ప్రార్థన

క్రీస్తు జ్ఞానము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు క్రీస్తు నందే గుప్తమై యున్నవి. జరిగిన సంగతులు జరుగుతున్నవి. జరుగబోవునవి తెలిసినవాడు. కనుకనే మనం ఎలా ఉండాలో? ఎటువైపు నడవకూడదో? ఎక్కడ నిలువకూడదో? ఎక్కడ కూర్చోకూడదో? ఏది ధ్యానించాలో? ఎలా ధ్యానించాలో అంతా విపులంగా వేల సంవత్సరాల క్రితమే తెలియజేశాడు. నెబుకద్నెజరు ఒక కలగన్నాడు. కలవరపడి, కల భావాన్ని తెలియజేయుమని శకునగాండ్రను గారడీ విద్యగల వారిని మాంత్రికులను కల్దీయులను పిలిపించాడు. వారు కల భావాన్ని వివరించలేక పోయారు. అయితే దేవుని జ్ఞానంతో కలనూ కల భావాన్ని కూడా దానియేలు వివరించాడు. యెహోవా దేవుడు అనంత జ్ఞాని. గనుక ఆయనను వెంబడించిన వారికి ఆ జ్ఞానం లభిస్తుంది. ఆయన యందలి భయభక్తులే జ్ఞానానికి మూలం.
తన జ్ఞానముచేత ఆకాశమును కలుగజేసెను. భూమిని నీళ్ల మీద పరచెను. పగటి నేలుటకు సూర్యుని రాత్రి నేలుటకు చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతముండును. శూన్య మండలంపైని ఉత్తర దిక్కున నున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. శూన్యముపైన భూమిని వ్రేలాడదీసెను. భూమి శూన్యంలో వేలాడుతోందని బైబిల్‌లో 4 వేల సంవత్సరాల క్రితమే వ్రాయించాడు ప్రభువు. వాటి క్రింద మేఘములు.. మేఘములలో నీళ్లను బంధించాడు. దాని మీద మేఘాలను వ్యాపింపజేసి ఆయన తన సింహాసన ప్రకాంతిని మరుగుపరచాడు. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. జ్ఞానమును విడువక యుండిన యెడల అది నిన్ను కాపాడును. దానిని ప్రేమించిన యెడల నిన్ను రక్షించును. భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు. అలయడు. సొమ్మసిల్లిన వారికి ఓదార్పునిస్తాడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేస్తాడు. అందరి హృదయ రహస్యములు ఎరిగిన వాడాయన. మనలను సృష్టించి ఆకాశము నుండి భూలోక వాసులందరి వైపు చూస్తున్నాడు.
మనలను సృష్టించిన సంగతి మనకు తెలియజేసి, పాపములో పడిపోకుండా మనలను రక్షించటానికి నరావతారిగా ఈ లోకానికి వచ్చి, రక్తం చిందించి, ప్రాణము పెట్టి మనలను విమోచించాడు.
మన తలంపులు.. మన ప్రవర్తన - నడక.. హృదయములో నుండి వచ్చు ప్రతి మాటా.. దేవునికి తెలుసు. ప్రభువు ఆజ్ఞ నుండి ఎక్కడికి పారిపోగలం? ఆకాశంలో ఎక్కడ ఉన్నా? పాతాళంలో ఎక్కడ దాక్కున్నా.. సముద్ర గర్భంలో ఉన్నా, చీకటిలో ఉన్నా ఆయన నుండి ఏ మనుష్యుడును తప్పించుకోలేడు. తల్లి గర్భమున మనలను నిర్మించినవాడు, పిండముగా నుండగా చూసిన వాడు ఆయనే. ప్రతి మాట, చూపు, తలంపు, కష్ట నష్టములు, వేదన, బాధ, ఇరుకు ఇబ్బందులూ అన్నీ ఎరిగినవాడు. దీనులకు అండగా ఉండి ఆపదలలో చిక్కుబడిన సంగతి తెలుసుకొని శత్రువు నుండి విడిపించగలడు.
ఆయన మాటలు పాటించి.. ఆయన ఆజ్ఞలను హృదయములో ఉంచుకొని.. పిల్లలకు వాటిని బోధించాలి. కూర్చుండునప్పుడు.. నడచునప్పుడు.. ఏ విషయంలోనైనా ఆయన ఆజ్ఞలను గురించి మాట్లాడుకోవాలి. సూచనగా వాటిని చేతికి కట్టుకొని.. కన్నులకు కనిపించేటట్టు ద్వారముల మీద వ్రాసి ఉంచుకొన్నట్లయితే అది మనకు సూచనగా ఉండటమే కాదు.. మేలు కలుగజేస్తుంది.
అయితే ప్రస్తుతం జరుగుతోంది ఏమిటి? దేవుని మాటల స్థానంలో ఆజ్ఞల స్థానంలో ఏం చోటు చేసుకుంటున్నాయో మనందరికీ తెలుసు. కూర్చున్నప్పుడు.. నించున్నప్పుడు.. పడుకొన్నప్పుడు.. వంటింట్లో.. డ్రైవింగ్‌లో... చదువుకొనేటప్పుడు - ఏ సమయంలోనైనా.. ఆఖరికి తల్లితోనో తండ్రితోనో.. కుటుంబ సభ్యులతోనో.. భార్యతోనో.. భర్తతోనో మాట్లాడే సమయంలోనూ ముందుగా మొబైల్ దర్శనం చేసుకొంటున్నారు. ధ్యాస ధ్యానం అంతా సెల్‌ఫోనే. పక్కపక్కన ఉన్నా.. ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ మాటలు ఉండవు. ఆత్మీయ పలకరింపు ఉండదు. సహవాసం ఉండదు. కూడిక ఉండదు.
డ్రైవింగ్‌లో మొబైల్ మాట్లాడటంవల్ల జరిగే ప్రమాదాల సంఖ్య రాన్రాను పెరిగిపోతోంది. ఎన్నో ప్రాణాలు పోయాయి. వంటింట్లో వంట మాడిపోతుంది. రోడ్డు మీద ‘సెల్’ చూసుకుంటూ లేదా మాట్లాడుతూ గుంటల్లో పడ్డవారు, కార్ల కింద పడి మరణించిన వారూ.. అంగవైకల్యాన్ని తెచ్చుకొన్నవారూ ఎందరో. మొబైల్ వల్ల లాభాల కంటె నష్టాల శాతమే ఎక్కువ. అది అందించే జ్ఞానం కంటే చెడే ఎక్కువ. సాంకేతికతను ఎంతవరకూ అవసరమో అంతవరకే వాడుకొని.. మిగిలిన సమయాన్ని జ్ఞానయుక్తంగా వాడుకోవటం వివేకవంతుల లక్షణం.
యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలము. దుష్టత్వాన్ని విడిచిపెట్టి వివేకాన్ని అంది పుచ్చుకోవాలి. దేవుని ఆజ్ఞలను పాటించి తల్లిదండ్రులను గౌరవిస్తూ, జ్ఞానాన్ని సంపాదించుకొని సంతోష సమాధానాలతో సుఖంగా జీవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలని ప్రార్థన.
*

-మద్దు పీటర్ 9490651256