ప్రకాశం

నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలకు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, సెప్టెంబర్ 18: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలు ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని రెవెన్యూకాలనీ, ప్రకాశం కాలనీలో రావాలి జగన్ - కావాలి జగన్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి నవరత్నాలు పథకాలు ద్వారా కలిగే మేలును ప్రజలకు వివరించారు. వైసీపీ అధికారంలోకి రాగానే తొమ్మిది పథకాలను జగన్మోహన్‌రెడ్డి అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడం వల్ల ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు వస్తాయన్నారు. జగన్ ప్రకటించిన నవరత్నాలు ద్వారా లక్షలాది కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్, పింఛన్ పెంపు, ఆరోగ్య శ్రీ వంటి తొమ్మిది పథకాలు ద్వారా ప్రతి కుటుంబానికి రూ.లక్ష నుంచి రూ.10లక్షల వరకు లబ్ధి చేకూరుతుందన్నారు. రైతు భరోసా కింద 9గంటల నిరంతర విద్యుత్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మరింత మెరుగుపరుస్తూ ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే విధంగా ప్రణాళిక ఉందన్నారు. బూత్ కమిటీలు ప్రజలను చైతన్య పరిచి రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే రాష్ట్రం, నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి పధంలో నడుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో వార్డులోని నాయకులు ధామస్, దాసరి మాల్యాద్రి, తోకల కొండయ్య, ఎస్ వేణుగోపాల్‌రెడ్డి, జె కోటేశ్వరరావు, దారం మాల్యాద్రి, ఖాదర్‌బాషా, ఎయిర్‌టెల్ శివ, గంగిరెడ్డి, పంది కోటేశ్వరరావు, పి శ్రీను, ఎం కృష్ణ, పి కొండయ్య, ఎం కృష్ణారెడ్డి, ఏ వసంతరావు, కామాక్షినాయుడు, సన్ని, గేరా మనోహర్, ఆర్ మల్లికార్జున, అల్లం రాధయ్య, బాబు, పి రవణయ్య, రాజా, కోటయ్య, గోపి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.