ప్రకాశం

రానున్న 40రోజుల్లో రామాయపట్నం పోర్టుకు చంద్రబాబు శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,సెప్టెంబర్ 23: రానున్న 40రోజుల్లోనే రామాయపట్నం పోర్టునిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్ధాపన చేస్తారని జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, యర్రగొండపాలెం శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్‌రాజులు వెల్లడించారు. ఆదివారం స్థానిక జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలోని రామాయపట్నం పోర్టు ఏర్పాటు విషయంపై ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక నాయకులు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. దేశ వ్యాప్తంగా 213 పోర్టులు ఉండగా మన రాష్ట్రంలో 15 పోర్టులు ఉండగా అందులో 14 పోర్టులు మైనర్ పోర్టులు అని, కేవలం విశాఖపట్నంలోని పోర్టు మాత్రమే మేజర్ పోర్టు అని వారు గుర్తు చేశారు. రాష్ట్రంలోని దుగ్గరాజపట్నంలో గత ప్రభుత్వం పోర్టును ఏర్పాటు చేయాలని చెబితే ఫిజుబిలిటీ లేదని నివేదిక వచ్చిందన్నారు. రామాయపట్నం లో పోర్టును ఏర్పాటు చేస్తే బాగుంటుందని జిల్లా కు చెందిన మంత్రులు , శాసన సభ్యులు ముఖ్యమంత్రిని అడగటం జరిగిందని, ఆయన వెంటనే మంజూరు చేయడం జరిగిందన్నారు. కాని జిల్లా అభివృద్ధి వేదిక నాయకులు మాత్రం రామాయపట్నం పోర్టు ఏర్పాటుపై లేనిపోని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్టవ్య్రాప్తంగా సంక్షేమ పధకాలను అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాజధాని నిర్మాణంలో నిధుల కొరత ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకుల నుండి వివిధ మార్గాల ద్వారా నిధులు తీసుకు వచ్చి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం విషయంలో నిధులు విడుదల విషయంలో మొండి చేయి చూపిస్తున్నారని వారు విమర్శించారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు 22 సార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర సమస్యలను వివరించి సహాయం చేయాలని విన్నవించడం జరిగిందన్నారు. కాని కేంద్ర ప్రభుత్వం మాత్రం నిదులు విడుదల విషయంలో మొండి వైఖరిని అవలంభిస్తుందని ఆరోపించారు. రామాయపట్నం పోర్టు ఏర్పాటు కు 4 వేల 500 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నదని, మొదటి విడతగా నాలుగు బెర్త్ లు రానున్నాయని వారు వివరించారు. రామాయపట్నం లో మేజర్ పోర్టు కావాలా... మైనర్ పోర్టు వద్దా.. అంటూ వారు అభివృద్ధి వేదిక నాయకులను ప్రశ్నించారు. రామాయపట్నంలో పోర్టును ఏర్పాటు చేయడం ద్వారా జిల్లా అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు. ఈ పోర్టు నుండే గ్రానైట్ , ఆక్వా, పేపర్ తదితరాలన్నీ ఎగుమతి చేసుకోవచ్చునని వారుతెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని గ్రానైట్ ను చైనె్న పోర్టు ద్వారా ఎగుమతులు చేస్తున్నారని, రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేస్తే అలాంటి పరిస్థితులు ఉండవని వారు తెలిపారు. జిల్లాలో ట్రిపుల్ ఐటి మంజూరు అయ్యిందని, ఆ మేరకు తరగతులు జరుగుతున్నాయని, దొనకొండలో రన్ వే వస్తుందన్నారు. జిల్లాలో నిమ్జ్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాయడం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు శరవేగంగా నిర్మాణం జరుగుతుందని, ఈ నిర్మాణం పూర్తి అయితే రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజలకు , రైతాంగానికి సాగు, తాగునీరు వస్తుందన్నారు. ప్రకాశం జిల్లాలోని చీరాలు, పర్చూరు నియోజక వర్గాలకు కూడా పట్టిసీమ ద్వారా నీరు వస్తుందన్నారు. రాష్ట్రంలోని అమరావతి రాజదానిని హైదరాబాద్ కంటే ఎక్కువగా అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. వైకాపాకు చెందిన శాసన సభ్యులు అసెంబ్లీకి రారని, పోలవరం చూడరని కాని తమ ప్రభుత్వం పై లేని పోని ఆరోపణలు చేస్తుంటారని వారు ఆరోపించారు. వైకాపా నాయకులు బిజెపి తో కుమ్మక్కై ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్నీ గ్రామాలకు సురక్షితమైన మంచినీరు అందించేందుకు 15 వేల కోట్ల రూపాయలతో అభివృద్ది జరుగుతుందన్నారు. రామాయపట్నం పోర్టు విషయంలో మాజీ పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కూడా తెలియక మాట్లాడుతున్నారని, జిల్లాలోని నాయకులు ఇండియన్ పోర్టు యాక్టును ఒక్కసారి చూడాలని తెలిపారు. గుజరాత్‌లోని ముండాల్ పోర్టు అన్నీ విధాలుగా అభివృద్ధి చెందిందని, ఆ పోర్టు కూడా మైనర్ పోర్టేయేనని ఆ విషయాన్ని అభివృద్ధి వేదిక నాయకులు గుర్తించాలని వారు హితవు పలికారు. బిజెపి కి చెందిన రాజ్యసభ సభ్యులు జివియల్ నరసింహారావు అబద్దపు ఆరోపణలన్నీ తమ ప్రభుత్వం పై చేస్తున్నారని , ఆయనకు పిచ్చి పట్టిందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. వెలుగొండ ప్రాజెక్టు మొదటి టనె్నల్ ద్వారా వచ్చే సంవత్సరం మార్చి లోపు నీటిని విడుదల చేయడం జరుగుతుందని, ఆ మేరకు పనులు చురుకుగా సాగుతున్నాయని తెలిపారు. కాగా మావోయిస్టులు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమును మావోయిస్టులు కాల్చి చంపడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విలేఖర్ల సమావేశంలో జిల్లా పార్టీ నాయకులు కొమ్మూరి రవిచంద్ర, గేనం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.