ప్రకాశం

ఎస్‌ఎస్‌ట్యాంక్‌కు గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిపురాంతకం, సెప్టెంబర్ 18: మండలంలో ఫ్లోరిన్‌బారి నుంచి ప్రజలను కాపాడేందుకు నాగార్జునసాగర్ జలాలు ప్రతి గ్రామానికి అందించే ఉద్దేశంతో 2013లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మండలంలోని గొల్లపల్లి గ్రామం వద్ద 10కోట్ల రూపాయలతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఏర్పాటు చేశారు. ఎస్‌ఎస్‌ట్యాంకు ప్రారంభించి ట్యాంకులో నీరు నింపేలోపే 2014లో రంధ్రం పడి జలాలు మొత్తం గుండ్లకమ్మ పాలయ్యాయి. అధికారులు యుద్ధప్రాతిపదికన పూడ్చివేశారు. మంగళవారం ఉదయం ఎస్‌ఎస్ ట్యాంక్‌కు గండిపడింది. దీనితో నీరు మొత్తం పోయింది. 10కోట్లతో నిర్మించిన ఎస్‌ఎస్ ట్యాంకు నిర్మాణంలో నాణ్యత లోపించి తరచూ గండిపడటం జరుగుతుందని మండల ప్రజలు అంటున్నారు. గండిపడిన ప్రదేశాన్ని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ సంజీవరెడ్డి, పొదిలి ఇఇ మల్లిఖార్జునరావు, వైపాలెం డిఇ ఎల్లయ్య, త్రిపురాంతకం ఎఇ నాగేశ్వరరావు పరిశీలించారు. ట్యాంక్‌కు పందికొక్కుల ధాటి ఎక్కువగా ఉన్నందున అవి చేసిన రంధ్రాల ద్వారా నీరు ప్రవహిస్తూ గండిగా మారిందని తెలిపారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి ప్రొక్లైనర్‌తో మరమ్మతులు చేసి గండిని పూడ్చివేశామని తెలిపారు.

విద్యార్ధులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలి
- ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్
కందుకూరు, సెప్టెంబర్ 18: విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఫీజు రియింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలను విడుదల చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శన నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్ వినోద్, ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమై నాలుగు నెలలు గడిచనప్పటికీ ఇంతవరకు విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజురియింబర్స్‌మెంట్ మంజూరుకాకపోవడం అన్యాయమన్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అదేవిధంగా ప్రనుత్వ వసతి గృహాల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యార్దుల సమస్యలను వెంటనే పరిష్కరంచాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను, పలువురు విద్యార్థులను కందుకూరు పట్టణ ఎస్సై ఉన్నం వేమన ఆందోళనకారులను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, టిఆర్‌ఆర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.