ప్రార్థన

నీ రాజ్యము వచ్చును గాక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక.’ -మత్తయి 6:10
పరలోక రాజ్యము సమీపించి యున్నది గనుక మారుమనస్సు పొందుడని యేసు ప్రభువు ప్రకటింప మొదలుపెట్టెను. ఈ లోక పరిస్థితులు అస్తవ్యస్థముగా అవినీతితో దుర్నీతితో దుష్కార్యములతో చీకటి కార్యాలతో నిండిపోయి, శత్రు భయమూ, ఎటు నుంచి ఏ ప్రమాదముంటుందో, దొంగల భయము, దుండగుల భయము, కపట జనుల వలన భయము, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అన్న భయాందోళనతో నిండియున్నది. అన్నీ ఉంటున్నాయి. కానీ తృప్తి ఉండటం లేదు. సమాధానమూ సంతోషమూ ఉండుట లేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో నీతి న్యాయము సమాధానము సంతోషము కావాలని మనిషి ఆరాటం, హృదయములో ఒక విధమైన మూలుగు ఉంది. మనకు సమాధానాన్ని ఇవ్వటానికే ప్రభువు నరావతారునిగా ఈ లోకానికి వచ్చాడు. పరలోకపు రాజు తన్నుతాను తగ్గించుకొని మన మధ్యకు వచ్చి ముందు మనలో ఆయన రాజ్యాన్ని స్థాపింప చూచుచున్నాడు.
అయితే ఈ లోక అలవాట్లకు ఆచారాలకు పద్ధతులకు అలవాటు పడిన మనము ముందు చేయవలసినది మనస్సు మార్చుకొనుటయే. అవినీతి మానివేయాలి. స్వనీతిని విడిచి పెట్టాలి. దుష్కార్యాలు ఆపివేయాలి. ఇవన్నీ సహజంగా చేస్తున్నాం అది తప్పు కాదు అన్నట్టు ఉన్నారు. కాబట్టి పాప స్వభావముతో చేస్తున్న ఆ మనస్సును మార్చుకొని ప్రభువు వైపు తిరగాలి. 1 యోహాను 5:19 ప్రకారము లోకమంతయు దుష్టుని యందున్నది. ఎంతో సుందరమైన ఏదేను వనములో దేవుని పోలికతో చేయబడి దేవునితో నిత్యము సహవాసము కలిగి శాంతి సమాధానాలతో ఉండే మన ఆది ఆదాము హవ్వలు చిన్న పొరపాటు చిన్న అతిక్రమము వల్ల, చిన్న ఆశ వల్ల, చిన్న పండు వల్ల పాపములో పడిపోయి పాపానికి దాసులయ్యారు. అది లోకమంతటికీ సంక్రమించింది. మనము సంపాదించే ఆస్తిపాస్తులు మంచి చెడ్డలు మన పిల్లలకు ఎలా సంక్రమిస్తాయో అలానే తరాలుగా పాపము సంక్రమిస్తూనే ఉంది. మనము పాలించవలసిన ఈ లోకాన్ని దుష్టుడు పాలిస్తున్నాడు. కనుకనే మంచి చేయాలనే ఆశ ఉంది కానీ చేయలేక పోతున్నాము. చెడు చేయకూడదని తెలుసు కానీ చేయకుండా ఉండలేక పోతున్నాము. తప్పు తప్పేనని తెలుసు. అవినీతి తెలుసు. దుష్టత్వము తెలుసు. దుర్మార్గము తెలుసు కానీ బయటకు రాలేక పోతున్నాము. అటువంటి సమయములో ప్రభువు మనకు నేర్పిన ప్రార్థన - తండ్రి నీ రాజ్యము వచ్చును గాక అని. దేవుని రాజ్యము నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై యున్నది.
అసలు దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు. అయితే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అనేది మనిషి ఆలోచన అంతా! ప్రభువు సెలవిస్తున్న మాట ఏమంటే - ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి. ఆహారము కంటె ప్రాణము వస్తమ్రుకంటె దేహము గొప్పవి కావా? -మత్తయి 6:25. ఇవన్నియు మనకు అవసరమని ప్రభువుకు తెలియును కనుక ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకాలి. మన పరలోకపు తండ్రి, పరమ తండ్రి గనుక మనకు అన్నియు సమకూరుస్తాడు. వీటి విషయము చింత లేకుండా ఉంటే లోకములో చాలావరకు సమస్యలు తగ్గిపోతాయి. వాస్తవానికి దేవుడు సమస్తము సమృద్ధిగా చేశాడు. లోకములో ఎవరూ పస్తులుండవలసిన అవసరము లేదు. దేవుడిచ్చిన ఈ నేల పండించే పంట అందరికీ సమృద్ధిగా సరిపోతుంది. లోకములో ఎవరూ దిగంబరులుగా ఉండవలసిన అవసరము లేదు. ఎవరూ దారిద్య్ర స్థితిలో ఉండవలసిన అవసరం లేదు. అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి. సమానంగా వాడుకోలేక పోతున్నాము. ఆయన రాజ్యములో ముఖ్య సూత్రము నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమని. ఆయన ఆజ్ఞ పాటిస్తే ఒక్కసారి ఎంత సమృద్ధిగా ఉంటుందో చూడండి. ఎవరికీ ఏ కొదువా ఉండదు. అయితే స్వార్థము వల్ల, ధనాశవల్ల, ఒకరికి సమృద్ధి, ఒకరు కడుపేదగా ఉంటున్నాడు. ఎక్కడికో వెళ్లవలసిన పని లేదు. మన పొరుగు వాని ప్రేమించగలిగితే చాలు. అలా లోకమంతా ఉంటే లోకములో ఏ కొదువా ఉండదు. గళషళఒఒజ్యశ అనే మాట వినపడదు. లోకములో ఉన్న డబ్బు ఎక్కడికీ పోలేదు. కానీ మేనేజ్‌మెంట్ సరిగ్గా లేక, ఉన్నదానితో తృప్తిలేక, అప్పులు చేసిచేసి డబ్బు విలువ పడిపోతోంది. దేవుడిచ్చిన దానితో తృప్తిగా ఉండగలగాలి.
