ప్రార్థన

సమాధానకర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.’
అసమాధానము అల్లకల్లోలము గొడవలు కొట్లాటలు గందరగోళంగా ఉన్న ఈ లోకాన్ని ప్రభువు చూసిచూసి, సమాధానకర్తయగు అధిపతి ఈ లోకానికి శిశువుగా వచ్చాడు. ఈయన సమాధానమునకే కర్తగాని అసమాధానానికి అల్లర్లకు కర్త కాదు.
దేవుడు మానవునికి ఇచ్చిన ఏదేను తోట ఎంతో హాయిగా ఆహ్లాదంగా సంతోషంగా సమాధానముగా ఉండేది. సమాధానకర్త మాటలు వినక అసమాధానకర్తయైన సాతాను మాటలు విని సమాధానము పోగొట్టుకున్న లోకం, ఎలాగైనా మునుపటి సంతోష సమాధానాలు కావాలని తపన కలిగి ఉన్నది. అందుకు అనేక స్థలాలకు వెళ్తున్నారు. అనేక దేశాలకు వెళ్తున్నారు. అనేకమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయినా ఎక్కడ, మనసు కోరుకుంటున్న సమాధానము లేదు. వాస్తవానికి అది ఎక్కడ నుండో వచ్చేది కాదు ఎవరో ఇచ్చేది కాదు. సమాధానకర్తయైన యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. ఈయనే సమాధానకర్తయగు అధిపతి. హళ జఒ ఆ్దళ -జశషళ యచి -ళ్ఘషళ. ఈయనే షాలేము రాజు (జశ యఛి -ళ్ఘషళ) హెబ్రీ 7:2. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు. ఈయనే మనకు సమాధానము. మనిషికి మనిషికి మధ్య ఉన్న ద్వేషాన్ని తన శరీరమందు సిలువలో కొట్టివేశాడు. ఆయన రాజ్యము నీతి సమాధానములు పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో నిండి యున్నది. ఆయన మాట వింటే అసమాధానానికి కర్తయైన సాతానును మీ కాళ్ల కింద చితుక తొక్కిస్తాడు.
ప్రశాంతంగా సమాధానముగా సాగుతున్న లోకమును సాతానుడు మాయమాటలు అబద్ధాలు లేనిపోని కల్పితాలు అబద్ధ సాక్ష్యాలు చెప్పి మనుషులను ప్రేరేపించి నెమ్మది సమాధానము లేని ఇళ్లు సమాజము రాష్ట్రాలు దేశాలుగా చేశాడు. లోకంలో ఎక్కడా ప్రశాంతత లేదు. సమాధానము కొరకు అనేక మిలియన్లు ఖర్చుచేసి ఇంకా అసమాధానములో పడిపోతున్నాడు.
ఎవరికి ఉన్నదానితో వారు తృప్తి పడలేక పోతున్నారు. ఇతరులవి చూసి ఆశపడుతున్నారు. నిరాశ అసంతృప్తితో సమాధానము కోల్పోతున్నారు. ప్రభువు మాట ‘నీ పొరుగు వానిది ఏది ఆశించకు’ వింటే ఎంత మేలు ఎంత సమాధానంగా ఉంటుందో గదా! మనిషి చిన్నప్పటి నుండి ఏదో ఒక ఆరాటం తపనతో ఉంటున్నాడు. స్కూల్లో ఉన్నప్పుడు హైస్కూల్‌కి ఎప్పుడు వెళ్లాలా అని, కాలేజీ చదువులు హాయిగా ఉంటాయనీ, చదువుకునే రోజుల్లో ఎప్పుడు ఉద్యోగం వస్తుందాని, తరువాత వివాహము తర్వాత ఎప్పుడు రిటైర్ అవుతామా? అప్పుడు ప్రశాంతంగా ఉండవచ్చునని అనుకుంటారు కాని, రిటైర్మెంట్ తర్వాత తాను కోరుకున్న ప్రశాంతత లేక అసలు ఈ జీవితం నుంచే రిటైర్ కావాలని కోరుకుంటారు. జాగ్రత్త! ఎంతో విలువైనది ఈ జీవితం. పోతే మళ్లీ వచ్చేది కాదు. ఒక్క క్షణం కూడా వెనుకకు రాదు. దీనినిబట్టి ఒక్క క్షణ జీవితం ఎంత విలువైనదిగా ఆలోచించి సమయాన్ని విలువైన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక్క క్షణ జీవితాన్ని ఎవరూ అమ్మలేరు. కొనలేరు. కాలాలు సమయాలు అన్నీ ప్రభువు చేతిలో ఉన్నాయి. సమాధానకర్తయగు దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ రోజు జీవితం ఆ రోజు సమాధానంగా సంతోషంగా జీవించగలము. ఏ పని చేస్తుంటే ఆ పనిని సంతోషంగా చేయగలము. మనకున్నంతలో సంతోషంగా ఉండగలము. మంచి ఉద్యోగం మంచి కుటుంబంతో సమాధానముగా ఉండగలవు. ఈ సంతోష సమాధానము ఇవ్వటానికే ప్రభువు సిలువలో గాయపడింది. ఘోర హింస అనుభవించింది. అస్తవ్యస్థమైన జీవితాలు సరిచేయటానికే ప్రభువు ఈ లోకానికి వచ్చింది.
