ప్రకాశం

పేగు బంధంలా నూలు బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల టౌన్, నవంబర్ 11: ప్రాంతాలు వేరైనా భాషలు వేరైనా పేగు బంధంలా నూలు బంధం ఏకమై నేడు జాతీయ స్థాయి చేనేత హస్తకళల సంబరాలు జరుపుకోవడం జరుగుతుందని జాతీయ చేనేత హస్తకళల కన్వీనర్ మాచర్ల మోహనరావు తెలిపారు. మండలంలోని దేవాంగపురి పంచాయతిలో గల బివి అండ్ బి ఎన్ హైస్కూల్లో చేనేత హస్తకళల సాంకేతిక జ్ఞాన నవీకరణ సంబరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భం గా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కంప్యూటర్ యుగంలో శాస్ర్తియత శాస్ర్తియంగా అభివృద్ధి చెందుతున్నది ఎవరికోసమని ప్రశ్నించారు. ప్రకృతి నాశనం చేసే విధంగా నేడు తయారైందని పర్యావరణాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. గ్రామీణ ఉపాధిని కాపాడుకోవడానికి చేనేత హస్తకళాకారులకు న్యాయం చేయడానికి ఏ రాజకీయ పార్టీ ఏమి చేయలేకపోతుందన్నారు. నూలు, శిల్కు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, విధి, విధానాలు రూపకల్పన చేసేందుకు దశ, దిశ నిర్ధేశించేందుకు సమావేశాల్లో పలు చర్చలు చోటు చేసుకుంటాయన్నారు. హ్యాండ్‌లూమ్‌లా, రౌట్స్‌భై చేనేతలకు అవగాహన కల్పించేందుకు సమావేశంలో చర్చిండం జరుగుతుందన్నారు. ఈ 8 రోజుల్లో పలు అంశాలపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుని తదను గుణంగా ముందుకు సాగుతామన్నారు. పద్మభూషన్ రాజీవ్‌సేథి మాట్లాడుతూ చేనేతలో అనేక రకాలైన నైపుణ్యాలు ఉన్నాయని వాటిని అములు చేసి భవిషత్ తరాలకు మార్గదర్శకంగా నిలవాల్సిన అవసరముందని అన్నారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ చేనేతకు ఆదరణ కల్పించాల్సిన అవసరం ఉందని అందుకు ప్రజలందరూ సంపూర్ణ సహకారాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మూడు భాషల్లో నేసేవారి ప్రపంచం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డీస్ లేబరేటరీస్ ఛైర్మన్ అనురాధ, ఢిల్లీ ఫోరమ్ మెంబర్ ఆంఛల్, మల్కా ట్రస్టు ప్రతినిధి ఇజ్రమ్మ, నెధర్లాండ్ ప్రొఫెసర్ బైకర్, ఆనంద్ అండ్ కంపెని చార్టడ్ అకౌంటెంట్ ఎం ఆర్ విక్రమ్, రీడ్సు ఛైర్మన్ కె రవికుమార్‌రెడ్డి, రాష్ట్ర చేనేత జన సమాఖ్య అధ్యక్షులు దేవన వీరనాగేశ్వరరావు, చింతకింద రమేష్, కర్ణ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. కాగా నవీకరణ సంబరాలకు ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన నిపుణులతో పాటు గుజరాత్, తమిళనాడు, కాశ్మీర్, ఓరిస్సా, ఉత్తరాంఛల్, కేరళ, కర్ణాటక, మణిపూర్, మేఘాలయ రాష్ట్రా లకు చెందిన చేనేత హస్తకళాకారులు పాల్గొని తాము తయారు చేస్తున్న వస్త్రాలను మగ్గాలపై నేస్తూ ప్రదర్శన రూపంలో చూపించారు. ఈ ప్రదర్శననను తిలకించేందుకు పలు గ్రామాల నుంచి చేనేత హస్త కళాకారులు పాల్గొన్నారు. కాగా ప్రకాశం జిల్లా పర్చూరు మండల వీరన్నపాలెం గ్రామానికి చెందిన మువ్వా చెన్నకృష్ణమూర్తి గడ్డితో నేసిన చీర, కండువ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

