తెలంగాణ

సినీనటి ప్రణీతకు తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ:సినీనటి ప్రణీత పెద్దప్రమాదంనుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు బోల్తాపడగా సీటు బెల్టుకోవడంతో స్వల్పగాయాలతో బైటపడ్డారు. ఖమ్మంలో ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొని ఇన్నోవా కారులో తిరిగి వస్తూండగా నల్గొండ జిల్లా మోతెవద్ద ఎదురుగా వెళుతున్న మోటార్‌బైక్‌ను తప్పించే ప్రయత్నంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం బోల్తాపడింది. ఆ సమయంలో కారులో ఆమెతోపాటు తల్లి, బంధువులు ఉన్నారు. కాగా అక్కడే రోడ్డుపనులు చేస్తున్న ఎఇఇలు అంబులెన్స్ పిలిపించి చికిత్స చేయించే ప్రయత్నం చేశారు. మరోకారులో ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఆమెను పరామర్శించారు. హైదరాబాద్ చేరుకున్న ఆమె విమానంలో చెన్నై బయలుదేరి వెళ్లారు. కాగా సీటుబెల్టు పెట్టుకోవడంవల్లే ప్రాణాలు దక్కాయని, ప్రమాదస్థలిలో ప్రజలు తమపట్ల చూపిన అభిమానానికి ధన్యవాదాలు చెబుతూ ఆమె ట్విట్టర్‌లో కామెంట్ ట్వీట్ చేశారు. తామంతా సురక్షితంగా ప్రమాదంనుంచి బయటపడ్డామని, స్వల్పగాయాలయ్యాయని, ఆందోళన అవసరం లేదని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.