ప్రకాశం

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- సంతమాగులూరు పీహెచ్‌సీ నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదన
సంతమాగులూరు, ఆగస్టు 20: వైద్య ఆరోగ్య సిబ్బంది సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని రాజ్యలక్ష్మి ఆదేశించారు. సంతమాగులూరు, బల్లికురవ మండలంలోని గుంటుపల్లి ప్రాథమిక వైద్యశాలలను జిల్లా ఆరోగ్య వైద్యాధికారిని రాజ్యలక్ష్మి సోమవారం ఆకస్మిక తనిఖీచేశారు. రెండు వైద్యశాలల్లోనూ సిబ్బంది హాజరు, సమయపాలన రికార్డుల నిర్వహణ, వైద్యశాలలో ప్రజలకు అందిస్తున్న సేవలు, పారిశుద్ధ్యం తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. బల్లికురవ మండలం గుంటుపల్లి వైద్యశాలలో వైద్యసేవలకు వచ్చిన రోగులతో ముచ్చటించి వైద్యశాలలో అందుతున్న సేవల గురించి ఆరాతీశారు. వైద్యశాలలో అన్ని వ్యాధులకు మందులు అందుబాటులో ఉండే విధంగా ముందస్తు ప్రణాళికతో ఉండాలన్నారు. వైద్యాధికారి భాను ప్రకాష్, డ్యూటీ వైద్యులు అమీర్‌లీ, సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. అనంతరం సంతమాగులూరు ప్రాథమిక వైద్యశాలకు విచ్చేసిన ఆమె వైద్యశాలలో మందుల నిల్వలు, సిబ్బంది హాజరు రిజిష్టరు, డ్యూటీలో ఉన్న సిబ్బంది, వైద్యశాల పారిశుద్ధ్యం తదితర అంశాలను పరిశీలించారు. వైద్యశాలను పరిశీలించి భవనం శిధిలావస్థలో ఉండటం గమనించిన ఆమె నూతన భవననిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించి వైద్యశాల పరిధిలోని ఉప ఆరోగ్య కేంద్రాల సిబ్బంది పనితీరును సమీక్షించారు.
జిల్లాలో 35 డాక్టర్ పోస్టులు ఖాళీ
జిల్లాలో 35 వైద్యశాలల్లో డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజ్యలక్ష్మి తెలిపారు. వైద్యుల ఖాళీలు భర్తీచేసేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు చెప్పారు. సంతమాగులూరుతో పాటు ప్రాసంగులపాడు, యద్దనపూడి, కొరిశపాడు వైద్యశాలల భవనాలు శిథిలావస్థలో ఉన్నందున నూతన భవనాల నిర్మాణానికి తగిన అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాధవీలత, పీఓ డీటీ రామకోటిరెడ్డి, సంతమాగులూరు వైద్యాధికారులు పాపారావు, వీరనారాయణ సిబ్బంది ఉన్నారు.