ప్రార్థన

కనికరము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కనికరము గలవారు ధన్యులు. వారు కనికరము పొందుదురు.’ -మత్తయి 5:7
తోటివారి అవసరాలలో ఆదుకోవటమే కనికరము. ఆకలిగొన్న వారికి అన్నము పెట్టుట, దప్పిగొన్న వారి దాహము తీర్చుట, పరదేశులను చేర్చుకొనుట, దిగంబరులకు వస్తమ్రులిచ్చుట, రోగులను దర్శించుట, చెరసాలలో ఉన్న వారిని పరామర్శించుటయే కనికరము. అన్ని సుగుణాలు కంటె శ్రేష్ఠమైనది కనికరము. అవసరములో ఉన్నవారు అర్హులైన అనర్హులైన వారిని ఆదుకోవటమే కనికరము. మనసులో జాలి దయ కలుగుటయె కాదు అది కార్యరూపము దాల్చాలి. బీదలైన తోటివారిని కరుణింపకుండ నీ హృదయము కఠినపరచుకొనకూడదు. మన నడవడిలో కనికరముండాలి. అపకారమును మనసులో ఉంచుకొనకూడదు, కోపపడకూడదు, ఇతరుల దోషాలను దండోర వేయకూడదు.
‘దయగలవాడు తనకే మేలు చేసుకొనును. క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును’ - సామెతలు 11:17
‘మీ తండ్రి కనికరము గలవాడై యున్నట్టు మీరును కనికరము గలవారై యుండుడి’ -లూకా 6:36
తండ్రి తన ప్రజలను కనికరించి అనేకసార్లు అనేక రకాలుగా వారి అవస్థలను చూచి కనికరపడినట్లు చూస్తునే ఉన్నాము. బానిస బ్రతుకుల బంధకాలు, అరుపులు, ఆకలి అంగలార్పులు, బాధలు వ్యాధులు చూచి కనికరపడి కాపాడిన దేవునికి వందనాలు. కనికరము పొందుకొని సాటి మనిషిని కనికరించి సహాయపడిన మహానుభావులు ఎందరో అందరికి హృదయపూర్వక వందనాలు.
దేవుని కనికరము పొందుకున్నవారు తోటివారి పట్ల కనికరము కలిగి ఉండాలి. అట్టివారు జీవితాంతము కనికరము పొందుకుంటునే ఉంటారు. ప్రభువు దయగలవారి పట్ల దయ గలిగి ఉంటాడు. యధార్థవంతుల యెడల యదార్థంగా ఉంటాడు, సద్భావము గలవారి యెడల సద్భావము కలిగి ఉంటాడు. తోటివారి యెడల కనికరము చూపిస్తే మన యెడల కనికరము చూపిస్తానంటున్నాడు. విస్తారమైన పాపములు క్షమించబడిన మనము తోటి వారిని క్షమించాలి. ఇది ప్రభువు ఆజ్ఞ. ‘నేను మిమ్మును ప్రేమించినట్టు మీరును ఒకరినొకరు ప్రేమింపమని’
అయితే మానవుని బుద్ధి ఎంత సంకుచితమో ప్రభువు ఒక ఉపమానము ద్వారా తెలియజేశాడు. ఒక రాజునకు సేవకుడు 10వేల తలాంతులు అప్పు ఉన్నాడు, అప్పు తీర్చమని అడిగినపుడు, ఆ దాసుడు సాగిలపడి మ్రొక్కి కొంచెం వ్యవధి అడిగాడు. రాజు దాసుని మీద కనికరపడి వానిని క్షమించి అప్పు కొట్టివేసి విడిచిపెట్టాడు. 10వేల తలాంతులు ఇంచుమించు 3 కోట్ల 60 లక్షలు. అంత పెద్ద మొత్తం క్షమించబడి బయటకు వెళ్లి తనకు నూరు దేనారములు (50 రూపాయలు మాత్రమే) అచ్చియున్న తోడి దాసుని గొంతు పట్టుకొని, నీ అప్పు తీర్చమనగా తోటి దాసుడు సాగిలపడి, నా యెడల ఓర్చుకొనుము. కొద్ది వ్యవధి ఇవ్వమని కోరినపుడు, వాడు ఒప్పుకొనక చెరసాలలో వేయించెను. 3 కోట్ల 60 లక్షలు క్షమించబడి 50 రూపాయలు అప్పు ఉన్న తోటి వానిని చెరసాలలో వేయించాడు. ఈ సంగతి తెలిసిన రాజు - నేను నిన్ను కనికరించి నీ అప్పు క్షమించినట్లు నీవు నీ తోడి దాసుని అప్పును క్షమించవలసి యున్నది. నీవు కనికరం పొందావు గాని తోడి వానిని కనికరించలేక పోయావు గనుక నీ అప్పు అంతా చెల్లించు వరకు చెరసాలలో ఉండుమని చెప్పెను.
కనికరించటం అంటే జాలి చూపుట మాత్రమే కాదు. జాలిగా దయగా మాట్లాడటమే కాదు గాని వారి అవసరమును బట్టి చేయగలిగిన సహాయము చేయుట. జాలి మాటలు కోటలు దాటుతాయి కాని ఎదుటి వాని దగ్గరకు మాత్రము చేయి చాపరు. అయితే దీనుల పట్ల, అల్పుల పట్ల కనికరము చూపుట క్రీస్తుకు చూపినట్టేనని ప్రభువు సెలవిస్తున్నాడు. నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిక గొంటిని దాహమిచ్చితిరి. పరదేశినై యుంటిని. నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై యుంటిని నాకు బట్టలిచ్చితిరి. రోగినై యుంటిని నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి అని ప్రభువు చెప్పాడు. కనికరానికి మారు పేరు మదర్ థెరిసా. తాను కుష్ఠువ్యాధి గలవానికి పరిచర్య చేస్తున్న సమయములో ఒక అతిథి వచ్చి ఎలా చేయగలుగుతున్నావు ఈ పరిచర్య. చూడటానికే కష్టంగా ఉందని అడిగితే - తాను ఇచ్చిన సమాధానము - నేను క్రీస్తుకు పరిచర్య చేస్తున్నాను అందిట. దేవుని పోలికలో సృష్టించబడిన ఎవరిని గౌరవించినా దేవుని గౌరవించినట్లే. అది ఆశీర్వాదము.