పరలోక రాజ్యము సమీపించి యున్నది, అది మన మధ్యనే ఉన్నది. కానీ దానిలో ప్రవేశించాలంటే ముందు ఆయన మాటలు మనము వినాలి. ఆయన నిబంధనలు పాటించాలి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే ప్రవేశించును. -మత్తయి 7:21.
ఆయన రాజ్యములోనికి ప్రవేశించాలంటే, మీరు మార్పునొంది బిడ్డల వంటి వారవ్వాలి. చిన్న పిల్లలు తండ్రి మాట ఎలా వింటారో, ఏది చేయమంటే అది ఎలా చేస్తారో ఎక్కడకు వెళ్లమంటే అక్కడకు వెళ్తారో.. అలా చేయాలి. ఇక్కడ మనకు ఇస్సాకు మాదిరి. మారుమాట్లాడకుండా తండ్రి మాట విని ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధపడ్డాడు.
ఆయన రాజ్యములోనికి రావాలంటే ముందు ఆయన రాజ్య సంబంధమైన మాటలు, నిబంధనలు మన హృదయములోనికి రావాలి. వాటి ప్రకారము మనము నడుచుకోవాలి. లేకపోతే చిన్నపిల్లల దగ్గర నుండే తిరుగుబాటుతనం మొదలవుతుంది. కారణం - అల్లరి రాజు మన హృదయాన్ని ఏలుతూంటాడు. వాడు మనలో ఉంటే ముందు మనలో ఉన్న సమాధానము ఎగిరిపోతుంది. నెమ్మది ఉండదు. తృప్తి ఉండదు. ఏదో కావాలన్న ఆరాటం, ఏదో పొందుకోవాలన్న తపన ఉంటుంది. అన్నీ ఉన్నాగానీ ఈ ఆరాటము తపన ఆగదు. ఈ గజిబిజి మనస్తత్వంతో ఒకరినొకరు హింసించుకోవటం, చంపుకోవటం, దూషించుకోవటం, అవమానపరచుకోవటం, హేళన చేయటం జరుగుతుంది. కనుక హృదయములో నెమ్మది సమాధానముండదు.
అయితే ఇంత గజిబిజి లోకములో ఉన్నా, దేవుని మాటలు మనలో ఉంటే, మన హృదయమును ఏలుచుంటే లోకము మనలను వెలివేసినా హింసించినా దూషించినా, అవమానపరచిన గాని మనలో ఉన్న ప్రేమ మారదు. మనలో ఉన్న నెమ్మది చెదరదు. సమాధానము మారదు. దేవుని మాటలను హృదయమున ఉంచుకొనిన పౌలు సీలలు కొట్టబడి, చెరసాలలో వేసినను.. హృదయములో నెమ్మది సమాధానముతో ఉండి, పాటలు పాడుచూ దేవుని స్తుతించుచున్నారు. దేవుడు అద్భుతముగా వారిని విడిపించటం చూస్తున్నాము.
ప్రభువు మాటలు మనలో ఉంటే, ఆయన రాజ్యము మనలో ఉన్నట్లే. ఆయన మనలో ఉంటే, ఇంక కొదువేమీ ఉండదు. ఆశీర్వాదము ఆరోగ్యము ఉంటుంది. కాపుదల ఉంటుంది. భద్రత ఉంటుంది. ఆయన మాటలు మనం వింటే, ఆయన మనకు కోట, దుర్గము. ఆయనే మన కాపరిగా ఉంటాడు. పచ్చికగల చోట పరుండజేసి శాంతికరమైన జలముల యొద్ద సేదదీర్చి, బ్రతుకు దినములన్నియు కృపా వరములే మన వెంట వచ్చేటట్లు చేస్తాడు. ఆయన మాటలే మన చుట్టూ కోట. ఆ కోటలో ఉంటే, ఆయన మాటల ప్రకారము నడుస్తూ ఉంటే ఇక కాపాడేది రక్షించేది యేసే. పోషించేది, ప్రతి దినము ఏది కావాలో వాటిని సమకూర్చేది యేసే. మనతో యుద్ధానికి వచ్చే శత్రువుతో పోరాడేది యేసే. యుద్ధము ఆయనదే. మనది కాదు. ఈ కోటలో నీకు ఎటువంటి కొదువ ఉండదు. లేమి ఉండదు. సమస్తము సమకూడుతాయి. విశ్వాసముతో ముందుకు సాగాలి.
