ప్రార్థన

ఆదరణకర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును - యోహాను 14:26
కలవరములో ఉన్న శిష్యులకు ప్రభువు పంపిన వరమే ఆదరణ కర్త. మనతో ఎల్లప్పుడు ఉండుటకై ఆదరణ కర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను పంపుతానని ప్రభువు ఇచ్చిన వాగ్దానము. సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును - యోహాను 16:13. సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనచేయును.
శిష్యులకు ప్రభువిచ్చిన వాగ్దానము, మీరు పై నుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి ఉండమని, ఆ ప్రకారమే వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు యోహాను యాకోబు ఆంద్రెయ ఫిలిప్పు తోమా బర్తలోమయి మత్తయి అల్పయి కుమారుడగు యాకోబు జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరు, వీరితో కూడ కొందరు స్ర్తిలును యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వారందరు ఇంచుమించు నూట ఇరువది మంది. పెంతెకోస్తు దినమున అందరు ఒకచోట కూడి ఉన్నప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్ధాత్మ నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి.
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురని వారితో చెప్పిన మాట ఈ పెంతెకోస్తు దినమున నెరవేరి, ఎడతెగక ఏకాత్మతో ప్రార్థన చేస్తున్న వారందరు శక్తి నొందినారు. అప్పటివరకు భయముతో ఉన్న శిష్యులు ఇప్పుడు దేవుని సాక్షులుగా భూదిగంతాల వరకు ఉండుటకు సిద్ధపడ్డారు. చివరకు హతసాక్షులు అవ్వటానికి కూడా వెనుకాడలేదు. అలా మొదలైన సువార్త ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఎంతోమంది ఈ సువార్తను ఆపటానికి ప్రయత్నించినా సిలువ శక్తిని, పునరుత్థాన శక్తిని ఆపలేకపోయారు. ఇది సజీవమైన వార్త. జీవిస్తూ జీవింపజేస్తూనే ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మనలోనే ఉండి పునరుత్థాన శక్తితో నడిపిస్తున్నాడు.
దేవుని సేవ ఆయన శక్తి లేకుండా చేయాలనుకోవటం పొరపాటు. దేవుని పని దేవుని శక్తితోనే చేయాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తరువాత అపొస్తలులు ఎంత గొప్ప కార్యములు చేశారో తెలుస్తుంది. వారి నీడ పడిన వారు కూడ స్వస్థత పొందుకున్నంతగా శక్తిని పొందుకున్నారు. పరిశుద్ధాత్ముడు వారికి ఆత్మీయ శక్తిని బలాన్ని అనుగ్రహించిన కొలది సేవ చేశారు. ఇలా మామూలు మనుషులు చేయలేరు.
పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా దేవుని సేవ చేయటానికి అర్హులు కారు. శిష్యులు ప్రభువు బోధలు విన్నారు. మూడున్నర సంవత్సరములు ప్రభువుతో కలిసి తిరిగారు. ప్రభువు చేసిన గొప్ప కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు అనేకం చూశారు. సర్వసృష్టి ప్రభువునకు ఎలా లోబడినదో చూశారు. లేఖనాల ప్రకారము ప్రభువు సిలువ వేయబడి చనిపోవుట, తిరిగి లేఖనాల ప్రకారము మూడవ దినమున లేచుట, నలువది దినములు శిష్యులతో కలిసి వారిని ధైర్యపరచటము అన్ని జరిగినా, తండ్రి యొద్ద నుండి పరిశుద్ధాత్మను పొందేవరకు వారు పరిచర్యకు వెళ్లలేదు. పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత ఇప్పటివరకు పరిచర్య ఆగలేదు, ఆగదు కూడా. ఇది మనుషులను బ్రతికించే వార్త. నిత్య జీవానికి నడిపించే వార్త. ధైర్యాన్నిచ్చే వార్త. స్వస్థత నిచ్చే వార్త. మంచి మార్గము చూపే వార్త. మనుషులను గౌరవించే వార్త. సహాయం చేసే వార్త. ఆదరించే వార్త. బలపరచే వార్త. పాపాలను తీసివేసే వార్త. రక్షించే వార్త. దైవ వార్త. ప్రేమ వార్త. జీవాన్నిచ్చే జీవవార్త. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. త్రియేక దేవుడు గానీ తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్ముడు వేరు. పరిశుద్ధాత్ముడు సత్య స్వరూపి. ఆయన వచ్చినప్పుడు, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును.
పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని ప్రవచనము ‘యావేలు’ (2:28) గ్రంథమందు ఉన్నది. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులును కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. యవ్వనులు దర్శనము చూతురు. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు. మన దేహాలు పరిశుద్ధాత్మకు నిలయము. అడుగు ప్రతివారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా తండ్రి అనుగ్రహిస్తాడు - లూకా 11:13. విశ్వాసంతో ప్రార్థించాలి.
నేను దప్పిక గలవారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను - యెషయా 44:3.
నిర్గమ కాండములోనే జనులు - విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కఱ్ఱను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి యున్నాను - నిర్గమ 31:3. ఆ దినాలలో అవసరమును బట్టి ఆత్మ నడిపింపు ఉండేది.
పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు శక్తిని పొందుకుంటాము. సాక్ష్యమివ్వటానికి శక్తిని, అంతేకాదు సాతానుని ఎదిరించటానికి శక్తి పొందుకుంటాము. శోధనలలో నిలువ గలుగుతాము. ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొని నిలువ గలుగుతాము. ఈ పరిశుద్ధాత్మ మన అందరికీ అవసరము. శరీర క్రియలను లయ పరచాలంటే పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరము. ఈ శక్తి మనలో ఉంటేనే జీవము సమాధానము కలిగి ఉంటాము.
మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా నివసింప జేయును - రోమా 8:11. ఆత్మ జీవింప చేయును. - 2 కొరింథీ 3:6
ఆత్మయే జీవింపచేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను నీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై యున్నవి - యోహాను 6:63
ప్రభువు చెప్పిన మాటలు నిత్య జీవాన్ని ఇచ్చే మాటలు - యోహాను 6:68 లో పేతురు ప్రభువు మాటలలో నిత్య జీవమున్నదని చెప్పుచున్నాడు.
ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై యున్నది. మనుషులు సమాధానము కొరకు ఏవేవో చేస్తున్నారు. కానీ అది పరిశుద్ధాత్ముని ద్వారా మనకు లభిస్తుంది. దేవునికి విధేయులైన వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు.
ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్య్రముండును - 2 కొరింథీ 3:17. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను.
దేవుని ఆత్మ మనలో ఉంటే, మనము వెళ్లవలసిన మార్గమును స్పష్టముగా తెలియజేస్తాడు. ఎక్కడ నడవాలి. ఎక్కడ నడవకూడదు. ఎక్కడ కూర్చోవాలి. ఎక్కడ కూర్చోకూడదు ఎక్కడ నిలవాలి ఎక్కడ నిలువకూడదు అంతా స్పష్టముగా తెలియజేసే దేవుడు. ఆదరించే ఆదరణకర్త. దినములు చెడ్డవిగనుక ఈ దినాలలో మనము ఆత్మపూర్ణులమై ఉండాలి. లేకుంటే సాతానుడు ఏదో ఒక శోధనలో పడవేసి జీవితాన్ని అయోమయ స్థితిలోనికి పడదోస్తాడు. దానిని సరిదిద్దుకునే లోపల సమయమంతా అయిపోవచ్చు. శరీరానుసారమైన మనస్సు మరణము. అయితే ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.
దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు - రోమా 8:14. తన్ను ఎందరంగీకరించిరో వారి కందరికి అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను - యోహాను 1:12. ప్రభువు నందు విశ్వాసముంచి ఆయన మాటల ప్రకారము నడిచేవారే ఆయన కుమారులు. పరిశుద్ధాత్మను పొందుకోకపోతే దురాత్మ మనలను ఆవరించి చెడు మార్గములో నడిపించి పాపానికి గురి చేస్తుంది. దాని అంతము మరణము. దేవుని ఆత్మ మనలను పాపమునకు దూరముగా ఉంచుతుంది. శరీర క్రియలను లయపరుస్తుంది.
ఆయనను ఎరిగి యున్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనువాడు అబద్ధీకుడు. వానిలో సత్యము లేదు. ఆయన వాక్యమును ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచియున్నానని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే నడుచుకొనబద్దుడై యున్నాడు - 1 యోహాను 2:4-6
ప్రభువును ప్రేమించటమంటే ఆయన మాటలు గైకొనుటయే. అప్పుడు తండ్రి వారిని ప్రేమించి వారిలో నివాసముంటాడు - యోహాను 14:23
ఆత్మీయముగా ఎదిగే కొద్దీ ఆత్మ ఫలము వస్తుంది. తద్వారా మనలో నుండి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము బయటకు వస్తాయి. ఆత్మానుసారముగా నడిచేవారు శరీరమును దాని ఇచ్ఛలతోను దురాశలతోను సిలువ వేసి యున్నారు. అప్పుడు ఆత్మ ఫలించును.
నరులందరి మీద పరిశుద్ధాత్మ నుంచుతానని తండ్రి ఇచ్చిన వాగ్దానమును కోరుకుందాము. పరిశుద్ధాత్మ లేకుండా దేవుని వాక్య పఠనము చీకటింట్లో సరకులు వెదకినట్లు ఉంటుంది. ఎన్నిసార్లు చదివినా ఉపయోగముండదు. అది వర్షము లేని పైరులాగానే ఉంటుంది. పరిశుద్ధాత్మ లేకుండా యేసు ప్రభువును స్పష్టముగా తెలుసుకోలేము. మన కోసం మృతి చెంది తిరిగి లేచిన ప్రభువును గూర్చి తెలియాలంటే పరిశుద్ధాత్ముడు బోధించాల్సిందే. పరిశుద్ధాత్మ లేకుంటే దురాత్మ మనలను జీవము లేకుండా చేస్తుంది. పరిశుద్ధాత్మను పొందుకోవటం ఎంతో శ్రేష్ఠము. తండ్రిని కుమారుని నామములో ప్రార్థించితే కరుణతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు.
దేవుడు పంపిన ఆదరణకర్తను పొందుకొని, ధైర్యంగా సంతోష సమాధానాలతో జీవిస్తూ అనేకులకు ఆదరణగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయును గాక.

-మద్దు పీటర్ 9490651256