దీనులను దరిద్రులను కనికరించలేని స్థితికి లోకం ఎదిగింది. స్వనీతి కలిగి మేము మంచివారము గొప్పవారము భక్తిపరులము అందుకే దేవుడు మమ్ములను ఇంతగా హెచ్చించాడు, దరిద్రులు వారి కర్మ వారనుభవిస్తున్నారు అని తోటిమనిషిని తేలికగా చూసి పనికిరాని వారుగా చివరకు అంటరాని వారిగా వెలివేశారు.
కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందును అని బైబిల్ సెలవిస్తోంది. ఈ రోజులలో భక్తికి కొరత లేదు కాని నీతికి స్థానము లేదు. ప్రభువు కనికరాన్ని కోరుకుంటున్నాడు కాని బలులను, నైవేద్యములను కాదని, అది వ్యర్థమని చెప్పుచున్నాడు. కీడు చేయుట మానుడి మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడు వానిని విడిపించుడి. తండ్రి లేనివానికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడని ప్రభువు సెలవిస్తున్నాడు.
తల్లిదండుల మీదనే కనికరము లేని తరములు ఉన్నాయి. తిని తినక ఎండనక వాననక రేయనక పగలనక కష్టపడి, పిల్లలను పెంచి ప్రయోజకులనుగా చేస్తే, స్థాయి పెరిగిపోయి తలిదండ్రులను కనికరించక వృద్ధాశ్రమాలకు గురి చేస్తున్నారు. తలిదండ్రులు చేసిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. తండ్రియైన దేవుడు మన పాపాల కొరకు కష్టనష్టాల కొరకు వ్యాధి బాధల నుండి విడుదల కొరకు నిత్య రక్షణార్థము తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. పాపమెరుగని క్రీస్తు పాపిగా మారాడు. మన దారిద్య్రాన్ని పోగొట్టడానికి ఆయన దరిద్రుడుగా మారి తన రక్తాన్ని ధారపోసి ప్రాణము పెట్టి నిత్య నరకము నుండి తప్పించి రక్షణకు కారకుడయ్యాడు. పాపిని కనికరించి చేసిన ఈ యజ్ఞాన్ని అంగీకరించక, అసలు దేవుని కుమారుడైతే సిలువ ఎందుకు ఎక్కాలి, ప్రాణము ఎందుకు ఇవ్వాలి, దేవుని కుమారుడవైతే సిలువ దిగి రావచ్చు కదా. కాబట్టి ఈయన దేవుడు కాదు. అసలు దేవుడే లేడు అనే స్థితిలో ఉన్న మానవుని రక్షణార్థమై మరణాన్ని గెల్చి లేచిన ప్రభువు ఇంకా కనికరముతో ఎదురుచూస్తున్నాడు. ఇంతగా తృణీకరించిన కనికరముతో కనిపెట్టుచున్న క్రీస్తు మహా కనికరానికి పాదాభివందనాలు. ఇంతగా ప్రేమిస్తున్న దేవునికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలము. ఆ కనికర సంపన్నుని కనికరము పొందుకొని ఆయన ఆజ్ఞ మేరకు తోటి వారిని కనికరిస్తూ ప్రభువు ఇచ్చే దీవెనలు మెండుగా పొందుకోవటమే. దేవుని పోలికలో ఉన్న మనుషులకన్న జంతువుల మీద వస్తువుల మీద ఎక్కువ ప్రేమ గలిగి ఉంటున్నాడు. మన మాట దేవుడు విని జవాబు ఇవ్వాలంటే ఆయన మాటను మనము పాటించాలి. ఆయన ఆజ్ఞలకు విధేయులమవ్వాలి. ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా విని పాటిస్తే వెయ్యి తరాలు దీవిస్తానని వాగ్దానమిచ్చాడు. నీ ఒక్కని విధేయత వల్ల వేయి తరాలు ఆశీర్వదించబడతాయి. దేవుని ఎరిగిన దేవుని బిడ్డలు, ఇచ్చేవారే కాని పుచ్చుకొనేవారు కాదు. సహాయకారులుగా ఉంటారు. తప్పులెనే్నవారు కాదు గాని కనికరించే వారుగా ఉంటారు. కనికరం పొందుకున్న వారు తోటి వారిని కనికరిస్తుంటే దేవుని దీవెనలెన్నో కుమ్మరించబడుతాయి. దేవుని కనికరాన్ని పొందుకోకపోయిన, కనికరము పొందినవారు ఇతరులను కనికరించకపోయినా కనికరము లేని తీర్పు పొంది దేవుని రాజ్యానికి వారసులుగా కాలేరు. కనికరము పొందుకున్న వారి కనికరమే ఈ దీనుని ఆదుకొని వైద్య విద్యా బుద్ధులిచ్చి వెలుగు మార్గము చూపింది. వారిని కనికరించిన క్రీస్తుకే ఈ జీవితం. తండ్రియైన దేవుని నుండియు మన ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు కనికరము సమాధానము కలుగును గాక. కనికరమును న్యాయమును ఎడతెగక అనుసరించు.

-మద్దు పీటర్ 9490651256