ప్రార్థన

పునరుత్థానము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీ స్తు మనకు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. అయితే వాటిని పెడచెవిన పెడుతున్నారేమో జాగ్రత్త! ఆయన మాటలు విని పాటించకపోతే సాతానుడు మనలను తన్నుకుపోతాడు. ఈ జీవితములో అజాగ్రత్తగా ఉండొద్దు. ఇష్టానుసారంగా జీవించకూడదు. ప్రభువే మార్గము. ఆ మార్గమే జీవ మార్గము. ఈ లోక మార్గము మరణ మార్గము. అది చివరకు నరకములోనికి పంపిస్తుంది.
జీవాధిపతియైన క్రీస్తు మాటలు విందాము. పాటిద్దాము. ప్రాణము పెట్టుటకు, తిరిగి తీసుకొనుటకు అధికారముగల దేవుడు యేసు ప్రభువు. ఎవడును ఆయన ప్రాణము తీయలేడు. కానీ ఆయన ఇష్టంగా మనలను మరణము నుండి తప్పించటానికే తన ప్రాణమర్పించాడు - ప్రాణదాత.
నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. -యోహాను 10:17.
మానవుల కోసం ప్రాణము పెట్టిన దేవుడు యేసు ప్రభువు. యేసు ప్రభువు తప్ప వేరొకరు లేరు. ఎంతోమంది చనిపోయారు. వారి సమాధులు ఇప్పటికీ ఉన్నాయి కానీ యేసు ప్రభువు సమాధి ఖాళీగా ఉంది. ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు.
ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనె మరియయు యాకోబు తల్లియైన మరియయు మరియు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు తెచ్చిరి.
వారు ఆదివారము పెందలకడ లేచి బయలుదేరి, సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము దగ్గర ఉన్న రాయిని ఎవరు పొర్లించుదురని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు కన్నులెత్తి చూడగా సమాధి దగ్గర రాయి పొర్లింపబడి యుండుట చూచిరి. ప్రభువు దూత పొర్లింపబడియున్న ఆ రాయి మీద కూర్చుండెను. అలసిపోయి కాదు గానీ, ఏదైతే ఈ స్ర్తిలకు సమస్య అనుకుంటున్నారో ఆ సమస్యను తొలగించి దాని మీద కూర్చోగలిగిన దేవుడు మన యేసు ప్రభువు. స్ర్తిలు ఆ దూతను చూచి భయపడగా - దూత వీరిని ‘్భయపడకుమ’ని చెప్పెను. ఆ రాతి సమాధికి కాపలా ఉన్న కావలివారు భయపడి వణకి చచ్చిన వారివలె ఉన్నారు. కానీ దూత ఆ స్ర్తిలకు మాత్రమే భయపడకుడి - మీరు యేసును వెదకుచున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పియున్నట్టే ఆయన లేచి ఉన్నాడు. రాయి పొర్లింపబడినది ప్రభువు బైటకు రావటానికి కాదు. మరణానే్న జయించిన వారికి రాయి అడ్డుకాదు గాని - వచ్చినవారు ఖాళీ సమాధిని చూడటానికి.
మరణానే్న భయపెట్టిన యేసు ప్రభువు బిడ్డలము దేనికీ భయపడకూడదు. మరణాన్ని గెలిచి లేచిన మరణపు ముల్లు విరిచిన యేసు ప్రభువుకు మాత్రము భయపడాలి. క్రీస్తును వెంబడించేవారు ఈ లోక భయానే్న భయపెట్టేవారు. చావైతే నాకు లాభమని పౌలు చెప్పినట్లు జీవించగలరు.
త్వరగా వెళ్లి, ఆయన మృతులలో నుండి లేచి యున్నాడని ఆయన శిష్యులకు చెప్పవలెను. ఈ పునరుత్థాన వార్తను త్వరగా తెలియజేయాలి. ఆలస్యము చేయకూడదు. ఈ సత్య సువార్త తెలియక అనేక మంది మరణించి నిత్య నరకము పాలౌతున్నారు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి అనుకున్నవారికి - చీకటి లోకము నుండి బయటకు రావాలనుకుంటున్న వారికీ మరణ భయముతో మగ్గిపోతున్న వారికీ ఇది శుభవార్త. క్రీస్తు మరణాన్ని గెలిచాడు.
