీ గ్రాంటు కమీషన్, గర్కెక్‌పూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ టెక్నాలజీ , ఐఐటి వంటిని ఏర్పాటు చేసి విద్యా రంగంలో విప్లవాత్మక మైన మార్పులు తెచ్చిన వ్యక్తిగా కొనియాడారు. అదే విధంగా ప్రాధమిక విద్య, ఉన్నత విద్య, 14 సంవత్సరాలలోపు బాల బాలికలకు ఉచిత నిర్భంధ విద్య అందించే దిశగా అడుగులు వేసిన వ్యక్తి ఆజాద్ అన్నారు. ఇండియా పాకిస్తాన్ విభజనను ఆజాద్ తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి అని తెలిపారు. ముస్లీం మైనార్టీలకు స్కాలర్ షిప్పులు, విదేశీ విద్యా పధకం ద్వారా ఆర్థిక సహాయం , దుల్హన్, స్వయం ఉపాధి, స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా నైపుణ్యంతో కూడిన శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. ముస్లీం పేద కుటుంబాలకు ప్రభుత్వం రంజాన్ తోఫా అందిస్తుందని, ఇమామ్, వౌజన్ లకు గౌరవ వేతనం అందిస్తుందన్నారు. ప్రభుత్వ పధకాలు అందరికీ అందజేసి వారు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ప్రాథమిక విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఆజాద్ ఇచ్చారన్నారు. దుల్హన్ పథకాన్ని ఎక్కువమంది వినియోగించిన జిల్లా ప్రకాశం జిల్లా నే అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మైనార్టీ సంక్షేమ శాఖాధికారి పి ఝాన్సీరాణి మాట్లాడుతూ జిల్లాలో 2014-15 నుండి 2018-19 వరకు 36 వేల 557 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఇంటర్ నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు 58 కోట్ల 30 లక్షల స్కాలర్ షిప్పులు, ఫీజు రీయంబర్స్‌మెంట్ పధకం ద్వారా చెల్లించడం జరిగిందన్నారు. విదేశీ విద్యా పధకం ద్వారా 12 మంది మైనార్టీలకు విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు ఒక కోటి 60 లక్షల రూపాయలు ఓవర్‌సీస్ పధకం ద్వారా చెల్లించడం జరిగిందన్నారు. దుల్హన్ పధకం ద్వారా 1914 మందికి 9 కోట్ల 57 లక్షల రూపాయలు చెల్లించామని, 291 మంది ఇమామ్, వౌజన్ లకు గౌరవ వేతనం 3 కోట్ల 25 లక్షల రూపాయలు అందించడం జరిగిందన్నారు. 2018వ సంవత్సరంలో 75 మందిని రాష్ట్ర ప్రభుత్వం తరుఫున హజ్ యాత్రకు పంపడం జరిగిందని ఆమె వివరించారు. షాదీఖానా నిర్మాణాలు, ఈద్గా నిర్మాణాలు, మసీదుల నిర్మాణం, మరమ్మత్తులు , ప్రహరీ గోడల నిర్మాణం వంటి ప్రగతిని ఆమె వివరించారు. ఈ సందర్భంగా ఆజాద్ జీవిత చరిత్ర విశేషాలను ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కార్పోరేషన్ అధికారి సిరాజుల్లా, జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మదరసా పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఆఫ్సానా విద్యార్థినీ కలాం జీవిత చరిత్ర ను ఆంగ్ల భాషలో వివరించి అందరి చేత మన్ననలు పొందారు. ఈ కార్యక్రమంలో ముస్లీం కమ్యూనిటీకి చెందిన రిటైర్డ్ జెసి షంషేర్ అహ్మద్, రిటైర్డ్ తహశీల్థార్ గౌస్ మొహిద్దీన్, ముస్లీం పెద్దలు సిలార్, సయ్యద్ మహ్మద్ లను ఒంగోలు శాసన సభ్యులు, జిల్లా జాయింట్ కలెక్టర్లు శాలువాలు కప్పి జ్ఞాపికలతో సత్కరించారు. అదే విధంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్‌జిటిగా ఎంపికైన సల్మా అనే ముస్లీం మహిళకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం దుల్హన్ పదకం క్రింద ఎంపికైన లబ్థిదారులకు ధృవపత్రాలను అందజేశారు. తొలుత గా పాత మార్కెట్ లోని వౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహానికి దామచర్ల, నాగలక్ష్మీ, జిల్లా రెవిన్యూ అధికారి , పలువురు ముస్లీం నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.