ప్రార్థన

పోరాటము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.’ - ఎఫెసీ 6:12
మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి.
మనము పోరాడునది శరీరులతో కాదు. అంటే మనము పోరాడవలసింది మన కుటుంబీకులతో కాదు. ఇరుగు పొరుగు వారితో కాదు. ఆఫీసులో వారితో కాదు. వేరే ఊరి వారితో కాదు. వేరే పట్టణస్తులతో కాదు. రాష్ట్రాలతో కాదు. వేరే దేశాల వారితో కానేకాదు గాని అంధకార సంబంధులగు లోకనాథులతోను ఆకాశమండల మందున్న దురాత్మల సమూహములతో పోరాడవలసి యున్నది.
కానీ లోకములో ఎక్కడ చూసినా మనుషుల మధ్యనే ఎక్కువగా పోరాటాలు జరుగుతున్నాయి. దేశము మీదికి దేశము రాష్ట్రాల మీదికి రాష్ట్రాలు యుద్ధాలకు పాల్పడుతున్నాయి. అక్కడదాకా ఎందుకు ఒక ఇంటిలోనే సొంత అన్నదమ్ములకూ అక్కచెల్లెళ్లకూ మధ్య ఎన్ని గొడవలు.. ఎన్ని కోర్టు కేసులు నడుస్తున్నాయి.
దేవుడు మనుషులను ఎంతో గొప్పగా ప్రేమిస్తున్నాడు. ఆయన స్వహస్తాలతో ఆయన రూపులో చేసుకున్నాడు. ఆయన మహిమ కొరకు చేసుకున్నాడు. ఆయన ప్రాణానికి ప్రాణంగా మనలను ప్రేమించాడు. మానవునికి ఇచ్చిన ముఖ్యమైన ఆజ్ఞ ఒక్కటే. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుడి. ఒకరినొకరు ప్రేమించుకోవటానికి బదులు కరుచుకోవటం అరుచుకోవటం ఎక్కువైంది. దీన్నిబట్టి దేవుని మాట లెక్కచేయటం లేదని తెలుస్తుంది. మరెవరి మాట వింటున్నారు. ఎవరితో పోరాడుతున్నారు. దేవుని పోలికతో ఉన్న దేవుని బిడ్డలతో పోరాడుతున్నారు. అంటే దేవునితోనే పోరాడుతున్నారు.
సాతానుడు మనిషిని మోసము చేసి దేవునికీ మనకూ వైరము కలుగజేసి యున్నాడు. లోకమంతా ఈ మోసములో పడింది. ఇంకా పడుతూనే ఉంది.
‘ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవముగల ప్రతి దానికి తల్లి.’ - ఆది 3:20
ఒకే తల్లీబిడ్డల మధ్య మోసముతో ద్వేషాన్ని వైరాన్ని కలుగజేశాడు సాతానుడు. సాతాను పని కేవలము మోసము చేయటమే. అబద్ధాల మాటలు మాయమాటలు చెప్పి లోకాన్ని మోసపరుస్తున్నాడు. రెండవది విడగొట్టుట - ఒకరికి ఒకరు సంబంధం లేకుండా చేయుట. మూడవది నాశనము చేయుట.
దేవుని ఆశీర్వాదము ఫలించి అభివృద్ధి చెందమని. సాతాను చేసిన పని నాశనము చేయుట. ముందు మోసముతో మంచి మంచి మాటలు చెప్పినా చివరకు అది నాశనమే.
