ప్రకాశం

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై సుప్రీంకోర్టు జడ్జిచే విచారణ జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 23 : రాఫెల్ యుద్ధ విమానాల కోనుగోలు అంశంపై బీజేపీ ప్రభుత్వంపై పార్లమెంట్ జాయింట్ కమిటీ వేసి సుప్రీం కోర్టు జడ్జిచే విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర అధ్యక్షులు శ్రీపతి ప్రకాశం, నాయకులు యాదాల రాజశేఖర్, యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీపతి సతీష్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి మల్లికార్జున్‌రావు, పీసీసీ కార్యదర్శి గాదె లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీనాయకులు కె రసూల్, ఆది నారాయణ రెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర అధ్యక్షులు శ్రీపతి ప్రకాశం మాట్లాడుతూ భారత దేశం ఫ్రాన్స్‌తో రాఫెల్‌యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందం 2012 డిసెంబర్ 12న ఆనాడి ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్క విమానం ఖరీదు 526 కోట్ల రూపాయల ధర నిర్ణయించగా ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ దానిని రద్దు చేసి 2015 ఏప్రిల్ 10న ఫ్రాన్స్‌తో ఒక్క విమానం 1670.70 కోట్లు ధరతో కొనుగోలు చేసేందుకు ఒప్పొందం చేసుకున్నట్లు తెలిపారు. భారత దేశానికి 36 విమానాలకు గానూ 41205.60 కోట్టు ఎక్కువ ధర పెట్టి కొనాల్సిన అవసరం ఏంవచ్చిందని వారు ప్రశ్నించారు. ఆ తరువాత ఫ్రాన్స్ మాజీ అధ్యక్షులు వాలండ్ ఒక విషయం ప్రపంచానికి తెలియజేశారని, అంబానీ గ్రూప్‌ను ఫ్రాన్స్‌తో ఉన్న ద సాల్ట్ కంపెనీకి భాగస్వామ్యం చేసిందని స్వయాన నరేంద్రమోదీయేనని ఆయన తెలిపారని పేర్కొన్నారు. దేశంలో సుమారు 1.30వేల కోట్ల మేర అవినీతికి దారి తీసిందని, ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.