ప్రకాశం

రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వెలుగొండ నిర్మాణంలో జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంభం, ఆగస్టు 20: రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పూర్తిచేయలేకపోయారని ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సోమవారం కంభంలోని కందులాపురం సెంటర్‌లో ప్రజలనుద్దేశించి మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రసంగించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వెలుగొండ ప్రాజెక్టు పనులు 70శాతం పూర్తిచేయగా నాలుగున్నర సంవత్సరాల్లో మూడున్నర మీటర్ల సొరంగం పనులు తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిచేయలేకపోతోందని అన్నారు. చంద్రబాబు నిర్లక్ష్య ధోరణే ఇందుకు కారణమని అన్నారు. ఇప్పటికే కంభం చెరువులో చుక్కనీరు లేదని, సాగు, తాగునీటికి ఈప్రాంత వాసులు నోచుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు. తమ పాదయాత్రలో అనేకమంది రైతులు వచ్చి కన్నీరు పెట్టుకొని బాధలు వెలిబుచ్చారని అన్నారు. ఈ కష్టాలు కొద్దిరోజులు మాత్రమేనని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదిలో వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీరు ఇవ్వడం జరుగుతుందన్నారు. వైసిపి నాయకులు అంబటి రాంబాబు మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టును వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో శంకుస్థాపన చేసి 70శాతం పనులు పూర్తిచేసినప్పటికీ ఈ రాష్ట్రప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. గుంటూరు ఎమ్మెల్యే ముస్త్ఫా మాట్లాడుతూ ఈప్రాంత వాసులకు సాగు, తాగునీరు అందాలంటే వెలుగొండ ప్రాజెక్టు ఒక్కటే శరణ్యమని అన్నారు. ఇప్పటికే ఈప్రాంతవాసుల సమస్యలు వింటుంటే బాధాకరంగా ఉందని అన్నారు. ఈసమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు పిడతల సాయికల్పనారెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి, వైసిపి నాయకులు చేగిరెడ్డి లింగారెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి, పిడతల అభిషేక్‌రెడ్డి, పలువురు వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం అర్థవీడు మండలం కాకర్ల గ్యాప్ వద్దకు బయలుదేరి వెళ్లారు.