ప్రార్థన

యేసుక్రీస్తు సిలువ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యేసుక్రీస్తు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. కాని ప్రజల విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అపవాది యొక్క క్రియలను లోబరచుకొనుటకే ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. పాపానికి మొనగాడు అపవాది. అబద్ధాలకు జనకుడు అపవాది.
అపవాది మాయలో పడిన మానవుడు దేవునితో సంబంధము పోగొట్టుకొని పాపములో బ్రతుకుచున్నాడు. పరిశుద్ధమైన లోకములో పాపము మొలిచింది. అది పెరిగి పెరిగి లోకమంతా వ్యాపించింది.
ఎంతో ప్రేమతో దేవుడు మానవుని తన రూపులో చేసి, తన నివాసానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసి, ఉండటానికి తినటానికి కావలసిన మంచి తోటను వేసి అందులో అనేకమైన ఫలాలు ఉంచి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటియైన సహాయముగా హవ్వను తన ప్రక్కటెముక నుంచి చేసి, వారిని స్ర్తినిగాను పురుషునిగాను చేశాడు.
దేవుడు వారిని ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని పండించి దానిని లోబరచుకోమని ఆశీర్వదించాడు. అయితే వారికిచ్చిన చిన్న ఆజ్ఞ. ఆ ఏదేను తోటలో మధ్యన ఉన్న మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. వాటిని తింటే చనిపోతావని ఆజ్ఞాపించాడు. అయితే సాతానుడు హవ్వను మోసపు మాటలతో మభ్యపెట్టి ఆ పండు తింటే మీరు చావనే చావరు ఎందుకంటే మీరు వాటిని తింటే మీ కన్నులు తెరువబడి మంచి చెడ్డలను ఎరిగినవారై దేవతల వలె ఉంటారని చెప్పాడు.
ఇంకేముంది? హవ్వ మోసపోయి, ఆశగా పండు తిని, కొన్ని తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు. అవిధేయులయ్యారు. అంత పెద్ద తోటను, భూమిని ఏలుబడి చేస్తూ దేవునితో సహవాసము చేస్తూ హాయిగా సుఖముగా ఏ కష్టమూ లేకుండా సంతోషముగా ఉన్నటువంటి వారు శాపగ్రస్తులయ్యారు. ఆజ్ఞ అంతమిము పాపము, పాపమునకు జీతము మరణము. వారితో మొదలైన పాపము లోకమంతా వ్యాపించి, లోకము పాపముతో నిండిపోయి ఉంది.
ప్రేమలు లేవు. అనురాగాలు లేవు. ఆశలు ఎక్కువయ్యాయి. దురాశ గర్భము ధరించి పాపము కంటుంది. పాపము పరిపక్వమై మరణము కంటుంది. దేవునితో సహవాసము లేకపోవటమే ఈ మరణము. ఒకరిని ఒకరు ద్వేషించుకోవటం, హత్యలు, దొంగతనాలు, మోహాలు, త్రాగుడు, జూదం, వ్యభిచారము, అబద్ధాలు, కలహాలు, అసూయలు, భేదములు ఎక్కువై పోయాయి. ఎవరినీ నమ్మలేని పరిస్థితులు. సొంత వారిని నమ్మలేము. బైట వారిని నమ్మలేము. అంతా స్వార్థపూరిత జీవితాలై పోయాయి.
ఈ పాపములను తీసివేయుటకు యేసు ప్రభువు ప్రత్యక్షమయ్యాడు - 1 యోహాను 3:5
మరి రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు - హెబ్రీ 9:22
ఈ లోక పాపములను మోసికొని పోవుటకే ఒక గొఱ్ఱెవలె యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు గనుకనే తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపి ఆయన మీద మన పాపములను మోపి ఆయనను సిలువకు అప్పగించాడు.
సిలువ వేయటమెందుకు పాపాలు క్షమించవచ్చు కదా? క్షమించే దేవుడు కాదా? ప్రేమగల దేవుడు కాడా? ఈ సిలువెందుకు? ఈ ముళ్లకిరీటమెందుకు? చేతులలో కాళ్లల్లో సీలలెందుకు? క్షమిస్తే అయిపోయేది కదా? అనే ప్రశ్న సాధారణంగా అందరికీ వచ్చేది.
అయితే ఒక సంగతి. పాపాలకు జీతము మరణము - రోమా 6:23
ఇది ఆత్మీయ మరణం.
ఒక మనుషుని (ఆదాము) ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో ఆలాగుననే, మనుషులందరు పాపము చేసినందున మరణము సంప్రాప్తమాయెను. రోమా 5:12.
ఎందుకు ఇంత చిన్న పాపానికి అంత పెద్ద శిక్ష అంటే? పాపముంటే దేవునితో వైరమే. అది విరుద్ధము. అవిధేయత వల్ల దేవుని వ్యతిరేకించుట ఎంత పెద్ద పాపమో కదా?!
