ప్రార్థన

ఆత్మీయ సహవాసము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడ ఉన్నావు నావన్నియు నీవే’ - లూకా 15:31
దేవునితో ఉంటే సమస్తము మనవే. మన కోసమే ఈ సృష్టి అంతా. సమాధానానికి కర్త గనుక సమాధానము బలవంతుడైన దేవుడు కనుక బలము కలిగి ఉంటాము. బలవంతులమంటే మనుషులను బెదిరించే బలము కాదు. బెదిరింపులకు భయపడని బలము. కష్టనష్టాలకు నిలువకలిగే బలము. అన్నిటిని ఓర్చుకునే బలము. అంతేకాదు. కష్టాల నుండి గట్టెక్కించే బలము. నష్టాలను పూడ్చే బలము. ఆదరించే బలము. ఆదుకునే బలము మనము కూడా పొందుకుంటాము. సృష్టికర్తయైన తండ్రితో ఉండకపోతే చేప సముద్రము నుండి బయటకు వచ్చిన చందంగా ఉంటుంది. శక్తి ఉండదు. బలము ఉండదు. చేప నీటి నుండి బయటపడి చనిపోయినట్లే మనము కూడా దేవుని చేయి విడిచి, ఆయన సహవాసము విడిచి బయటకు వస్తే ఆత్మీయ మరణమే. లోకములో నీతి న్యాయము లేకుండా ఇష్టానుసారముగా ఉంటుంది.
‘తనను ఎందరంగీకరించిరో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము ఇచ్చెను’ - యోహాను 1:12. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము తండ్రీ అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మలో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. దేవుని పిల్లలము కనుకనే దేవుడు కావాలనే ఆరాటము తపన ఉంది. అందుకే ఆయనతోనే ఉండాలి. అప్పుడే తృప్తి. తండ్రి దగ్గర ఉంటే ఆయన పిల్లలముగా ఆయనకు వారసులము.
మరియు కుమారులు కుమార్తెలు ఐనందున నాయనా తండ్రీ అని మొఱ్ఱ పెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను - గలతి 4:6.
మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై యుండి వాగ్దానము ప్రకారము వారసులై యున్నారు.
అయితే రానురాను దేవునికన్న దేవుడు సృష్టించిన మనలను ప్రేమిస్తున్నారు. మనుషుల ప్రేమ తాత్కాలికము. అది వాతావరణాని కనుగుణంగా హెచ్చుతగ్గులు జరుగుతుంది. కాని దేవుని ప్రేమ మారనిది గనుక దేవుని ప్రేమించి ఆయనతోనే ఉండాలి. ఆయన ఆజ్ఞ ప్రకారము తోటి వారిని ప్రేమించాలి. అలాగని ప్రభువును మరచిపొమ్మని కాదు. ప్రభువుతో ఉంటూ సహవసిస్తూ తోటివారిని ప్రేమించాలి. అది నిజమైనది. దేవునితోనే ఉండటమంటే ఒక గిరి గీసి దానిలోనే ఉండటం కాదు. మనము ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా దేవుని ధ్యాస కలిగి ఉండాలి. ప్రభువు ఆత్మ గనుక ఆత్మలో ప్రభువుతోనే ఉండాలి. ఆయన ధ్యాసలోనే ఉండాలి. అలాగని మనుషులకు దూరంగా ఉండమని కాదు. నీవు ఎక్కడ ఉన్నా ప్రభువును ధ్యానిస్తూ ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటే చాలు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు మన ప్రభువు. ఆయన మనతోనే ఉండే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలనగా దేవుడు మనకు తోడని అర్థము. ఆయన మన హృదయాలలో ఉండటానికి ఇష్టపడే దేవుడు. మనమే ఆయనకు ఆలయము. దేవుడు మనతో ఉంటే సమస్తము మనవే. పౌలైనను అపొల్లోయైనను కెఫాయైనను లోకమైనను జీవమైనను మరణమైనను. ప్రస్తుతమందున్నవియైనను రాబోవునవియైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తువారు. క్రీస్తు దేవుని వాడు - 1 కొరింథీ 3:22-23.
దేవుని ప్రేమించి ఆయనతో ఉంటే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కష్టాలలో నష్టాలలో శోధన వేదనలలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో కూడ ప్రభువుని విడువని యోసేపు, ప్రభువు మాటల ప్రకారము జీవిస్తున్న యోసేపు చివరకు గొప్పవాడిగా అయ్యాడు. దేశము కాని దేశములో రాజు అంత హోదాకు హెచ్చించబడ్డాడు. దేవుడే మనలో ఉంటే మనము దేవునిలో ఉంటే ఎంత ఎత్తుకైనా తీసుకువెళ్లగలడు. ఏదైనా చేయగలడు. ఆయన సర్వశక్తిమంతుడు.