దేవుని చిత్తము మనమందరము కలసిమెలసి ఉంటూ ఒకరినొకరు ప్రేమిస్తూ సాతానును ఎదిరించమని. వాడి మాయలో పడవద్దని. సాతాను మాయలో పడకుండా ఉండాలంటే ముందు దేవుని ప్రేమను, ఆయన మనలను ప్రేమించి చేసిన సిలువ యజ్ఞాన్ని నమ్మాలి. ఆయన మన పాపాల కొరకు మరణించాడని, మరణాన్ని గెలిచి లేచాడని నమ్మాలి. ఆయన మాటలను నమ్మాలి. ప్రభువు చెప్పింది చేయాలి. ఆయన మాటలే మనకు ఆయుధము. మనకు బలము. మనకు తెలివిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. యేసు ప్రభువు మాటలకు లోబడి అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. సాతాను ఒకప్పుడు దేవునితో ఉన్నాడు. వాడిని మన సొంత జ్ఞానముతో ఎదిరించటానికి లేక పోరాడటానికి ప్రయత్నించకూడదు. ఓడిపోతాము. సాతానుని ఎదిరించడానికి దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. దుష్టకాలములో ఉన్నాము కనుక ఎప్పుడు ఏమి సంభవిస్తుందో, ఎటువైపు నుంచి వస్తుందో ఏ రూపములో వస్తుందో? చిన్న రోదనలా, పెద్దపెద్ద రోదనలా ఏమీ తెలియదు. నాకు వచ్చే శోధన వేరు. నీకు వచ్చే శోధన వేరు. ఒక్కొక్కసారి ఈ శోధన చాలా ఫ్రెండ్లీగా సరదా సరదాగా ఉంటుంది. చివరకు కొంప ముంచుతుంది. సాతానుకు మనకు మధ్య ఉన్న పోరాటం ముఖాముఖి కాదు. మోసపూరిత పోరాటమిది. ముఖ్యంగా మన సొంత వారితోనే పోరాడేటట్లు సాతానుడు ప్రేరేపిస్తాడు. సొంత వాళ్ల చేతనే మోసాలు చేయిస్తాడు. ఇక మోసపోయిన వారు ఊరకుంటారా? పోరాటం మొదలౌతుంది. ఇది జీవితకాలం పట్టవచ్చు సరిచేయడానికి. ఇటువంటి సమయాల్లో దేవుని వైపు చూడాలి. ఆయన సలహాలు పాటించాలి.
* సర్వాంగ కవచము: నడుమునకు సత్యమనే దట్టి కట్టుకోవాలి. దేవుని వాక్యమే సత్యము. ప్రభువు చెప్పినట్లు నేనే మార్గము సత్యము జీవమని. ఆయనే సత్యము. ఆయన మాటలు సత్యము. సత్యమైన వాక్యమందు నిలిచిన వారైతే ప్రభువుకు శిష్యులమవుతాము. సత్యమేమిటో గ్రహించగలం. అప్పుడు సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగవలెను. అసత్యముతో ఉన్నప్పుడు ఎన్ని బంధకాలో. స్వాతంత్య్రం కోల్పోతాం. అదే సత్యముగా ఉన్నప్పుడు ఎంత స్వేచ్ఛగా ఉంటుందో మనకు తెలుసు. సాతాను శక్తి నుండి తప్పించుకుని ఎదిరి నిలువగలము.
* నీతి అనే మైమరుపు (ఱూళ్ఘఒఆఔ్ఘఆళ యచి జదఆళ్యఖఒశళఒఒ) తొఢుగుకోవాలి. నీతియు యదార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అవినీతితో పోరాడాలంటే నీతి కలిగి ఉండాలి. అంటే మన నీతి సరిపోదు. మానవుని నీతి దేవుని ముందు మురికిగుడ్డ లాంటిది. దీనిని బట్టి నీతి లేనట్టే. నీతి లేకుండా పోరాటం ఎవరితో. అది కేవలం దేవునికి వ్యతిరేకమే అవుతుంది. కాబట్టి క్రీస్తు నీతిని ధరించుకోవాలి. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవుని యందు విశ్వాసము వలననే, ఆయన ఆజ్ఞలు విని పాటించడం ద్వారా మనము నీతిమంతులము కాగలము. అబ్రహాము దేవుని నమ్మెను. అదే అతనికి నీతి అయింది. విశ్వాసము వలన వచ్చే నీతిని కలిగి ఉంటేనే సాతానును ఎదిరించగలము.
కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే, క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. - రోమా 3:24
* పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సను జోడు తొడుగుకొని నిలువబడుడి. యేసే మనకు సమాధానము. యేసును ధరించుకొన్న మనము సమాధానము కలిగి ఎక్కడకు వెళ్లినా ఎక్కడ ఉన్నా సమాధానాన్ని విడువకూడదు. మన సమాధానము క్రీస్తే. సువార్త క్రీస్తే. సమాధానము పొందుకున్న వారు క్రీస్తును కలిగినటువంటి వారు మాత్రమే ఈ పోరాటములో నిలువబడగలరు.
