ప్రార్థన

ఆత్మీయ వరములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కృపా వరములు నానావిధములుగా ఉన్నవి. కాని ఆత్మ యొక్కడే. మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి. కాని ప్రభువు ఒక్కడే. నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడొక్కడే.’ -1 కొరింథీ 12:4-6
అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలాగనగా ఒకరికి ఆత్మమూలముగా బుద్ధి వాక్యమును మరియొకనికి ఆత్మ ననుసరించిన జ్ఞాన వాక్యమును మరియొకనికి ఆత్మ వలననే విశ్వాసమును మరియొకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరియొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడి యున్నది.
అయినను వీటన్నిటిని ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. క్రీస్తు రక్షకుడని మన కొరకు సిలువలో ప్రాణమిచ్చి మన పాపములకు వెల చెల్లించాడని, మరణించి తిరిగి లేచాడని నమ్మి అంగీకరించిన వారికి, ఆయనకు విధేయులైన వారికి, ఆయనను ప్రార్థించిన వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. పరిశుద్ధాత్మను పొందుకున్న వారికి ఆత్మవరములు తన చిత్తము చొప్పున అనుగ్రహిస్తాడు. ఈ వరాలు అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి అనుగ్రహిస్తాడు. విశ్వాసులు దేవుని సేవ చేయటానికి, సాక్షులుగా ఉండుటకు ఆత్మీయ వరములు ఎంతైనా అవసరము. ఆత్మీయ వరాలు లేకపోతే బలమైన సేవ చేయలేరు. ఆత్మీయ వరములు పొందుకున్న వారందరు ఆత్మీయముగా జీవించాలి. కానీ చాలామంది ఆత్మీయ వరములు ఉండినప్పటికీ శరీర సంబంధుల వలెనే ఉన్నారు. అసూయ కలహము విభేదములు కోపతాపాలు ఉంటే శరీర సంబంధులే. శరీర సంబంధములు ఎదుటి వారికి మేలు చేయలేరు. అయితే దేవుని ఆత్మను పొందుకున్నవారు ఎదుటివాని కొరకు మేలు చేసేవారుగా ఉండాలి. అదే మనకు గుర్తు. ఎవడును తన కొరకు కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. -1 కొరింథీ 10:24
దేవుడిచ్చిన ఈ వరాలు ఎదుటివాని మేలు కోసము, సంఘ క్షేమాభివృద్ధి కోసమే ఉండాలి. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో, అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్తమ్రును ప్రవక్తల ఉపదేశమునై యున్నది. -మత్తయి 7:12.
ఆత్మఫలమేమనగా, ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘ శాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. -గలతి 5:22-24
మనము ఆత్మ ననుసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. దేవుని ఆత్మ మనలో ఉంటే మనలను క్రమముగా నడిపిస్తుంది. క్రమము లేకపోతే అక్రమమే. అక్రమాన్ని దేవుడు సహించడు.
దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, ఆత్మానుసారముగా జీవిస్తున్నప్పుడు ప్రభువు మనకు వరాలు ఫలాలు అనుగ్రహిస్తాడు. ఈ వరాలు ఫలాలు మన కష్టార్జితము కాదు, దేవుని వరాలు. ఆత్మానుసారముగా జీవించని వారిలో ఈ ఫలాలు, వరాలు కనబడవు. ఫలము రావాలంటే ఒక పద్ధతి ఉంది. ముందు విత్తనము నాటాలి. అది మొలిచి పెద్దదై ఒక చెట్టుగా ఎదిగి మొగ్గలు పువ్వులు కాయలు వచ్చినట్లు ఆత్మీయ ఫలము కూడా అంతే. ముందు ప్రభువును విశ్వసించినప్పుడే ప్రేమ సంతోషము సమాధానము పుట్టుకొస్తాయి. వాటిని భద్రపరచుకుంటే దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం కలుగుతాయి. వాటికి మించిన నియమమేదియు లేదు. దళూళ జఒ శ్య ఘతీ ఘ్ఘజశఒఆ దజఒ.
మంఛి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై యొకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించునని ప్రభువు సెలవిచ్చాడు. వాక్యము విని గ్రహించాలి. లేకుంటే ఉపయోగము లేదు -మత్తయి 13:23. దేవుని వాక్యము విని దాని ప్రకారము జీవించేవారే బండపైన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలినవారని ప్రభువు సెలవిచ్చాడు.
క్రైస్తవ కుటుంబములో పుట్టినంత మాత్రాన క్రైస్తవుడివి కాదు. క్రీస్తును విశ్వసించాలి. వెంబడించాలి. ఆయన మాట చొప్పున నడవాలి. శరీర ఆశలు నేత్రాశలు విడవాలి. జీవపు డంబమును వదలి ఆత్మానుసారంగా జీవిస్తుంటేనే, ప్రభువు కార్యము మొదలై ఆయన అమూల్యమైన తలాంతులు ఒక్కొక్కరికి ఆయన చిత్తప్రకారము అనుగ్రహిస్తాడు. ఫలించని జీవితాలు ఆయనకు ఇష్టము లేదు. ఫలించని తీగలను చెట్లను తీసి అగ్నిలో కాల్చివేస్తానంటున్నాడు. ఇది నిజము. ఫలాలు ఇవ్వని మామిడిచెట్లు మనము ఉంచుకోము గదా. అలానే ప్రభువు కూడ ఫలించని చెట్లు నరికివేస్తానంటున్నాడు.
