క్రీడాభూమి

చాంగ్‌వెయ్‌కి ప్రణీత్ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ప్రపంచ మాజీ నంబర్ వన్, మలేసియా స్టార్ ఆటగాడు. లీ చాంగ్ వెయ్‌కి భారత యువ షట్లర్ సాయి ప్రణీత్ షాకిచ్చాడు. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో అతను 24-22, 22-20 తేడాతో చాంగ్ వెయ్‌పై సంచలన విజయాన్ని నమోదు చేశాడు. పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. అతను రాజీవ్ ఊసెఫ్‌పై 21-17, 21-12 స్కోరుతో గెలుపొందాడు. యువ ఆటగాడు సమీర్ వర్మ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మొదటి రౌండ్‌లో 21-1-, 21-14 ఆధిక్యంతో హు యున్‌పై విజయాన్ని నమోదు చేశాడు. అయితే, రెండో రౌండ్‌లో హౌవెయ్‌తో తలపడిన అతను 21-10, 12-21, 19-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. అజయ్ జయరామ్ చివరి వరకూ తీవ్ర స్థాయిలో పోరాడినప్పటికీ 18-21, 21-19, 19-21 తేడాతో కలాంగ్ ఆన్ చేతిలో మొదటి రౌండ్‌లోనే ఓడాడు. హెచ్‌ఎస్ ప్రణయ్‌పై జూ సాంగ్ 22-20, 21-15 తేడాతో గెలిచాడు.
మహిళల డబుల్స్‌లో జ్వాలా గుత్తా, అశ్వినీ పొన్నప్ప, పురుషుల డబుల్స్‌లో మనూ అత్రి, సుమీత్ రెడ్డి జోడీలకు చుక్కెదురైంది. జ్వాల, అశ్విని జోడీపై సమంతా బారింగ్, ఇరిస్ టాబెలింగ్ జోడీ 20-21, 26-21, 21-17 తేడాతో గెలిచింది. మను అత్రి, సుమీత్ జోడీపై కియాన్ కియెట్ కూ, బూన్ హియాంగ్ తాన్ జోడీ 16-21, 21-13, 21-15 తేడాతో ఓటమిని చవిచూసింది.