* విశ్వాసమను డాలు: సాతానుడు వేసే బాణాలు ఆర్పటానికి మనకు విశ్వాసమనే డాలు ఉండాలి. (డ్దజళజూ యచి ఘజఆ్ద) ఎన్నో శోధనలు. భయపెట్టే ఆలోచనలు. పాపంలో పడిపోయే ఆశలు. కోరికలు పుట్టించి మనలను ఏదో విధంగా ఓడించి పాపములో పడగొట్టుతాడు. విశ్వాసమందు స్థిరంగా ఉంటేనే మనము ఈ పోరాటములో నిలువగలము. విశ్వాసము సన్నగిల్లినా కోల్పోయినా అపాయమే. మన దేవుడు ఎంత శక్తి కలవాడో, ఎంత జ్ఞానవంతుడో ఎంత సంపన్నుడో అన్నీ ఎరిగి ఉండాలి. ఎంత పరిశుద్ధుడో కూడా పూర్తిగా తెలిసి యుండాలి. విశ్వాస వీరుల సాక్ష్యాలు అనేకములు. వాటిలో కొన్నింటిని హెబ్రీయులకు వ్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయములో చాలా తేటగా చూడగలము.
* రక్షణయను శిరస్త్రాణము: నీతిని కవచముగా ధరించుకొనెను. రక్షణను శిరస్త్రాణంగా తలమీద ధరించుకొనెను - యెషయా 59:17
మనము పగటి వారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ యను శిరస్త్రాణములను ధరించుకొందము. - 1 థెస్స 5:8
రక్షణను గూర్చిన ఆలోచన మనసులో ఉండాలి. పాపము నుండి రక్షింపబడ్డామని గుర్తించాలి. క్రీస్తులో రక్షింపబడిన సంగతి మనము మరువకూడదు. ఆయనే మన అండ. కోట. కొండ. ఆశ్రయ దుర్గము. మనల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే సంగతి మరువకూడదు. మరణాన్ని గెల్చి లేచిన క్రీస్తు మన రక్షణ అని మరువక ఎల్లప్పుడు జ్ఞాపక ముంచుకోవాలి.
* దేవుని వాక్యమనే ఆత్మ ఖఢ్గమును ధరించుకొనుడి. ఆత్మఖడ్గము మనలను మనం రక్షించుకోవటానికి, శత్రువులను సంహరించటానికి ఉపయోగపడుతుంది. యేసు ప్రభువు మానవునిగా ఉన్నప్పుడు వాక్య ఖడ్గముతో సాతానును ఓడించుట మనకు ఒక మాదిరి. మనము కూడా క్రీస్తు మాటల యందు విశ్వాసముతో శత్రువును ఓడించవచ్చు. శ్రమలలో శోధనలలో వాక్య ఖడ్గమును ఎలా ఉపయోగించాలో తెలిసికొని వ్యవహరించాలి. కాబట్టి బైబిల్‌లో ఉన్న మాటలన్నిటిని నమ్మాలి. చదవాలి. గ్రహించాలి. పాటించాలి. అప్పుడే వాక్యము మనలను సాతానుని బలము నుండి కాపాడుతుంది.
ఈ పోరాటములో నీలోఉన్న దేవుని శక్తి నీకు తెలియాలి. మరణాన్ని గెలిచాడు. సాతానును ఓడించాడు అన్న సంగతి నీకు స్పష్టంగా అర్థమవ్వాలి. దేవుని చేతిలో ఓడిపోయిన సాతాను మాయోపాయము చేత మనలను మోసపరచనీయకుండా చూసుకోవాలి. సర్వాంగ కవచము తలకు ఉంది. నడుముకు ఉంది. చేతికి ఉంది. కాళ్లకు కూడా ఉంది. కానీ, మన వీపునకు కవచము లేదు గనుక ఎట్టి పరిస్థితులలో వెనుకకు తిరుగకూడదు. ఓడిపోతాము. ఓడిపోయి సాతానుని చేతిలో ఓడిపోకుండా ఈ పోరాటంలో నిలిచి గెలిచి దేవుని మహిమ పరచటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయును గాక. దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక.

-మద్దు పీటర్ 9490651256