క్రైమ్/లీగల్

ప్రేమించిన యువతి బంధువుల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపట్నం,సెప్టెంబర్ 19: కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామంలో ప్రేమించిన యువతి బంధువులు వేధింపులకు గురిచేస్తున్నారన్న మనస్థాపంతో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈతముక్కలలోని ఎస్‌సి కాలనీకి చెందిన వెంకటకృష్ణ అదే కాలనీకి చెందిన ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. తమ ప్రేమ, పెళ్లి విషయంలో ముందుగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఇద్దరు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావటంతో ఇరువైపుల బంధువులు వారి పెళ్లికి ఒప్పుకున్నారు. దీంతో వీరిద్దరికి నెలరోజుల క్రితం నిశ్చితార్థం కూడా జరిగింది. లగ్నపత్రిక కూడా రాసుకున్నారు. ఇరువైపులా పెద్దలు తాంబులాలు మార్చుకున్నారు. ఇదిలా వుండగా యువతి బంధువు హరిబాబు అనే వ్యక్తి వెంకటకృష్ణపై పాత కక్షల నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదుచేశారన్న సమాచారం బయటకు వచ్చింది. తనపై పోలీసులకు హరిబాబు అనే వ్యక్తి ఫిర్యాదుచేయటమే కాకుండా ఈ విషయాన్ని ఒక పత్రికలో ప్రచురించేలా చేశాడంటూ వెంకటకృష్ణ తీవ్ర మనస్థాపానికి గురై పురుగు మందు తాగి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటకృష్ణ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఈతముక్కల ఎస్‌సికాలనీలో కలకలం రేపింది. వెంకటకృష్ణ మృతికి యువతి బంధువు హరిబాబు, అతనికి సహకరించిన ఒక పత్రికా విలేఖరి కారణమంటూ మృతుని బంధువు ఆందోళనకు దిగాడు. నిందితులకోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. హరిబాబుతోపాటు,విలేఖరి కనిపిస్తే దాడిచేసేందుకు మృతుని బంధువులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా యువతి బంధువుకు చెందిన ఒక బైక్‌ను తగలబెట్టారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు మృతుని బంధువులకు నచ్చచెప్పి సాధారణ పరిస్థితులను నెలకొల్పారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మృతుని బంధువులకు పోలీసులు హామీ ఇచ్చారు.

ఈతముక్కల్లో ఉద్రిక్తత
వెంకటకృష్ణ మృతికి యువతి బంధువు హరిబాబు కారణంగా భావించి మృతుని బంధువు హరిబాబు ఇంటిని ముట్టడించారు. దీంతో హరిబాబు కుటుంబ సభ్యులు ప్రాణభయంతో వణికిపోయారు. పోలీసులు జోక్యం చేసుకుని మృతుని బంధువులను అడ్డుకున్నారు. అనంతరం భారీ పోలీసుబందోబస్తు నడుమ నిందితుడు హరిబాబు కుటుంబ సభ్యులను ఆటో ఎక్కించి గ్రామం నుండి సురక్షితప్రాంతానికి తరలించారు. హరిబాబు కుటుంబసభ్యులను తమకు అప్పగించాలంటూ మృతుని బంధువులు అడ్డం తిరగటంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు మృతుని బంధువులను అడ్డుకుని హరిబాబు కుటుంబసభ్యులను ఆటోలో తీసుకువెళ్ళారు. దీంతో కోపోద్రిక్తులైన మృతుని బంధువులు హరిబాబు కుటుంబంపై రాళ్ల వర్షం కురిపించారు. సమస్య మరింత తీవ్రరూపం దాల్చకుండా పోలీసులు అదనపు బలగాలతో గ్రామంలో పహారాకాస్తున్నారు. ఎస్‌ఐ శివబసవరాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.