ప్రకాశం

టీడీపీ పాలనలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్టూరు, సెప్టెంబర్ 23: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రంలోనే అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని పర్చూరు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త రావి రామనాథంబాబు అన్నారు. మండలంలోని వలపర్ల గ్రామంలో పార్టీ ఆదేశానుసారం రావాలి జగన్-కావాలి జగన్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వలపర్లకు వచ్చిన రామనాథం బాబుకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి జగన్ ప్రవేశపెట్టిన నవరత్న పథకాల ప్రాధాన్యతను వివరించారు. అదే విధంగా గ్రామంలో ఉన్న సమస్యలను ప్రత్యక్షంగా ప్రజలనడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగున్నర యేళ్ల టిడిపి పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. టిడిపి పాలన పూర్తిగా అవినీతిమైయంగా సాగిందన్నారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందనివ్వ లేదన్నారు. గ్రామంలో తాగునీరు, డ్రైనేజి, అంతర్గత రోడ్లు అధ్యాన్నంగా తయారయ్యారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే పది సంవత్సరాల వెనక్కుపోతున్నామని, ప్రజలు గుర్తించాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలిపి, జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాలేషావలి, సుగుణరావు, రామారావు, చెంగలయ్య, రామయ్య, వెంకట్రావ్, శ్రీనివాసరావు, మోషేనాయక్, పూర్ణచంద్రరావు, బుజ్జి, బాజి, సర్ధార్, ప్రగడ రామారావు, కోటినాగులు, మోషే, ఏసుభక్తి తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

నెల్లూరు రొట్టెల పండుగలో మంత్రి శిద్దా
కులమతాలకు అతీతంగా రొట్టెల పండగ
నిర్వహించడం సంతోషకరం
నెల్లూరు, సెప్టెంబర్ 23 : కుల మతాలకు అతీతంగా నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రాష్టస్థ్రాయిలో రొట్టెల పండుగ నిర్వహించడం సంతోషకరమని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ఆదివారం సాయంత్రం నెల్లూరు బారా షహిద్ దర్గాలో దర్శనం అనంతరం రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ స్వర్ణాల చెరువులో రొట్టెను అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పండుగ అయిదు రోజుల పాటు రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారని అన్నారు. పర్యాటకుల సౌకర్యార్థం అన్ని వసతులు ఏర్పాటు చేశామని, తద్వారా పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారని అన్నారు. ఆదివారం సుమారు 10 లక్షల మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. రొట్టెలు అందుకుని వారివారి కోరికలైన విద్య, విజయం, అభివృద్ధి, ధన, నివాస తదితర కోరికలు తీర్చుకున్న తరువాత సంవత్సరం వచ్చి ఆయా రొట్టెలను విడవడం ఆనవాయితీ అన్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి దోహదపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. తొలుత మంత్రికి మేయర్ అబ్దుల్ అజీజ్ స్వాగతం పలికారు.