అయితే మనిషి అప్పుడప్పుడు లోకపు తళుకుబెళుకులు చూచి లోకాన్ని ప్రేమించి దేవునికి దూరవౌతున్నాడు. తప్పిపోయిన కుమారుని సంగతి అదే. అంతా క్షేమంగా సమాధానముగా ఉంటే చాలనట్లు తండ్రి సంరక్షణ నుండి బైటకు వచ్చి సమస్తము పోగొట్టుకున్నాడు. చివరకు స్నేహితులు కూడా విడిచివెళ్లారు. తనదనుకున్న లోకము మాయేనని అర్థమైంది. తిరిగి మరలా తండ్రి దగ్గరకు రాగానే పోగొట్టుకున్న పూర్వ వైభవము తండ్రి ప్రేమ ఆస్తి అంతస్తులు మరల పొందుకున్నాడు. ఏ కారణము చేతనైనా దేవునికి దూరముగా ఉన్నావేమో లేక అంతా సౌఖ్యమే గనుక నీకు దేవుడు ఎందుకు అనుకుంటున్నావేమో. జాగ్రత్త! సముద్రాన్ని వదిలితే నష్టము చేపకే. కాబట్టి అల్పకాల భోగాలతో కూడిన లోకమును స్నేహించి మోసపోకు. అంతా నష్టపోయేసరికి దేవుని దగ్గరకు వెళ్లే అవకాశము పోతుందేమో. జాగ్రత్త!
ప్రభువుతో ఉంటే జీవమైయున్న దేవుడు గనుక మనకు నిత్యజీవాన్ని ఇస్తాడు. ఈ అశాశ్వత లోకము నుండి శాశ్వతమైన లోకానికి మనలను జాగ్రత్తగా నడిపిస్తాడు. ప్రభువే జీవాధిపతి జీవాహారము జీవజలము. బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు ఆయనలో గుప్తమై యున్నవి. గనుక ప్రభువు మనతో ఉంటే ఈలోకములో ఏదీ మనకక్కరలేదు. తృప్తి కలిగి ఉంటాము. కొన్నికొన్ని చిక్కు సమస్యలతో త్వరగా పడిపోవచ్చు కానీ క్రీస్తులో ఉంటే పడిపోయినా తిరిగి లేచి ముందుకు సాగగలము. అట్టి నిరీక్షణను ఇచ్చిన ప్రభువుకు వందనాలు. జీవాధిపతి యేసే గనుక, యేసులో ఉన్నవారికి నిత్యజీవము లభిస్తుంది. దేవుడు లేకుండా లోకమంతా సంపాదించినా జీవము లేకుంటే ఉపయోగము సున్నా. గనుక ప్రభువుతోనే ఎల్లప్పుడు ఉందాము. జీవాహారము ఆయనే గనుక మనకు ఏ లోటు ఉండదు. జీవజలము ఆయనే గనుక తృప్తిగా ఉంటాము.
మరణము కూడా మనదే. ఎందుకంటే ఈ లోక పాపము నుండి బాధల నుండి వ్యాధుల నుండి తప్పించి విడుదల నిచ్చి మేలైన జీవితాన్ని పొందుకుంటాము. మహిమ శరీరాన్ని పొందుకుంటాము. ఈ క్షయమైన శరీరము అక్షయతను ధరించుకొంటుంది. విశ్వాసికి మరణము దేవుని దగ్గరకు వెళ్లటానికి ఒక ద్వారము లాంటిది. క్రీస్తు మరణాన్ని జయించాడు గనుక ఆ విజయము కూడా మనదే. అందుకే పౌలు ఫిలిప్పీయులకు ‘బ్రతుకుట క్రీస్తే. చావైతే లాభమ’ని వ్రాశాడు. కనుక బ్రతికినా చనిపోయినా దేవునితో ఉన్న వారికి లాభమే.
ప్రస్తుతమందున్నవన్నీ మనవే. సర్వసృష్టి మనకొరకే. మంచి చెడు సుఖదుఃఖాలు సంతోష సమాధానము ప్రేమ నీతి అక్కడ ఉంటాయి. చీకటి ఉండదు. కన్నీరు తుడువబడును. శాపగ్రస్తమైనదేదీ ఉండదు. జీవ వృక్షమునకు ఆటంకముండదు. దైవ దర్శనము సదా ఉంటుంది.
మనము దేవునితో ఉంటే మరణమైన జీవమైన ప్రధానులైన ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్య్రము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. -2 కొరింథి 8:9.
