ప్రకాశం

ఒంగోలులో ఘనంగా పిడబ్ల్యూడి వర్క్‌షాప్ అండ్ కెనాల్ వర్కర్స్ యూనియన్ 29వ మహాసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 23: ఒంగోలులోని మల్లయ్య లింగం భవన్‌లో ఆదివారం పిడబ్ల్యూడి వర్క్‌షాప్ అండ్ కెనాల్ వర్కర్స్ యూనియన్ (ఎటియుసి అనుబంద సంఘం) 29వ మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ మహాసభకు తొలుత యూనియన్ జెండాను యూనియన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్ కాంతారావు ఆవిష్కరించారు. అనంతరం ఒంగోలు పట్టణంలో యూనియన్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన యూనియన్ 29వ మహాసభలను ఎఐటియుసి రాష్ట్ర డిప్యూటి జనరల్ సెక్రటరీ ఆర్ రవీంద్రనాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మహాసభను ప్రారంభించారు. ఈ సందర్బంగా రవీంద్రనాద్ మాట్లాడుతూ కార్మిక చట్టాల ఉల్లంఘనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని, సిపిఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ విధానం ప్రవేశపెట్టాలని, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను త్రిప్పికొట్టాలని కోరారు. ఈ బూర్జువా పార్టీలు అధికారంలో ఉన్నంతకాలం ఉద్యోగులు, కార్మికులకు సమస్యలు పరిష్కారం కావని రాబోవు ఎన్నికల్లో ఉద్యోగులు, కార్మికులు వామపక్ష పార్టీలను అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెలుగు రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ నాగార్జున సాగర్ కుడికాలువ ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాలువ శాశ్వితమైనది కనుక శాశ్విత పోస్టులు మంజూరు చేయాలని, వర్క్‌చార్జ్‌డ్ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఈ మహాసభలో ప్రకాశం జిల్లా ఎఐటియుసి అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌డి సర్దార్, పివిఆర్ చౌదరి మాట్లాడుతూ నాగార్జున సాగర్ కుడికాలువకు గోదావరి జలాలు తక్షణం మళ్లించాలని కోరారు. ఈ మహాసభకు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి రంగయ్య, అధ్యక్షులు కె జీవరత్నం, ఎఐటియుసి మాజీ కార్యదర్శులు ఎ రమణయ్య, ఎస్‌కె బుడే, సెక్రటరీ టి శేషయ్య, ఎస్‌కె ఖాదర్‌వలి, జివి సుబ్బయ్య, సీనియర్ నాయకులు షేక్ బుడే, ఒంగోలు యూనిట్ కార్యదర్శి జి వెంకటేశ్వర్లు, అధ్యక్షులు వి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని మాట్లాడారు.