కోట మీద నుండి అప్పుడప్పుడు సరదాగా లోకాన్ని చూద్దామనుకొని బయటకు వస్తే నేత్రాశ లాగి బయటపడవేయవచ్చు. లోకాశలకు పోకూడదు. సాతానుడు పొంచి ఉంటాడు. కాపరి కాపుదలలోనే ఉండాలి. ఆయన చెప్పినట్టే చేయాలి. ఉండమన్న దగ్గరే ఉండాలి. కొంచెం కుడికి గానీ ఎడమకు గానీ జరిగితే సాతాను లాగేసుకుంటాడు.
దావీదు అలా కోట మీద నుండి స్నానము చేయుచున్న ఒక స్ర్తిని చూచి, ఆమెతో శయనించి, గర్భవతి అయినదని తెలుసుకొని, ఆమె భర్తకు తెలియకుండా ఉండాలని అతనిని చంపి, హంతకుడయ్యాడు. వ్యభిచారి అయ్యాడు. ద్రోహిగా, అక్రమదారుడుగా, అపవిత్రుడుగా, కనికరము లేనివాడుగా, చివరకు మరణానికి పాత్రుడయ్యాడు. సమస్తము చూస్తూ ఉన్న దేవుడు నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరించినప్పుడు తన తప్పును తెలుసుకొని తిరిగి దేవుని కాపుదలలోనికి వచ్చి ఆశీర్వాదము పొందుకున్నాడు. పొరుగు వానిది ఏదీ ఆశించవద్దని ప్రభువు చెప్పిన మాటకు లోబడకపోతే, పొరుగు వాని భార్యను ఆశిస్తే మరణానికి పాత్రులౌతారు. ఈ నేరాలు అన్నీ నీ మీద పడతాయి.
తప్పు తెలుసుకొని తిరిగి కోటలోనికి ప్రవేశించటానికి చక్కటి మార్గముంది. ఆ మార్గము క్రీస్తే. ఆయన మాటలే మనకు మెట్లు. ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ పరలోక రాజ్యానికి వారసులమవ్వవచ్చు.
ఇంతవరకు దేవుని రాజ్యపు సమాధానము పొందుకోలేదా? ఒక్కసారి ఈ రాజ్యపు నిబంధన పాటించి చూడు. తద్వారా వచ్చే నెమ్మది సమాధానము సంతోషము పొందుకో. చిరకాలము యెహోవా సన్నిధిలో నివసించు.
తప్పు తెలిసి తిరిగి ప్రభువు దగ్గరకు వచ్చిన దావీదును దేవుడు క్షమించాడు. తిరిగి తన కుమారునిగా చేర్చుకున్నాడు.
తండ్రి దగ్గర హాయిగా సుఖ సంతోషాలతో ఉన్న చిన్నకొడుకు, బయట ఇంకా ఎక్కువ సంతోషముంటుందనుకొని తన ఆస్తిని తీసికొని బయటకు వెళ్లి తన ఇష్టానుసారముగా జీవించి, సొమ్ము అంతా వేశ్యలకు స్నేహితులకు ఖర్చుపెట్టి ఉన్నదంతా పోగొట్టుకొని పందులు మేపే పని చేస్తూ పందులు తినే పొట్టు కూడా తినే యోగం లేక బాధపడుతున్నప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు. అక్కడ సేవకులే హాయిగా ఏ కొదువా లేకుండా ఉన్నారు గదా అని బుద్ధి వచ్చి, తండ్రి యొద్దకు తిరిగి వచ్చి పశ్చాత్తాప పడినప్పుడు, మనసు మారినపుడు, తండ్రి ఆ కుమారుని చేర్చుకొని ప్రశస్త వస్తమ్రులిచ్చి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగి సంతోషించాడు. ప్రేమ విందు చేశాడు. పరలోక రాజ్యపు నిబంధన - ‘తల్లినీ తండ్రినీ సన్మానించు’మన్న మాట పాటిస్తే ఈ తిప్పలన్నీ తప్పేవి.
మన తండ్రి రాజ్యము ప్రేమ రాజ్యము. ప్రేమతో చేర్చుకుంటాడు. నీతి సమాధానము సంతోషము నిత్యము ఉండే ఆ రాజ్యము రావాలని కోరుకుందాము. ప్రార్థన చేద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయును గాక.

-మద్దు పీటర్ 9490651256