ప్రకాశం

అంగన్‌వాడి భవనాలను డిసెంబర్ నాటికి పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,సెప్టెంబర్ 19:జిల్లాలో మంజూరుచేసిన అంగన్‌వాడి భవనాలు డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ వి వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో అంగన్‌వాడి భవనాల నిర్మాణ పనులపై పంచాయతీరాజ్, మహిళా శిశుసంక్షేమం,గ్రామీణనీటి సరఫరా శాఖ, విద్యుత్‌శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2018-19 సంవత్సరంలో వివిధ పధకాల కింద 758 అంగన్‌వాడి భవనాలు నిర్మించాల్సిఉండగా ఇప్పటివరకు 485 అంగన్‌వాడి భవనాలపనులను ప్రారంభించామన్నారు. ఇంకా 220 అంగన్‌వాడి భవనాల పనులు ప్రారంభించాల్సి ఉందన్నారు. ఈసంవత్సరం పంచాయితీరాజ్ అధికారులు కేవలం మూడు అంగన్‌వాడి భవనాలు పూర్తిచేయటం పట్ల అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో గ్రామపంచాయితీ, ఎన్‌ఆర్‌ఇజిఎస్, మహిళా శిశుసంక్షేమశాఖ, జిల్లా మినరల్ ఫండ్ నిధులు 7.5లక్షలతో కలిపి నూరుశాతం పూర్తిస్థాయిలో అంగన్‌వాడి భవనాలు డిసెంబర్ నాటికి నూటికినూరుశాతం పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజనీర్లు, అంగన్‌వాడి భవనాల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాలో అంగన్‌వాడి భవనాల నిర్మాణం కోసం అవసరమైన స్థలాల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ భవనాలు శిథిలావాస్థకు చేరిన వాటిని తొలగించి వాటి స్ధానంలో నూతన అంగన్‌వాడి భవనాలు నిర్మించాలన్నారు. జిల్లాలో ప్రభుత్వం నిర్మించిన అన్ని అంగన్‌వాడి కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్‌కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి ప్రసాదు, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్‌ఇ సంజీవరెడ్డి, మహిళా శిశుసంక్షేమశాఖ అధికారిణి ఎం సరోజిని, పంచాయితీరాజ్ శాఖ ఎస్‌ఇ ఎస్ రఘుబాబు, సిపిఒ వెంకటేశ్వర్లు, డ్వామా పిడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.