నేరాన్నిబట్టి శిక్ష వేస్తుంటారు. అది ఎవరిలో నేరమో దానినిబట్టి ఉంటుంది. మామూలు సగటు మనిషితో అయితే సాధారణ శిక్ష. అదే ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించినదైతే ఇంకా కొంచెము శిక్ష పెరుగుతుంది. అదే ఇంకా పెద్దవారు మంత్రులు లాంటి వారైతే ఇంకా పెద్ద శిక్ష ఉంటుంది. ఇక్కడ దేవుని వ్యతిరేకముగా చేసిన నేరము కాబట్టి శిక్ష మరణము. శిక్ష వేసింది దేవుడు. కాబట్టి ఈ తీర్పు జరగాల్సి ఉంది. అయితే దేవుడు ఎంత న్యాయముగల దేవుడు. అంత ప్రేమ కలిగినవాడు కూడా. ఎందుకంటే దేవుడు ప్రేమా స్వరూపి. ప్రేమ కలిగిన వారే ఆయనను చూడగలరు.
ఆయన మన దోషములన్నిటిని క్షమించువాడు. తండ్రి కుమారుని యెడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరచి యున్నాడు.
మనము మరణించుట వలన దేవునికి సంతోషము లేదు. అయితే న్యాయము జరగాలి. గనుక తన అద్వితీయ కుమారుని మనకొరకు మానవునిగా ఈ లోకానికి పంపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. -యోహాను 3:16. లోకాన్ని రక్షించటానికే యేసు ప్రభువు వచ్చాడు. తీర్పు తీర్చటానికి కాదు.
వాస్తవానికి మనకు కూడా పాప జీవితము ఇష్టము లేదు. పాపము నుండి బయటపడాలని ఆశ కూడా ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. ఎంత పాపియైన ఏదో ఒకసారి పాప జీవితము వద్దు అనుకుంటాడు. ఐతే దీని నుండి బయటకు మనంతట మనము రాలేము. అట్లని జంతు బల్లులు, దానధర్మాలు చేస్తే అవుతుందా అంటే అదీ కాదు. మానవుని తప్పునకు మానవుడే శిక్షింపబడాలి.
అయితే ఆ శిక్ష క్రీస్తు మీద వేసి మనలను విమోచించాలని తండ్రియైన దేవుడు ఇష్టపడ్డాడు. క్రీస్తును నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను -యెషయా 53:10.
మనమింక పాపులమై యుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను - రోమా 5:8
మనమింక శత్రువులమై యుండగా, యేసు ప్రభువు మరణము ద్వారా మనము దేవునితో సమాధానపడిన యెడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము - రోమా 5:10.
మన మాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను - 2 కొరింథీ 5:21
రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు -హెబ్రీ 9:22
రక్తము చిందించటమంటే ఏదో - చేతిని కోసుకోవటం వ్రేలిని కోసుకోవటం కొంచెము రక్తము కార్చటము కాదు. అలా అయితే ప్రభువు మరణించేవాడు కానే కాదు. ఏదో ఒకచోట ఇంత గాయము పెట్టుకొని కొంచెము రక్తము చిందిస్తే సరిపోయేది. కానీ పాపాలకు జీతము మరణము గనుక, ప్రాణము రక్తములో ఉంది కనుక, రక్తము ధారపోయుట అంటే ప్రాణాన్ని ధారపోయటమే.
యేసుక్రీస్తు ఏ పాపమెరుగడు. పాపమెరుగని పావనమూర్తిని ఒక నేరస్థునిగా చేసి, ప్రజలందరి ఎదుట యెరూషలేము వీధులలో నడిపించి ఆరుసార్లు తీర్పు తీర్చారు. అది రాత్రి సమయములో. రాత్రిళ్లలో అస్సలు తీర్పు జరగదు. అయితే ప్రభువును దోషిగా నిలబెట్టి, తీర్పు తీర్చారు. కానీ మరణమునకు తగిన కారణమేమీ ఈయనలో కనపడుట లేదని తీర్పు ఇచ్చారు. అంతేకాదు - సిలువలో వ్రేలాడుచున్న రెండవ దొంగ -ఈయన ఏ తప్పిదమూ చేయలేదు. మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నామని చెప్పాడు.
వాస్తవానికి రోమీయులకు అంటే సైనికులకు అసలు సంగతి తెలియక ఆ దొంగలతో పాటు సిలువ వేయాలి అంటే ఈయన కూడా పెద్ద దొంగనేనని చాలా క్రూరంగా విచక్షణా రహితంగా ఆయనను కొట్టారు. అంత పెద్ద కొయ్యను వీపు మీద వేసి మోయించారు.