ఒక్క క్షణ జీవితాన్ని సంపాదించుకోలేని మనకు నిత్య జీవితాన్ని సంపాదించి పెట్టాడు. క్రీస్తునందు నిత్య జీవము ఉచితంగా దొరుకుతుంది. సమాధానము సంతోషము అన్నీ ఉచితమే. కాని ఒక్క చిన్న నిబంధన. ఆయన మాటకు విధేయించాలి.
చాలామంది శాంతి సమాధానము సంతోషము నిత్య జీవము కోరుకొని ఏదేదో చేసి ఉన్న కాస్త సమాధానాన్ని పోగొట్టుకుంటారు. త్రాగుడుతో సమాధానమున్నదని కొందరు, ఆటపాటలతో సమాధానముంటుందని కొందరు, తిరిగితే సమాధానము ఉంటుందని ఇంకొందరు.. ఇలా అనేక రకాలుగా సమాధానము కొరకు వెతికి చివరకు సమయాన్ని ఆరోగ్యాన్ని ఆస్తిపాస్తులను పోగొట్టుకొని మతి స్థిమితము లేకుండా జీవిస్తున్నారు.
అయితే యెషయా ప్రవక్త చెప్పినట్లు - ఎవని మనసు ప్రభువు మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతిగలవానిగా కాపాడతాడని తెలుస్తుంది. మన పని క్రీస్తు నందు విశ్వాసముతో ఆయన మీద ఆధారపడటము మాత్రమే. ఈ విశ్వాసము కొరకు ప్రభువును ప్రార్థించాలి. ప్రభువు మనకు అచంచలమైన విశ్వాసాన్ని ఇస్తాడు.
పోయిన సంతోషము సమాధానము తిరిగి ఎలా పొందుకోగలము? ప్రభువే తన దూతను పంపి ప్రజలందరికి సంతోషకరమైన శుభ వర్తమానము తెలియజేశాడు. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. ఆయనకు ఇష్టులైన వారికి భూమి మీద సమాధానము. ఇవి లోకమిచ్చే తాత్కాలికమైన సమాధానము శాంతి కాదు. ఇది క్రీస్తులో మనకు దొరికే నిత్య సంతోషము సమాధానము. ప్రభువే సమాధానము గనుక ఆయనను చేర్చుకొనటమే సమాధానము.
శాంతి మీకనుగ్రహించి వెళ్లుచున్నాను. నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్లుగా మీ కనుగ్రహించుట లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి. వెరవనియ్యకుడి - యోహాను 14:27. సమాధానకర్తయగు దేవుడు తన సమాధానాన్ని మనకు పంచి ఇస్తున్నాడు. దేవునితో సమాధానపడి ఆయన ప్రేమను శక్తిని పొందుకుని సమాధానపరుస్తుంది. క్రీస్తు ద్వారా పొందుకున్న సమాధానమును మన హృదయములను ఏలుచుండనియ్యాలి. ఈ సమాధానము దేవుని నమ్మిన వారికి, నమ్మి ఆత్మీయంగా జీవించేవారికి దేవుడిచ్చిన ఫలం- ఆత్మఫలములో ఉంటుంది. ఈ ఆత్మ ఫలము, ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము.
రక్షకుడైన యేసుక్రీస్తును నమ్మి దేనిని గూర్చియు చింతపడకుండా ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా ప్రభువును ప్రార్థించుచు ఉంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకు కావలి యుండును.
ఆశ అసంతృప్తి అసమాధానము పుట్టేది హృదయాలలోనే గనుక ఆ హృదయములకు దేవుని కాపుదల ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నా - నీ ప్రక్క వేయిమంది పడినను నీ కుడిప్రక్క పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు అనే ధైర్యముతో సమాధానముగా ఉండగలవు. దేవుని సమాధానము మనకు విశ్రాంతినిస్తుంది. ఈ లోకము మనలను అవిశ్రాంతం చేస్తుంది. అవిశ్రాంతంగా అసమాధానంగా ఉందా? ఒక్కసారి సమాధాన కర్తయగు అధిపతిని అడుగు అర్థించు. అడుగుడి మీకియ్యబడును అని వాగ్దానమిచ్చిన ప్రభువు వెంటనే నీకు సమాధానము దయచేస్తాడు.
రోమా 14:19 - కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలుగచేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. మనము సమాధానముగా ఉండి అందరితో సమాధానమును పరిశుద్ధతయును కలిగి యుండుటకు ప్రయత్నిద్దాం.
మనము సమాధానముగా ఉండి ఇతరులను కూడా సమాధానపరచుచు దేవుని కుమారులముగా కుమార్తెలముగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి సహాయము చేయునుగాక.
నీవు కోరుకుంటున్న ప్రశాంత సమాధానము శాంతి క్రీస్తును బట్టి నీలోనే ఉంది.

-మద్దు పీటర్ 9490651256