మృతుల పునరుత్థానము ఉందని అనేకులకు తెలియదు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము మూడవ దినముల లేపబడెను - 1 కొరింథీ 15:3-4.
మృతుల పునరుత్థానము లేని యెడల క్రీస్తు కూడ లేపబడి యుండలేదు. క్రీస్తు లేపబడి యుండని యెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. మీ విశ్వాసము వ్యర్థమే. మీరు ఇంకా మీ పాపములలోనే ఉన్నట్లే. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించు వారమైన యెడల మనుషులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి యున్నాడు. మనుష్యుల ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుల ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదాము నందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో, అలాగుననే క్రీస్తునందు అందరు బ్రతికింపబడుదురు.
దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో నున్న వారందరు ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటకి వచ్చెదరు. -యోహాను 5:29.
ప్రతివాడు తన తన వరుసతోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు.
యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగను ప్రభావముతో నిరూపించబడెను - రోమా 1:5
అయితే మృతులేలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని యొకడు అడుగును. నీవు విత్తనవి చచ్చితేనే గాని బ్రతికింపబడదు గదా. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజయైనను సరే, మరియే గింజయైనను సరే. వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరమును ఇచ్చుచున్నాడు. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇదే మాట సిలువపైన ఉన్న దొంగ కూడా ఇంకొక విధముగా ఆలోచించాడు. పాప లోకములో ఉన్నాము గనుక పరిశుద్ధ లోకము కూడా ఉన్నట్లు గ్రహించి చివరి నిమిషములో చేసిన ప్రార్థన ప్రభువు ఆలకించి నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాననెను. అయితే రెండవ దొంగ చేసిన ప్రార్థన - ప్రభువా! నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికోమని. ఈ ప్రార్థన మనము చేసిన ప్రభువు ఆయన రాజ్యములోనికి మనలను చేర్చుకుంటాడు.
పునరుత్థానము కావాలని మనము కూడా ప్రార్థన చేద్దాము. తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు.
ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడి యున్నది. కడపటి ఆదాము (యేసు ప్రభువు) జీవింపచేయు ఆత్మ ఆయెను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు. ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది. తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధియై మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పర లోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టిన వాడెట్టివాడో మంచి నుండి పుట్టిన వారు అట్టివారే. పరలోక సంబంధి యెట్టివాడో పరలోక సంబంధులును అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన దాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొన వలసి యున్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి యున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మ్రింగి వేయబడెను అను వాక్యము నెరవేరును. మరణము మ్రింగి వేయబడెను. ఇప్పుడు మరణాన్ని గెల్చి లేచిన యేసు ప్రభువు మరణపు ముల్లు విరిచి వేశాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయమెక్కడ? మరణపు ముల్లు పాపము. పాపమునకున్న బలము ధర్మశాస్తమ్రే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక.
మనము దేనినైతే చేయలేకపోయామో క్రీస్తు సిలువలో చేసిన యాగము ద్వారా చేసి మన పాపాలకు పరిహారము చెల్లించాడు. ఆయన సిలువ మరణ పునరుత్థానము ద్వారా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువు నందు విశ్వాసముంచుట ద్వారా మరణముపైన విజయము పొంది నిత్యజీవానికి వారసులమగుదుము.
యేసు ప్రభువునందు విశ్వాసముంచు వారిని పాపము గాని దాని వలన వచ్చు జీతము మరణము గాని ఏలలేదు. ఇది క్రీస్తు సిలువలో చేసిన యజ్ఞము ద్వారా మరణాన్ని గెల్చి లేచినందున ఆయనను నమ్మిన వారికి కలిగె విజయము. కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసయు ప్రభువునందు వ్యర్థము కాదని యెరిగి స్థిరులును కదలని వారును, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి.
మృతులు క్రీస్తులో పునరుత్థానము చెందుతారు గనుక ప్రభువు పరిచర్యలో ఆసక్తిని కనపరచుదాము. ప్రభువులో ప్రభువు కొరకు పాటుపడుదాము. ఫలము తప్పక ఉంటుంది.
ఒక మాట - ఎలాగూ ఏదో ఒక దినాన అందరూ చనిపోతారు. అయితే క్రీస్తులో ఉన్నవారు, క్రీస్తునందు విశ్వాసముంచిన వారు క్రీస్తు వరుసలో బ్రతికింపబడతారు కాబట్టి, క్రీస్తులో విశ్వాసముంచుదాము. దీనివల్ల నిత్య జీవము పొందుకుంటాము గాని పోయేది ఏమీ లేదుగా. ఆలోచించండి.