* * *
ప్రభురాత్రి భోజనము - పరిశుద్ధ సంస్కారాన్ని యేసు ప్రభువు ఆచరిస్తూ - యేసు ఒక రొట్టెను తీసుకొని దాని నాశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి. ఇది నా శరీరమని చెప్పెను. మరియు గినె్న పట్టుకొని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి వారికిచ్చి - దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అని చెప్పెను. ప్రభువు మరణాన్ని జ్ఞాపకము చేసికొనటానికి ఈ పరిశుద్ధ సంస్కారము మొదలుపెట్టారు.
గెత్సెమనే తోటలో ప్రార్థన
శిష్యులను గెత్సెమనే తోటకు తీసుకువెళ్లి వారిని ఒక స్థలములో ఉంచి, ముగ్గురు శిష్యులు - పేతురు, యోహాను, యాకోబులను ప్రత్యేకముగా కొంత దూరములో ఉంచి మెలకువగా ఉండి ప్రార్థించమని, అక్కడ నుండి కొంత దూరము వెళ్లి సాగిలపడి ‘నా తండ్రీ! సాధ్యమైతే ఈ గినె్న నా యొద్ద నుండి తొలగిపోనిమ్మ’ని ముమ్మారు ప్రార్థించాడు. అయినా నీ చిత్తమే కానిమ్మని వేడుకొన్నాడు.
* * *
అంతలో పండ్రెండు శిష్యులలో ఒకడైన యూదా రానే వచ్చి పథకం ప్రకారము ప్రభువుకు శుభమని చెప్పి ముద్దు పెట్టెను. యేసు ‘చెలికాడా! నీవు చేయవచ్చినది చేయుమ’ని చెప్పెను.
* * *
తరువాత ఆరుసార్లు విచారణ జరిపి ‘ఇతనియందు ఏ నేరము కనబడుట లేద’ని చెప్పెను. అసలు ప్రభువుకు చేసిన విచారణ తప్పు. ముందు శిక్ష విధించి తరువాత తీర్పు తీర్చుట. అబద్ధ సాక్షులతో సాక్ష్యాలు. అసలు రాత్రులు విచారణ జరుపరాదు. కానీ ప్రభువుకు రాత్రి యందే విచారణ చేశారు. వివరించే అవకాశమివ్వలేదు. న్యాయ స్థానమునకు బయట ప్రధాన యాజకుని ఇంట నుండి చెల్లని తీర్పు ఇచ్చారు.
* * *
‘యేసుకు బదులుగా ప్రజలు బరబ్బాను విడుదల చేయమని’ కోరారు. మరి క్రీస్తును ఏమి చేయాలి అని అడిగినప్పుడు వారు సిలువ వేయమని కేకలు వేయటంతో ‘ఇతడు ఏ దుష్కార్యము చేసె’నని వారిని అడుగగా, ‘సిలువ వేయమ’ని మరి ఎక్కువగా కేకలు వేయటంతో.. పిలాతు జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తము గూర్చి నేను నిరపరాధిని. మీరే చూచుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలు ‘వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక’ అన్నారు.
అప్పుడు పిలాతు ప్రజలు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. ఎంత గ్రుడ్డితనమో చూడండి. పేరు మోసిన దొంగను విడుదల చేసి - రక్షించటానికి వచ్చిన ప్రభువును సిలువ వేయమంటున్నారు.
* * *
ఉదయము 9 గంటల సమయములో యేసును సిలువ వేశారు. సాయంకాలము 3 గంటల సమయములో గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రీ! నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఆ సమయములో మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతట చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యమాయెను. గర్భాలయపు తెర నడిమికి చిరిగెను. దేవాలయపు తెర పై నుండి క్రిందికి రెండుగా చిరిగెను.
శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమ పరచెను.
సహోదరులారా! యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు, జీవము గలదియు, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి యున్నది.
క్రీస్తు మార్గము జీవము గలది - జీవ మార్గము
ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము మధ్య తెర ఉండేది. అయితే ఈ అడ్డు తెర ఇప్పుడు పై నుండి క్రింది వరకు రెండుగా చిరిగినది గనుక పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశము ఏర్పడింది. క్రీస్తు శరీరము అను తెర ద్వారా ఇప్పుడు తండ్రి యొద్దకు మార్గము ఏర్పడుట వల్ల, తండ్రి కృపాసనము వద్దకు క్రీస్తు నామమున మనము ప్రవేశించ గలుగుతున్నాము.
* * *
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును. గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకను. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉండును.
సుళువైన కాడి - సుళువైన మార్గము
జీవ మార్గము
యేసు యొద్దకు రండి. విడుదల పొందండి. ఈ శుక్రవారము లోకమంతటికి మహా శుభ శుక్రవారము కావాలని గొప్ప ఆశ.

-మద్దు పీటర్ 9490651256