ప్రకాశం

పాస్టర్ జోసఫ్‌పై అట్రాసిటీ కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఆగస్టు 20:జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ఇండియన్ ఇవాంజికల్ ఫెలోషిప్‌లోని విద్యార్థినులపై జరిగిన లైంగిక ఘటనపై చర్చి పాస్టర్ జోసఫ్‌పై అట్రాసిటీ కేసు నమోదుచేసినట్లు జాతీయ ఎస్‌సి,ఎస్‌టి కమిషన్ సభ్యులు కె రాములు వెల్లడించారు. సోమవారం సాయంత్రం స్థానిక మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ బాలసదన్‌లో బాధిత బాలికలను కమిషన్ సభ్యులతోపాటు కలెక్టర్ వి వినయ్‌చంద్, ఎస్‌పి సత్యఏసుబాబుతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్‌సి,ఎస్‌టి కమిషన్ సభ్యులను కలిసిన విలేఖర్లతో మాట్లాడారు. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన చర్చిపాస్టర్‌పై చట్టపరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్‌పిలకు సూచించారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాల పిల్లలను వారి తల్లిదండ్రులు ఆర్థిక స్తోమతలేని కారణంగా స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్న పాఠశాలల్లో చేర్పించటం జరుగుతుందన్నారు.పలువురు పాస్టర్లు తప్పుడు విధానాలతో ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ఆర్థిక స్థోమతలేని వర్గాల ప్రజలు తమ పిల్లలను స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్న పాఠశాలల్లో చేరుస్తున్నారని కొంతమంది ఆసరగా తీసుకుని విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరుపుతున్నారని వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్, ఎస్‌పిలకు ఆదేశాలు జారీచేశామన్నారు.
విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరిపిన వారిపై అట్రాసిటీ కేసు పెడితే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి బాధితులకు నష్టపరిహారం అందుతుందని అదేవిధంగా మనోధైర్యం వస్తుందన్నారు. జిల్లాలో 76 స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయని తెలిపారు. పలు స్వచ్ఛంద సంస్థల్లో ఆకృత్యాలు జరుగుతుండవచ్చునని తెలుపుతూ స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్న ఆర్గనైజేషన్‌పై కలెక్టర్, ఎస్‌పి పర్యవేక్షించి తమ దృష్టికి వచ్చినప్పుడు వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటారన్నారు. బాధిత విద్యార్థినీలకు వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో అనుకూలమైన చోట చదివించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందుకు అనుగుణంగా వారికి కాస్మోటిక్ ఖర్చులు, యూనిఫారం తదితరాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపినట్లు ఆయన వివరించారు. జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్న ఆర్గనైజేషన్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలోని ఇతర స్వచ్ఛంద సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు. జిల్లా నుండి పలువురు ఉపాధి కోసం హైదరబాద్‌కు వలస వెళ్లడం, అక్కడ కూడా వారికి సరైన వేతనం అందడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. వలస వెళ్లిన కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేలా చూడాలని కలెక్టర్ కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ఇళ్లు లేని కుటుంబాల వారికి ప్రధానమంత్రి ఆవాజ్ యోజన, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్‌టిఆర్ గృహ నిర్మాణ పథకాలు వర్తింపచేసేలా చూడాలన్నారు. నివేశన స్థలాలు లేని కుటుంబాలకు ప్రభుత్వమే గృహ నిర్మాణాలు చేపట్టి ఇచ్చే కార్యక్రమం
చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారన్నారు. గృహ నిర్మాణాల విషయంలో అందరికీ న్యాయం చేయాలని ఆయన కలెక్టర్ ను కోరారు. బాధిత పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడటం జరిగిందన్నారు. సమాజంలో మహిళల కోసం ప్రభుత్వాలు ఎన్ని రకాల చట్టాలు తీసుకొచ్చినప్పటికీ మహిళలపై మానభంగాలు వంటి అకృత్యాలు, అట్రాసిటీ కేసులు నమోదవుతున్నాయన్నారు. అట్రాసిటీ కేసులకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెరగాల్సి ఉందన్నారు. అట్రాసిటీ కేసులకు సంబంధించి పోలీస్ అధికారులు సరైన మార్గంలో రిజిస్టర్ చేసి విచారణ జరిపినట్లయితే కేసు బలంగా ఉన్నప్పుడు కేసు గెలిచే అవకాశాలు ఉంటాయన్నారు. జిల్లాలో అంటరానితనం , అట్రాసిటీ కేసులు తక్కువగా నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో ఇలాంటి స్వచ్చంధ సంస్థలను పక్కాగా పర్యవేక్షించి విచారణ జరిపి పిల్లల్లో ఎంత మేరకు రక్షణ ఉందో వెలుగులోకి తీసుకు రావాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పలు శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.