ప్రకాశం

రామాయపట్నం వద్ద మేజర్ పోర్టు ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 19: జిల్లా ప్రజల ఆకాంక్ష మేరకు తక్షణమే రామాయపట్నం వద్ద మేజర్ పోర్టును ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక, విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఎబిఎం డిగ్రీకాలేజి ఆవరణలో రామాయపట్నంలో భారీ ఓడరేవు నిర్మాణంపై బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక జిల్లా అధ్యక్షులు చుండూరి రంగారావు అధ్యక్షత వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో రామాయపట్నం వద్ద మేజర్ పోర్టుకు టెక్నికల్ కమిటీలు పూర్తి అనుకూలముగా నివేదిక ఇచ్చిందని, అయితే గత 4 సంవత్సరాల నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతూ ప్రస్తుతం జిఓ 28 అంటూ ఒకటి ఇచ్చి నాన్ మేజర్‌పోర్టు నిర్మిస్తామనటం బాధాకరమని, ప్రకాశం జిల్లా ప్రజలు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రామాయపట్నం వద్ద మేజర్ పోర్టు ఏర్పాటు చేసేందుకు సిద్ధమని లేఖ రాయాలని కోరారు. కేంద్ర సహకారంతో చేపడితే 75శాతం నిధులు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉందన మాజీ ఎంపీ తెలిపారు. అదే విదంగా రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వ నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన సమయంలో ఏర్పాటు కావాల్సిన పరిశ్రమలు, సంస్థలు ఏర్పాటు కాలేదన్నారు. జిల్లాలో ఇప్పటికే వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా రాష్ట్ర ప్రభుత్వ పక్షపాత ధోరణి అవలంబిస్తుందన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్‌కు కనీసం 1500 కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉండటం బాధాకరం అన్నారు. కనిగిరిలో నిమ్జ్ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సభలో మరో ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ మంత్రి వడ్డే శోభానాధ్రీశ్వరరావు మాట్లాడుతూ రామాయపట్నంలో మేజర్ పోర్టు నిర్మాణం జరిగే జిల్లా ఆర్ధికంగా అభివృద్ధి చెందటంతోపాటు జిల్లాలో నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. అన్ని అనుకూలతలు ఉన్న రామాయపట్నం పోర్టు నిర్మాణంలో మేజర్ పోర్టు నిర్మాణం కోసం సియం చంద్రబాబు సరిగా స్పందించకుండా మైనర్ పోర్టు ఏర్పాటుకు అనుకూలంగా ఉండటం బాధాకరం అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, వైకాపా రైతు విభాగం జిల్లా అధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి, ఆచార్యరంగా భవన్ కార్యదర్శి చుంచు శేషయ్య, ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక జిల్లా అధ్యక్షులు చుండూరి రంగారావు, విద్యార్థి జెఎసి రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగధీష్, కిసాన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వాకా రాజగోపాల్ రెడ్డి, సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి కె అరుణమ్మ, బిజెపి నాయకులు ఆంజనేయులు, ప్రకాశం జిల్లా అభివృద్ధి వేధిక జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మూరి కనకారావు మాదిగ తదితరులు పాల్గొని మాట్లాడారు.