దేవుడు ఎవరి సామర్థ్యము కొలది వారికి వరములు ఇస్తాడు. వాటిని వాడిన వారిని బహుగా ఆశీర్వదిస్తాడు. భళా నమ్మకమైన దాసుడా! కొంచెములో నమ్మకముగా ఉన్నావు గనుక అనేకమైన వాటి మీద నియమిస్తాను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని చెప్పును. ఏమి చేయక ప్రభువిచ్చిన వరములను ఉపయోగించని వారిని పనికిమాలిన వాడుగ గుర్తించి, వానికిచ్చిన తలాంతులు తీసివేసి బాగుగ పనిచేసిన దాసునికి ఇచ్చినట్లు తెలుస్తుంది. అందుకే కలిగిన ప్రతివానికి ఇయ్యబడును. అతనికి సమృద్ధి కలుగును. లేనివాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు ఆ పనికిమాలిన దాసుని వెలుపటి చీకటి లోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను. -మత్తయి 25:14-30
మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట మరికొందరిని బోధకులుగాను, కొందరిని అద్భుతములు చేయువారిగాను, కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను కొందరిని నానా భాషలు మాటలాడువారిని గాను నియమించెను.
ప్రభువిచ్చిన రక్షణ అధికారము వరములు అన్ని ఉచితముగా పొందారు గనుక - ఉచితముగానే ఇయ్యాలి. జాగ్రత్త! దేవుని సేవ ఉచితముగానే చేయాలి. అది దేవుని ఆజ్ఞ. దేవుని వరాలు వాడి దేవునికి మహిమ తేవాలిగాని సొంతానికి కాదు. దేవుని వరాలు వాడి ధన సంపాదనలో పడకూడదు. మనము పేరు ప్రఖ్యాతులు ఆస్తిపాస్తులు కోరుకుంటే - వారి ఫలము వారు పొందుకున్నారు గనుక - దేవుని దగ్గర నుండి ఎటువంటి ఆశీర్వాదము పొందుకోలేరు. సేవ ఆత్మల సంపాదన కోసము గాని -ఆస్తుల సంపాదన కోసం కానేకాదు. అలా లోకమంతా సంపాదించినా ప్రయోజనముండదు. భ్రమపెట్టే ఆత్మ చాలా ఉధృతంగా కార్యము చేస్తుంది. మన సేవ - దేవుని ఆజ్ఞానుసారముగా ఉందా లేక భ్రమపెట్టే ఆత్మానుసారముగా ఉందా మనలను మనమే పరీక్షించుకుంటే మంచిది.
దేవుని ఆశీర్వాదాలు వరాలు కావాలి. ఇటు లోక ఆశలు కోరికలు తీరాలంటే కుదరదు. కాలేజీ మానేసి సినిమాలకు వెళితే - పరీక్షలలో మార్కులు రావు. మంచి మార్కులు రాకపోతే మంచి ఉద్యోగము రాదు. ఇక వివాహము చాలీచాలని జీతాలు పిల్లలు కష్టాలతో జీవితం వెళ్లబుచ్చాల్సి ఉంటుంది. అందరికి అన్ని మేలులు కావాలి. అనవసరమైన విషయాలు కావాలి అన్నట్టు ఉంటారు. అలా కాదు. దేవుని ఆశీర్వాదాలు వరాలు కావాలంటే దేవుడు చెప్పినట్లే చేయాలి. పొరుగు వారిది ఏదీ ఆశించవద్దన్నాడు గనుక పొరుగు వారివి ఆశించకూడదు. పోతిఫర్ భార్య విషయములో యోసేపు దేవుని ఆజ్ఞను అనుసరించి ఆమెను కూడనందుకు ప్రభువుయోసేపును ఎంతోఉన్నత స్థితికి హెచ్చించాడు. దేవుని ఆశీర్వాదాలు చాలా ఉన్నతము. భూమికి ఆకాశము ఎంత ఉన్నతమో మన యెడల ఆయన తలంపులు అంత ఉన్నతము. అందరికి అంత ఉన్నత స్థానాలు పొందుకోవాలని ఆశ ఉంటుంది. కానీ చిన్నచిన్న అల్పకాల పాప భోగాలు అంటే - టీవీ సీరియల్స్, సెల్‌ఫోన్ చాట్స్, ఫేస్‌బుక్, వాట్సప్, సిగరెట్లు, సినిమాలు, డ్రింక్స్, కార్డ్స్, గాంబ్లింగ్, రేసెస్, బెట్టింగ్, వ్యభిచారము, సరసాలు, కామపు చూపులు మొ. వదులుకుంటే స్వస్థపరచు వరములు అద్భుతాలు చేయు శక్తి ప్రవచన వరములు ఉపకారములు చేయు వరము ప్రభుత్వములు చేయు వారిగా ఇంకా ఎన్నో వరాలు, ఆశీర్వాదాలు ప్రభువు ఇస్తాడు.
పంతాలు పగలు కోపతాపాలు ఆపుకోలేక దేవుని ఉన్నతమైన వరాలు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాడు.
మనము కూడ మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునై యుండి దుష్టత్వము నందును అసూయ యందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరి నొకడు ద్వేషించుచు ఉంటిమి. -తీతు 3:3
అయితే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనలను రక్షించెను. గనుక ఇక శరీరానుసారము గాక ఆత్మానుసారమున జీవించుచు ఆత్మ దేవుడు అనుగ్రహించె వరాలు ఆశీర్వాదాలు ఆత్మ ఫలము పొందుకొని అనేకులకు ఆశీర్వాదముగా ఉంటూ సంతోష సమాధానాలతో ఉండాలని ప్రార్థన. ప్రభువిచ్చిన తలాంతులు వాడి భళా మంచి దాసుడా కొద్దిలో నమ్మకముగా ఉన్నావు గనుక అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అందరూ అనిపించుకోవాలని ఆశతో.

-మద్దు పీటర్ 9490651256