ప్రకాశం

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఆగస్టు 20: భారతదేశ మాజీ ప్రధాన మంత్రి దివంగత రాజీవ్‌గాంధీ 74వ జయంతి కార్యక్రమం సోమవారం స్థానిక మంగమూరు డొంకలోని రాజీవ్‌గాంధీ విగ్రహాం వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకరరెడ్డి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ తదితరులు పాల్గొని అక్కడ ఉన్న దేశ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ మాట్లాడుతూ భారతదేశ ప్రధానులలో అత్యంత చిన్నవయస్కుడు రాజీవ్ గాంధీ అని ఆమె కొనియాడారు. దేశంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టిన మహానీయుడని, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి పల్లెలే దేశ పట్టుకొమ్మలని గ్రామీణా ప్రాంతాలను అభివృద్ధి చేసిన గొప్పనాయకుడు రాజీవ్ గాంధీ అని ఆమె కొనియాడారు. ఐటీ, కమ్యూనికేషన్ రంగాలను దేశంలోని యువతకు అందించి యువతను అభివృద్ధి పధంలోకి తీసుకెళ్లి కొన్ని కోట్లమంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించిన మహానీయుడు రాజీవ్‌గాంధీ అని ఆమె తెలిపారు. భారతదేశ భద్రతకోసం తన ప్రాణాలను అర్పించిన త్యాగశీలి రాజీవ్ గాంధీ అని ఆమె కొనియాడుతూ అలాంటి రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన బాటలోనే దేశయువత నడవాలని పనబాక లక్ష్మీ పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకరరెడ్డి మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ 74వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ దివంగత రాజీవ్‌గాంధీకి ఘనంగా నివాళులర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా నే రాష్ట్భ్రావృద్ధి, దేశ సమైక్యత సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, పీసీసీ కార్యదర్శులు యాదాల రాజశేఖర్, గాదె లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేమా శ్రీనివాసరావు, నాగయ్య, డి ఆదిరెడ్డి, టి బుజ్జి, ఎన్ కోటిరెడ్డి, పి వెంకటేశ్వర్లు, ఎస్‌కె రసూల్, టి శ్రీను, సిహె మోహనరావు, టి సుబ్బారావు, ప్రసన్నరాజు, పి యుగంధర్, కె సుబ్బారావు, జాకోబు, దావీదు తదితరులు పాల్గొన్నారు.