రొయ్యలపై పంజా విసిరిన వైట్‌స్పాట్
ఆర్థికంగా నష్టపోతున్న రైతులు
ఒంగోలు,నవంబర్ 11 : వెనామీ రొయ్యలసాగుపై తెల్లమచ్చవ్యాధి (వైట్‌స్పాట్) పంజా విసిరింది. దీంతో రొయ్యల చెరువులు ఆ వ్యాధితో తుడుచుకుపెట్టుకుపోతున్నాయి. రొయ్యలసాగుకు ఒకపక్క అనావృష్టి పరిస్థితులు, మరొకపక్క తెల్లమచ్చవ్యాధులు పంజావిసరటంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే పరిస్ధితులు ఏర్పడ్డాయి. ప్రధానంగా ఈరోజుల్లో భారీ వర్షాలు కురిసి వాగులు, వంకలు పొంగిప్రవహించటమే కాకుండా రొయ్యల చెరువుల్లోని ఉప్పునీటిలో సెలనీటిల శాతం 25నుండి 30శాతం వరకు ఉండాల్సిఉంది. కాని మారిన వాతావరణ పరిస్ధితుల నేపధ్యంలో జిల్లావ్యాప్తంగా అనావృష్టి పరిస్థితులు దాపరించటంతో రొయ్యల చెరువుల్లోని ఉప్పునీటిలో సెలనీటిలు 45శాతంకు పైగానే ఉన్నాయి. దీంతో ఒక పక్క రొయ్యల పెరుగుదల లేక మరొకపక్క వ్యాధులు చుట్టుముట్టడంతో రొయ్యల రైతులు ఆర్ధికంగా కుంగిపోతున్నారు. సాధారణంగా భారీ వర్షాలు కురుస్తాయి మంచి దిగుబడులు వస్తాయిలే అనే ఆశతో రొయ్యల రైతులు ఆగస్టు మొదటివారంలోనే సాగుచేపట్టారు. కాని వాతావరణంలో ఏలాంటి మార్పులు లేకపోవటంతో రొయ్యల పెరుగుదల లేక కొంతకాలం రైతులు ఇబ్బందులుపడ్డారు. తిరిగి మరలా తెల్లమచ్చవ్యాధులు రొయ్యలరైతులను కుదేల్‌చేశాయి. కాగా జిల్లాలోని చీరాల, వేటపాలెం, చినగంజాం, నాగులుప్పలపాడు, ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, శింగరాయకొండ, గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లో వర్షాకాలం రొయ్యలసాగును రైతులు చేపట్టారు. రొయ్యల ధరలు ఆశాజకనంగా ఉండటంతో కేవలం 90నుండి 80కౌంట్ కేజికి రొయ్యలు వచ్చినా తమ ఖర్చులు పోయి లాభం వస్తుందనే ధీమాలో రైతులు ఉన్నారు, కానిరైతుల ఆశలు ఆడియాశలయ్యాయి. ప్రస్తుతం కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామంలో రొయ్యలు తెల్లమచ్చవ్యాధితో తుడుచుకుపెట్టుకుపోయాయి. దీంతో మిగిలిన రైతులు కూడా తమ చెరువులకు ఎక్కడ ఆ వ్యాధి వ్యాపిస్తుందోనన్న ఉత్కంఠలో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వ్యాధుల వలన తీసే రొయ్యల చెరువులకు కనీస పెట్టుబడులు రాని పరిస్ధితి ఉందని రైతులు వాపోతున్నారు. ప్రతిఏటా రొయ్యలకు మంచి గిరాకి ఉన్న సమయంలో వ్యాధులు చుట్టిముట్టి రైతులను ఆర్ధికంగా కుంగతీస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలాఉండగా వ్యాధులను అరికట్టేందుకు పూర్తిస్ధాయిలో ఇంతవరకు ఏలాంటి మందులు రాకపోవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధులను అరికట్టేమందులను ప్రభుత్వాలు తీసుకురావాలని రైతులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. మొత్తంమీద జిల్లావ్యాప్తంగా రొయ్యల సాగుపై తెల్లమచ్చ వ్యాధి పంజావిసరటంతో రైతన్నలు తీవ్ర ఆందోళనలు కొట్టుమిట్టాడుతున్నారు.