క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో బి ఫార్మసీ విద్యార్థి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల టౌన్, అక్టోబర్ 16: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనగా చీరాల, కొత్తపేట బైపాస్ రోడ్డులో ఆర్టీఏ కార్యాలయం వద్ధ మంగళవారం బి ఫార్మసీ విద్యార్థి దుర్మణం చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. టూటౌన్ సిఐ రామారావు తెలిపిన వివరాల మేరకు, చీరాల మండలం బుర్లవారిపాలెంకు చెందిన దేవరపల్లి హకిల్ (24) కుటుంబం విఆర్‌ఎస్ అండ్ వైఆర్‌ఎన్ కళాశాల సమీపంలో ఇళ్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. ఈ క్రమంలో హకిల్ సెయింటాన్స్ కాలేజీలో బి ఫార్మసీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షలు రాసి తన స్నేహితుడు చందుతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. ఈపూరుపాలెం నుంచి వేటపాలెం వైపు వస్తున్న ద్విచక్ర వాహనంపై గుంటూరు జిల్లా చింతలపూడికి చెందిన కొత్తపాటి గౌతమ్, గద్దెపూడి నిహాల్ చౌదరి ఎదురుగా వస్తూ రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. వీరిరువురు పొన్నూరు ఇంజనీరింగ్ కాలేజిలో చదువుతున్నారు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నలుగురుని 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. అఖిల్‌కు తీవ్రగాయాలు కాగా, చందుకు స్వల్ప గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చేర్చిన అనంతరం హకిల్ మృతిచెందాడు. కొత్తపాటి గౌతమ్ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనాలు రెండు ఢీకొనడంతో అదే సమయంలో బైపాస్ రోడ్డుపై ఐస్‌క్రీమ్ అమ్ముతున్న జాండ్రపేటకు చెందిన మహబూబ్‌బాషాపై విద్యార్థులు పడ్డారు. దీంతో మహబూబ్‌బాషా కాలికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన హకిల్ తండ్రి డేవిడ్ బుర్లవారిపాలెంలో పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రామారావు తెలిపారు.

ప్రమాదవశాత్తు సాగర్‌కాలువలో పడి ఇద్దరు మహిళలు మృతి
త్రిపురాంతకం, అక్టోబర్ 16: నాగార్జున్‌సాగర్ కాలువలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. దొనకొండ మండలం రుద్రసముద్రం గ్రామానికి చెందిన బచ్చలపురి కోటేశ్వరమ్మ (43), మహిళ పులివెందుల లక్ష్మి (21) మంగళవారం ఉదయం బట్టలు ఉతికేందుకు దూపాడు బ్రిడ్జి వద్ద ఉన్న మెట్ల నుంచి నాగార్జున సాగర్ కాలువలో దిగి ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. అలాగే యర్రగొండపాలెం మండలం వీరాయపాలెం గ్రామానికి చెందిన శివయ్య (20) స్నేహితులతో కలిసి నాగార్జునసాగర్ కాలువకు ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు.