క్రైమ్/లీగల్

వినాయక నిమజ్జన కార్యక్రమంలో అపశ్రుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతమాగులూరు, సెప్టెంబర్ 18: సంతమాగులూరు వినియక నిమజ్ఞనం కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. సంతమాగులూరు ద్వారకానగర్ కాలనీలో ఐదురోజులు పూజించిన వినాయకుని విగ్రహన్ని బుధవారం జలధిలో కలిపేందుకు అద్దంకి బ్రాంచికెనాల్‌కు తరలించి నీటిలో విగ్రహన్ని దింపుతుందడగా విగ్రహం పట్టుకుని నీటిలోకి దిగిన బత్తుల వెంకటేశ్వర్లు(47) విగ్రహంతోపాటు నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. ద్వారాకానగర్ కాలనీలో వినాయక ఉత్సవాలు ఘనంగా జరిపారు. ఐదురోజులు పూజలు చేసిన గణనాధుని బుధవారం వేకువాజామువరకు ఊరేగింపు నిర్వహించారు. అందరూ రెండు వాహనాల్లో అద్దంకి బ్రాంచి కెనాల్‌కు తరలించారు. విగ్రహన్ని దించి మరోసారి పూజలు చేశారు. అనంతరం విగ్రహన్ని మెల్లగా నీటిలో వదిలేందుకు వెళ్లిన బత్తుల వెంకటేశ్వర్లు (47) నీటి ప్రవాహనికి కొట్టుకుపోయాడు. క్షణాల్లో ఆ ప్రాంతం ఆర్తనాదాలతో మార్మోగింది. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని గల్లంతైన మృతదేహం కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఐదురోజులు పాటు ఆనందకోలాహలంగా ఉన్న సంతమాగులూరు ద్వారకాసగర్ కాలనీలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. విషయం తెలుసుకున్న గ్రామ నాయకులు కారసాని వెంకటకోటిరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. విషయం అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్‌కు తెలియజేశారు. గల్లంతైన మృతదేహన్ని త్వరితగతిన వెలికితీయాలని అధికారులను ఎమ్మెల్యే రవికుమార్ ఫోన్‌లో ఆదేశించారు. గల్లంతైన వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.