ప్రార్థన

క్రీస్తు ఆధిపత్యము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఈయన ఎట్టివాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవ’ని చెప్పుకొనిరి. -మత్తయి 8:27. సముద్రము మీద తుఫాను లేచినప్పుడు శిష్యులు ఉన్న దోనె అలల చేత కప్పబడినప్పుడు శిష్యులు భయభ్రాంతులై రక్షించమని ప్రభువును అడిగినప్పుడు యేసు గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మళమాయెను. గాలి సముద్రము భూమి ఆకాశము సూర్యచంద్రులు చెట్లు పక్షులు జంతువులు మాత్రమే కాదు సర్వసృష్టి ఆయన మాట వింటున్నాయి. చివరకు దయ్యాలు యేసు ప్రభువుకు లోబడుచున్నవి. కొంతమందికి యేసును గూర్చి, ఆయన ఆధిపత్యమును గూర్చి అవగాహన లేదు గాని దయ్యాలకు తెలుసు.
‘అపవిత్రాత్మ పట్టిన వాడు - నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియును. నీవు దేవుని పరిశుద్ధుడవ’ని కేకలు వేసెను. అందుకు యేసు - ఊరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను. ఈయన అధికారముతో అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి. -మార్కు 1:24-27.
మార్కు సువార్త 5వ అధ్యాయములో ప్రభువుకు ఉన్న ఆధిపత్యము చూడగలము. గెరాసేనుల దేశములో అపవిత్రాత్మ పట్టిన వాడొకడు తన్ను తాను రాళ్లతో గాయపరచుకుంటూ సమాధులలోనే ఉండేవాడు. సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. వాని సాదుపరచలేక పోయెను. వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తికొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి యేసూ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని కేకలు వేసెను. ప్రభువు -ఈ మనుష్యుని విడిచిపొమ్మని అపవిత్రాత్మతో చెప్పగా ‘సేనా’ ఆ మనుషుని విడిచిపోయెను.
కొన్నిసార్లు అపవిత్రాత్మలు మనుషులను రోగములతో వ్యాధులతో కూడా బాధింపవచ్చును. యోబును అరికాలు నుండి నడినెత్తి వరకు సాతానుడు బాధగల కురుపులతో మొత్తెను. నానా విధములైన రోగములచేత పీడింపబడిన అనేకులను యేసు స్వస్థపరచెను. కుష్ఠురోగులను పక్షవాయువు గలవారిని ఊచచెయ్యి గలవారిని రక్తస్రావముగల స్ర్తిని గుడ్డివారిని కుంటివారిని దీర్ఘవ్యాధులు గలవారిని ఎందరినో యేసు స్వస్థపరచెను. విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చిన వారందరూ స్వస్థత నొందారు. ప్రభువు ఎవరెవరి దగ్గరకు వెళ్లారో వారిలో నుండి అపవిత్రాత్మలు వారిని విడిచిపోయాయి. ప్రభువు మాటకు సర్వసృష్టి లోబడుతోంది. చివరకు దయ్యాలు ఆయన మాటకు లోబడుచున్నవి. అయితే మనిషి మాత్రం ప్రభువు మాటకు లోబడుట లేదు. చాలామందికి ప్రభువు కావాలి. ఆయనకు లోబడుటలేదు. ఆజ్ఞలు పాటించరు. దీనిని బట్టి ప్రభువుకు లోబడే అపవిత్రాత్మల కంటె అవిధేయులైన వారు ఎంత కఠినులో చూడండి. ఇందుకేనా ప్రభువు రక్తం ధారపోసింది.
ఈ మధ్యకాలంలో అపవిత్రాత్మలు మనుషులలో ఎక్కువగా ఉండటం లేదు. కాని అనేక రకాలుగా ప్రేరేపిస్తున్నాయి. కాలేజీకి వెళ్లినవారిని ప్రేరేపించి సినిమాలకూ, ఆఫీసులకు వెళ్లేవారిని షికార్లకు, చక్కగా వారి పనులు చేసుకొనేవారిని ప్రేరేపించి అనేక రకాలుగా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. వార్తలు వినండి అంటూ టీవీ ఆన్ చేయించి వార్తల నుండి చిన్నగా సీరియల్స్‌కు, తరువాత సినిమాకు అలవాటు చేస్తూ చివరకు దినమంతా వృధాగా గడిచిపోయేట్టు చేస్తుంది. అలాగే -నిజానికి మొబైల్ ఫోన్ ఒకరితోనొకరు పలుకరించుకోటానికి, సమాచారాన్ని అందించటానికి ఉపయోగం. అయితే ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్ అని ఒకదానిలో నుండి మరొక దానికి వెళ్తూ రాత్రంతా గడిచిపోతుంది. సాతాను ప్రేరేపణలకు మెల్లమెల్లగా అలవాటై చివరకు అపవిత్రాత్మల గ్రిప్‌లోనికి వెళ్లినవారు హత్యలు, మానభంగాలు, దొంగతనాలకు అలవాటు పడుతున్నారు. చివరకు ఉగ్రరూపం దాల్చి అశాంతిని సృష్టిస్తున్నారు. లోకంలో శాంతి సమాధానాలు లేవు. భద్రత లేదు. ఎటు చూసినా గందరగోళం. తాగుడు, జూదం, వ్యభిచారం, డ్రగ్స్ లాంటి వాటికి బానిసలై మానసికంగా స్థిరత్వం లేకుండా పోయింది. వినగూడనివి వినటానికి, చూడగూడనివి చూడటానికి, వెళ్లగూడని స్థలాలకు వెళ్లటానికి ఇంకా అపవిత్రాత్మలు ప్రేరేపిస్తూనే ఉన్నాయి. అక్రమానికి అపవిత్రతకు మనుషులను బానిసలుగా మారుస్తున్నాయి. అవిధేయులు తమ హృదయ కాఠిన్యం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపడి అపవిత్రతను అత్యాసక్తితో జరిగించుటకు కాముకత్వమునకు అప్పగించుకొంటూ నశించిపోతున్నారు. నిజానికి మనుషులు మంచివారే. మంచి పనులే చేయాలని ఆశ ఉంది. కాని అపవిత్రాత్మ ప్రేరేపణ వల్ల అక్రమముగా నడుస్తున్నారు. పోయిన శాంతి సమాధానములు పొందుకొని క్రమమైన జీవితం జీవించటానికి దేవుని వాక్యము సెలవిస్తున్న మాట - యాకోబు 4:8 - మీరు దేవుని యొద్దకు రండి. అప్పుడాయన మీ యొద్దకు వచ్చును. ఆయన అధికారమునకు లోబడి యుండుడి, మృత్యుంజయుడైన ప్రభువు పునరుత్థాన బలముతో మనలను నింపును. ఆ బలముతో మనలను నానా విధములుగ ప్రేరేపించుచున్న అపవిత్రాత్మలను ఎదిరించి నిలువగలము. అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోవును. మన ఇంట్లో నెమ్మది, సమాధానము కలుగుతుంది. ప్రభువుకు లోబడి ఆయన శక్తిని పొందుకుని జీవిస్తూ సాతాను బంధకములలో ఉన్నవారిని విడిపించుటకు శక్తిమంతులమగునట్లు ప్రభువు సార్వభౌమత్వానికి లోబడి ఉండుము. కృప తోడై నడిపించునుగాక.

-మద్దు పీటర్ 9490651256