క్రైమ్/లీగల్

నిషేధిత గుట్కా, ఖైనీలు తరలిస్తున్న లారీ స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామూరు, సెప్టెంబర్ 8: ఏపిలో నిషేధించబడిన గుట్కాలు, పాన్‌మసాలాలు, వివిధ మాదక ద్రవ్యాలను తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకుని, ఆ వాహన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు కందుకూరు డిఎస్పీ కె ప్రకాష్‌రావు తెలిపారు. శనివారం సాయంత్రం పామూరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిషేధంలో ఉన్న గుట్కాలు, వివిధ పాన్ మసాలాలతో తయారు చేసిన మాదక ద్రవ్యాలను తరలిస్తున్న లారీని పామూరు ఎస్‌ఐ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన అబూబకర్‌బిన్ అహమ్మద్, నరసింహం అనే ఇద్దరు వ్యక్తులు కర్ణాటకలో తయారవుతున్న గుట్కా, ఖైని, పాన్‌పరాగ్ తదితర వాటితోపాటు గంజాయితో బయలుదేరి గుట్కా నిషేధిత ప్రాంతాల్లో చేరేవేసేందుకు చెక్‌పోస్టు లేని ప్రాంతాలైన పామూరు మీదుగా వెళుతూ ఆగి ఉన్న మినీ వాహనాన్ని నిద్రమత్తులో ఢీకొన్నారు. చిన్నపాటి గాయాలతో ప్రాధమిక చికిత్స చేయించిన అనంతరం లారీ డ్రైవర్‌ను, నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పట్టుబడిన గుట్కాల విలువ రూ.50లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. పట్టుబడిన లారీ హైదరాబాద్‌కు చెందిందని ఆయన తెలిపారు. 168 బస్తాలు గుట్కా ప్యాకెట్లు, అరకేజి గంజాయి, 760 ఖైనీ ప్యాకెట్లతోపాటు ఒక్కొక్క బస్తాలో ఒక గ్రాము సిల్వర్ కాయిన్‌లు 3,360 కాయిన్‌లను ఉంచినట్లు ఆయన తెలిపారు. కనిగిరి సిఐ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ అనంతరం దోషులకు శిక్ష తప్పదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పామూరు, కనిగిరి సిఐలు ఎం మధుబాబు, సంగమేశ్వరరావు, రాజ్‌కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.