సర్వశక్తిగల దేవునితో మనమున్నప్పుడు ఇక ఏ శక్తి మనలను బలహీనపరచలేదు. భయపెట్టలేదు. భ్రమ పెట్టలేదు. జాగ్రత్త!! భ్రమ పెట్టే ఆత్మలు లోకములో విచ్చలవిడిగా ఉన్నాయి. కనుక అన్నింటిలో విజయము మనదే. సాతానుని సుళువుగా ఎదిరించగలము. అదే మన సొంత శక్తిచేత చిన్న నిందను ఓర్చుకోలేము. చిన్న సమస్యను సరిగ్గా పరిష్కరించలేము. అవమానాన్ని సహించలేము. కానీ దేవుని తోడు ఉంటే సిలువను కూడా భరించగలము. గొల్యాతు లాంటి వారిని ఎదిరించగలము. సింహపు నోళ్లను మూయగలము. ఎలుగుబంట్లను చీల్చి వేయగలము. అప్పుడు సాతానుడు మన యొద్ద నుండి పారిపోతాడు.
మన కష్టాలను నష్టాలను శోధనలను తుపాను లాంటి సమస్యలను చూస్తూ ఉండే దేవుడు కాదు మనలో ఉన్న ప్రభువు వాటిని జయించే శక్తినిచ్చే దేవుడు.
జీవ కిరీటము: శోధనలలో శ్రమలలో స్థిరముగా ఉండాలంటే మన వల్ల కానే కాదు. కానీ ప్రభువుతో ఉంటే ఆయన శక్తితో స్థిరముగా ఉండగలము. అప్పుడు జీవ కిరీటము ఇస్తానని ప్రభువు వాగ్దానమిచ్చాడు.
సింహాసనము: క్రీస్తు ఈ లోకమును జయించినట్లు మనము కూడా నేత్రాశ శరీరాశ జీవపు డంబము జయించాలంటే ప్రభువుతోనే ఉండాలి. అప్పుడే జయించగలము. జయించగలిగితే ప్రభువుతో కూడా సింహాసనము మీద కూర్చుండనిస్తాడు.
మన ఆలోచనలు ఊహలు తలంపులలో కూడా దేవుని దగ్గరే ఉండాలి. వాస్తవానికి మన ఆలోచనలను మళ్లించి వేర్వేరు తలంపులు పుట్టించి ఊహలలో కూడా దేవునికి దూరముగా చేస్తాడు సాతానుడు. ప్రభువుకు దూరముగా ఉండి లోకపరముగా ఆలోచిస్తాము. లోక సహాయము కోరుకుంటాము. దానివల్ల పరిస్థితి ఇంకా జఠిలవౌతుంది. ఏ సమయమైన ఏ స్థితికైనా ప్రభువుతో ఉంటేనే మనకు లాభము. ప్రభువు శక్తిని జ్ఞానమును బుద్ధి బలము ఇచ్చి శోధన జయించే భాగ్యమిస్తాడు.
అన్ని విషయాలు సౌకర్యంగా ఉన్నప్పుడు కూడా ఇక దేవుడెందుకు అనుకుంటారు. లోకానికి దగ్గరౌతారు. వస్తువులకు వాహనాలకు ఆస్తిపాస్తులకు విలువనిస్తారు. ఈ లోకాన్ని స్నేహిస్తాడు. ఈ లోకముతో స్నేహము దేవునితో విరోధమే.
కలిమిలోను లేమిలోను వ్యాధి బాధలలో కూడా ప్రభువుతో ఉంటేనే మనకు మేలు. ఎందుకంటే ఆయనే మనకు కొండ కోట ఆశ్రయ దుర్గము. మనము దాగుచోటే ఆయనే. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో యెహోవా మహా దుర్గముగా ఉంటాడు. ప్రభువు మనకు దాగుచోటు గనుక ఆయనతో ఉంటే మనకు భద్రత ఉంటుంది. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉంటాడు. మనము ప్రభువుతో ఉంటే ఆయన మనకు తోడుగా ఉండి బలపరుస్తాడు. -యెషయా 41:10. ప్రభువు సన్నిధి మనకు తోడుగా ఉండి విశ్రాంతి కలుగజేస్తాడు. నీ ముందర నడుచువాడు యెహోవా. ఆయన నీకు తోడై యుండును. ఆయన నన్ను విడువడు ఎడబాయడు. రక్షిస్తాడు బలపరచువాడు. కృప చూపువాడు. నిన్నా నేడు నిరంతరము ఏకరీతిగా ఉండువాడు. విడువని ఎడబాయని ప్రభువుతో ఉంటూ ఆయన ఇచ్చే ఈవులన్నిటిని అందరూ ఇహ పరములలో పొందుకోవాలని ప్రార్థన.

-మద్దు పీటర్ 9490651256