క్రైమ్/లీగల్

గిరిజన బాలికపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాచర్ల, సెప్టెంబర్ 9: ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి గిరిజన బాలికపై అత్యాచారం చేసిన సంఘటన రాచర్ల మండలంలోని చినగానిపల్లి గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చినగానిపల్లి గ్రామానికి చెందిన గిరిజన బాలిక గిద్దలూరులోని వెనకబడిన తరగతుల హాస్టల్‌లో 6వ తరగతి చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో స్వగ్రామం చేరుకుంది. అదేగ్రామానికి చెందిన మీనిగ రంగస్వామి అనే ట్రాక్టర్ డ్రైవర్ బాలిక తల్లి లేకపోవడంతో ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారం చేశాడు. కాగా, తల్లి ఉదయం బాలిక నలతగా ఉండటాన్ని గమనించి విచారించగా జరిగిన విషయం తల్లికి తెలిపింది. కాగా, కొందరు రాజీ ప్రయత్నం చేయడంతో మెత్తబడ్డ తల్లి కేసు పెట్టేందుకు ముందుకు రాకపోయినా జరిగిన సంఘటనపై గుర్తుతెలియని వ్యక్తులు పొలీసులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన పొలీసులు విచారించగా వాస్తవమని తెలుసుకుని తల్లి ఫిర్యాదు మేరకు నిర్భయ, ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు గిద్దలూరు సీఐ శ్రీరాం తెలిపారు.