అబ్రహాము మృతులను సహితము దేవుడు లేపుటకు సమర్థుడని యెంచినవాడై తన ఏకైక కుమారుని అర్పించి, ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరల పొందెను - హెబ్రీ 11:19.
తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరల తన్ను కనపరచుకొనెను. శిష్యులు కొంతమంది కూడి ఉన్న దగ్గర, యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. పేతురుతోపాటు చేపలు పట్టుటకు అందరూ వెళ్లిపోయారు. యేసు - భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? అని వారిని అడుగగా, లేదని చెప్పారు. రాత్రి అంతా శ్రమించారు. గానీ చేపలు దొరకలేదు. అయితే ఇప్పుడు దోనె కుడిప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. ప్రభువు చెప్పిన ప్రకారము చేస్తే సమృద్ధిగా దొరుకుతాయి. లేకపోతే ఉన్నవి కూడా పోతాయి. జాగ్రత్త! అప్పుడు వారు యేసును గుర్తుపట్టారు. ఆ వలలో నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండి ఉన్నా వల పిగలలేదు. శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి.
వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడవైన సీమోనూ నీవు వీరికంటె నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని చెప్పెను. దానికి యేసు ‘నా గొఱ్ఱెలను మేపుమ’ని చెప్పెను మరలా పేతురును నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినపుడు - నేను నిన్ను ప్రేమించుచున్నావని నీవే ఎరుగుదువని చెప్పెను. అందుకు ప్రభువు - నా గొఱ్ఱెలను కాయుమని చెప్పెను. మూడవసారి కూడ మరల పేతురును అదే ప్రశ్న అడిగినప్పుడు, పేతురు - ప్రభువా నీవు సమస్తము ఎరిగినవాడవు. నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని చెప్పెను. అందుకు యేసు నా గొఱ్ఱెలను మేపుమని చెప్పెను.
యేసు వారితో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడినది. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మము ఇచ్చుచు, నేను బోధించిన సంగతులన్ని బోధించుమని చెప్పెను. అంతేకాదు యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉంటానని వారితో చెప్పెను.
ఈ జీవ వార్త, సజీవ వార్తను రెండు వేల సంవత్సరాల క్రితము శిష్యులకు అప్పగిస్తే, వారు అనేక కష్టాలకు బాధలకు ఓర్చి భూదిగంతాలకు చేరవేశారు. ప్రాణాలకు తెగించి ఈ పరిచర్యను కొనసాగించారు. వారే రాకున్నట్లయితే ఈ సజీవ వార్త మనకు తెలిసేది కాదు. పాపములోనే మగ్గి మరణించేవారము. అయితే ఈ సజీవ వార్తను మన వరకే ఉంచుకొని స్వార్థపరుల వలె ఉందామా? లేక మన వంతుగా ప్రభువు ఆజ్ఞానుసారముగా అనేకులకు అందజేద్దామా? సజీవ వార్తను ఆపటమెందుకు. ముందు తరాలకు అందిద్దాము. దేవుడు మనకొరకు ప్రాణమే ఇచ్చి మనలను బ్రతికిస్తే, మనము ఈ సజీవ వార్త నందించి బ్రతికిద్దాం. ఈ సువార్త ప్రకటించని వారికి శ్రమ అని పౌలు భక్తుడు వ్రాస్తున్నాడు.
మా అమ్మమ్మ చనిపోవుటకు ముందు తొంభై సంవత్సరాల ప్రాయములో నాతో మాట్లాడిన చివరి మాటలు. నేను చనిపోతే భయపడకు. బాధపడకు. నేను వెళ్లి ప్రభువు దగ్గర ఉంటాను. అక్కడ ముందుగా వెళ్లిన మనవాళ్లందరు ఉంటారు. కాబట్టి భయపడకుమని చెప్పి మరణించింది.
క్రీస్తులో అందరూ బ్రతికింపబడతారు.
యెరూషలేము మొదలుకొని భూదిగంతముల వరకు, యుగ సమాప్తి వరకు సాక్షులుగా ఉండుమని శిష్యులకు ఆజ్ఞాపించి బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను.
అందరికీ యేసు పునరుత్థాన పండుగ శుభములు.

-మద్దు పీటర్ 9490651256